News April 6, 2025

ముస్లింలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ కవిత

image

TG: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే బీజేపీ సర్కారు బిల్లును ఆమోదింపజేసుకుంది. ముస్లింలకు తీవ్ర నష్టం చేకూర్చే ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. మైనారిటీల తరఫున మా పార్టీ పోరాడుతుంది. గతంలోనూ వారి అభివృద్ధి, సంక్షేమానికి మేం కృషి చేశాం’ అని గుర్తుచేశారు.

News April 6, 2025

విచారణకు మళ్లీ గైర్హాజరైన కమ్రా

image

కమెడియన్ కునాల్ కమ్రా మూడోసారీ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. మహారాష్ట్ర Dy.CM శిండేపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు సమన్లు ఇచ్చిన పోలీసులు నిన్న విచారణకు రావాలంటూ నోటీసులు పంపగా వాటికి ఆయన స్పందించలేదు. తమిళనాడులోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా అక్కడ లేకపోవడంతో వాట్సాప్‌లో సందేశం పంపించామని, కమ్రా నుంచి స్పందన లేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

News April 6, 2025

తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలు

image

Y సూర్యనారాయణ(శ్రీరామపాదుకా పట్టాభిషేకం), P సుబ్బారావు(లవకుశ-మొదటిది), ANR(సీతారామజననం), CSR ఆంజనేయులు(పాదుకా పట్టాభిషేకం) NTR(సంపూర్ణ రామాయణం(తమిళం), లవకుశ, రామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం), శోభన్‌బాబు(భక్తపోతన, సంపూర్ణ రామాయణం), హరనాథ్ (సీతారామ కళ్యాణం, శ్రీరామకథ), కాంతారావు(వీరాంజనేయ), NBK (శ్రీరామరాజ్యం), Jr.NTR (రామాయణం), సుమన్(శ్రీరామదాసు), శ్రీకాంత్(దేవుళ్లు), ప్రభాస్(ఆదిపురుష్‌).

News April 6, 2025

ధోనీ వేగంగా ఆడేందుకే చూశారు.. కానీ: కోచ్ ఫ్లెమింగ్

image

నిన్న రాత్రి CSKvsDC మ్యాచ్‌లో ధోనీ 26 బంతులాడి 30 పరుగులే చేయడంతో జట్టు గెలవాలన్న కసి లేకుండా ఆడారంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. వాటి గురించి ఆ టీమ్ కోచ్ ఫ్లెమింగ్ స్పందించారు. ‘గెలవాలన్న కసితోనే ధోనీ ఆడారు. కానీ మా బ్యాటింగ్ సమయానికి పిచ్‌ బాగా నెమ్మదించింది. ఆ ఆట చూడటానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ అక్కడ ఆడేవారికి పిచ్ మరింత కష్టంగా ఉంది’ అని పేర్కొన్నారు.

News April 6, 2025

జుట్టు రాలుతోందా.. ఇలా చేస్తే మేలు!

image

జుట్టు రాలడమనే సమస్యను నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. శిరోజాలపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణమని హెయిర్‌కేర్ నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లకు క్రమం తప్పకుండా నూనె(ఆముదం, కొబ్బరి, బాదం) పట్టించి మర్దనా చేయడం వల్ల వెంట్రుకలకు బలం అందుతుంది. ప్రొటీన్లు, ఐరన్ వంటివి పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. 2 రోజులకోసారైనా తలస్నానం చేయాలని వారు పేర్కొంటున్నారు.

News April 6, 2025

సుంకాలు తగ్గించేందుకు చైనాకు ట్రంప్ ఆఫర్

image

సుంకాల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ చైనాకు ఓ ఆఫరిచ్చారు. బీజింగ్‌పై విధించిన సుంకాల్ని తగ్గించాలంటే చైనా అధీనంలోని టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు అమ్మేయాలని డిమాండ్ చేశారు. బైడెన్ సర్కారు ఆ సంస్థపై విధించిన నిషేధాన్ని ట్రంప్ ఎత్తేసి, బ్యాన్‌ను 75 రోజులపాటు వాయిదా వేయడం గమనార్హం. టిక్‌టాక్ అమెరికన్ల సమాచారాన్ని దొంగిలించి చైనాకు ఇస్తోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తున్నారు.

News April 6, 2025

జాగ్వార్ ఎగుమతుల నిలిపివేత

image

టాటాకు చెందిన ‘జాగ్వార్ ల్యాండ్‌రోవర్’ (JLR) సంస్థ తమ లగ్జరీ కార్లను బ్రిటన్‌లో ఉత్పత్తి చేస్తుంటుంది. బ్రిటన్‌ ఉత్పత్తులపై ట్రంప్ 25శాతం సుంకాన్ని విధించిన నేపథ్యంలో USకు కార్ల ఎగుమతిని నిలిపేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ది టైమ్స్’ కథనం ప్రకారం.. నెల రోజుల పాటు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని JLR యోచిస్తోంది. 2 నెలలకు సరిపడా ఎగుమతుల్ని ఇప్పటికే USకు పంపించినట్లు సమాచారం.

News April 6, 2025

‘HHVM’కి 5 రోజులు కేటాయించిన పవన్?

image

హరిహర వీరమల్లు సినిమాలో తనకు సంబంధించిన పెండింగ్ సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌కు 5 రోజుల్ని కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన, అభిమానుల కోరిక మేరకు పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. HHVMతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.

News April 6, 2025

మా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు: SRH కోచ్

image

ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ 300 కొడుతుందన్న అంచనాలు ఉంటున్నాయి. అవే ఆ జట్టు కొంపముంచాయా? SRH అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మట్ ఆ విషయంపై స్పందించారు. ‘అంచనాల ఒత్తిడి మాపై ఏమాత్రం లేదు. ఇదంతా జట్టుకు బయట జరుగుతున్న విషయం మాత్రమే. అంతర్గతంగా జట్టుపై అది ఎలాంటి ప్రభావమూ చూపించదు’ అని పేర్కొన్నారు. 300 పరుగులు అటుంచి ఈ సీజన్లో మ్యాచులు గెలిచేందుకు కూడా సన్‌రైజర్స్ ఇబ్బంది పడుతుండటం గమనార్హం.

News April 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.