India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

US ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ అర్ధరాత్రి 1.30గం.లకు(భారత కాలమానం ప్రకారం) దిగుమతులపై టారిఫ్స్ ప్రకటించనున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్స్ పెరిగితే అమెరికన్ కంపెనీలు ఆ భారాన్ని ఎగుమతిదారులపై వేస్తాయి. ఫలితంగా ఆయా దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైట్‌హౌజ్ మీడియా సెక్రటరీ కరోలిన్ భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

HCUని అంటిపెట్టుకొని ఉన్న 400 ఎకరాల కంచె భూములతో యూనివర్సిటీకి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ భూములను అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అవకాశం ఉందని చెబుతోంది. అయితే ఈ ప్రాంతం వర్సిటీకి చెందినదని, అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యం దెబ్బతీస్తున్నారని విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు.

HYD గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించడం వివాదాస్పదం అవుతోంది. వేలాది చెట్లతో నగరానికి ఆక్సిజన్ అందిస్తోన్న ప్రాంతాన్ని అర్బనైజేషన్ చేయడం ఎందుకని ప్రకృతి ప్రేమికులు, HCU స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి నేపథ్యంలో పర్యావరణానికి కొంతమేర నష్టం కలగక తప్పదని.. ఇప్పటి హైటెక్ సిటీ కూడా అలానే వచ్చిందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

కరోనా గుర్తులు చెరిగిపోక ముందే రష్యాలో కొత్త వైరస్ కలవరపెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వైరస్ వల్ల దగ్గితే రక్తం వస్తోందనే వదంతులూ వ్యాప్తి చెందాయి. ఈ వార్తలను ఆ దేశ అధికారులు కొట్టి పారేశారు. ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందలేదని, అది సాధారణ శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ అని స్పష్టం చేశారు. అయితే, కొందరు తాము జ్వరం, దగ్గుతో బాధపడుతున్నామని చెబుతూ టెలిగ్రామ్‌లో వీడియోలు షేర్ చేసినట్లు సమాచారం.

‘ఆదిత్య 369’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన మోహిని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె అసలు పేరు మహాలక్ష్మి శ్రీనివాసన్. ఈ హీరోయిన్ ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడిన మోహిని మత ప్రచారకురాలిగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో డిటెక్టివ్ నారద, హిట్లర్‌తో పాటు ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించారు. కాగా ఆమె నటించిన ‘ఆదిత్య 369’ ఎల్లుండి రీరిలీజ్ కానుంది.

ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్(65) కన్నుమూశారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో ఆయన బాధపడుతున్నారని, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్(1995)’ సినిమాలో టైటిల్ రోల్‌తో కిల్మర్ ప్రసిద్ధి పొందారు. టాప్ గన్, టాప్ గన్: మావ్రిక్, విల్లో, ది డోర్స్, టాప్ సీక్రెట్ వంటి చిత్రాల్లో ఆయన నటించారు.

PBKSతో నిన్నటి మ్యాచ్‌లో LSGకి ఘోర ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా పంత్‌తో సీరియస్‌గా మాట్లాడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గతంలో LSG కెప్టెన్ రాహుల్‌తో ఇలాగే మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆ ప్లేయర్ జట్టుకూ దూరమయ్యారు. కాగా, వేలంలో రూ.27 కోట్లు పలికిన పంత్ 3 మ్యాచుల్లో 17 పరుగులే చేయడం, జట్టు ఓడిపోతుండటంపై ఆయన క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.

ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బుర్ఖా సిటీ’ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశారు. దీంతో ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ స్టోరీని దొంగిలించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చేయడంలో వారెప్పుడూ నిరాశపరచరని సెటైర్లు వేస్తున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023లో విడుదలైంది.

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న దేశం ‘కైలాస’ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లు వెల్లడించింది. నిత్యానంద జీవ సమాధి అయి చనిపోయారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ నిన్న వెల్లడించారు. దీంతో ఆయన భక్తులు, అనుచరులు శోక సంద్రంలో మునిగిపోగా.. తాజా ప్రకటన వారికి ఊరట కలిగించింది. కాగా, నిత్యానంద ‘కైలాస’ సౌత్ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఉంది.

వక్ఫ్ సవరణ బిల్లుకు YSRCP వ్యతిరేకంగా ఓటు వేయనుంది. లోక్ సభ, రాజ్యసభ రెండింట్లోనూ ఈ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించింది. తాము రాజకీయంగా దెబ్బతిన్నా సరే ఈ బిల్లును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని స్పష్టం చేశారు. అటు ఈ బిల్లుపై టీడీపీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడింటిని కేంద్రం ఆమోదించింది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నిపుణులతో చర్చించారు.
Sorry, no posts matched your criteria.