News May 17, 2024

IPL: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

image

లక్నో, ముంబై మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ముంబై ఇన్నింగ్స్ 3.5 ఓవర్ల వద్ద చినుకులు పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. అనుకోకుండా వర్షం రావడంతో గ్రౌండ్ స్టాఫ్ కవర్ల కోసం పరుగెత్తారు. ప్లేయర్లు డగౌట్‌లోకి వెళ్లారు. కాసేపట్లోనే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

News May 17, 2024

అర్జున్ టెండూల్కర్‌ భయపడ్డారా? నెటిజన్ల ట్రోల్స్

image

ఈ సీజన్‌లో MI తరఫున తొలిసారి ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఆకట్టుకోలేదు. 2.2 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చుకున్నారు. 15వ ఓవర్ తొలి 2 బంతులకు పూరన్ సిక్సులు కొట్టగానే గాయమంటూ డగౌట్‌కు వెళ్లిపోయారు. అక్కడ చికిత్స తీసుకోకుండా కూర్చోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నిజంగానే గాయమైందా? లేక భయపడ్డారా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. సచిన్ కొడుకు 2 సిక్సులకే వెనకడుగు వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

News May 17, 2024

నికోలస్ పూరన్ మరో ఘనత

image

లక్నో విధ్వంసకర ఆల్‌రౌండర్ నికోలస్ పూరన్ మరో ఘనత సాధించారు. ఐపీఎల్‌లో 20 బంతుల్లోపు అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఫీట్ నమోదు చేశారు. పూరన్ ఇప్పటివరకు 20 బంతుల్లోపు మూడుసార్లు ఫిఫ్టీ చేశారు. అతడి కంటే ముందు ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్ మెక్ గుర్క్, హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ ఘనత సాధించారు.

News May 17, 2024

ఏపీలో అల్లర్లపై సిట్.. సభ్యులు వీరే

image

ఏపీలో అల్లర్లపై ప్రభుత్వం 13 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. IPS అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యులుగా ACB ఎస్పీ రమాదేవి, ఏఎస్పీ సౌమ్యలత, CID DSP శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాస రావు, రవి మనోహర ఆచారి, ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్, ఎన్.ప్రభాకర్, శివప్రసాద్, మోయిన్, వి. భూషణం ఉన్నారు.

News May 17, 2024

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీగా ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ దీనిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో TS స్థానంలో TGని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

News May 17, 2024

MIvsLSG: ముంబై టార్గెట్ 215 రన్స్

image

MIతో మ్యాచ్‌లో LSG 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది. నికోలస్ పూరన్ 29 బంతుల్లో 75 పరుగులతో విధ్వంసం సృష్టించారు. కేఎల్ రాహుల్ 55, స్టొయినిస్ 28, దీపక్ హూడా 11, కృనాల్ పాండ్య 12*, బదోనీ 22* రన్స్ చేశారు. నువాన్ తుషారా, పీయూష్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు.

News May 17, 2024

మారిటల్ రేప్‌పై కేంద్ర వైఖరి కోరిన సుప్రీంకోర్టు

image

కొత్త క్రిమినల్ చట్టాల్లోనూ మారిటల్ రేప్‌ను మినహాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో AIDWA పిల్ దాఖలు చేసింది. దీనిపై కేంద్ర వైఖరిని వెల్లడించాలంటూ CJI జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలంటూ ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో పాటుగా జులైలో వాదనలు వింటామన్నారు. కాగా 18ఏళ్లు నిండిన భార్యతో లైంగిక సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేమని భారతీయ న్యాయ సంహితలోనూ పేర్కొన్నారు.

News May 17, 2024

IPL: 3 బంతుల్లో 3 వికెట్లు

image

ముంబైతో మ్యాచులో లక్నో 178 పరుగుల వద్ద 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయింది. తుషారా వేసిన 17వ ఓవర్లో చివరి రెండు బంతులకు పూరన్ (75), అర్షద్ ఖాన్ (0) ఔట్ కాగా, చావ్లా వేసిన 18వ ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్(55) ఔటయ్యారు. దీంతో ముంబై టీమ్ హ్యాట్రిక్ సాధించింది.

News May 17, 2024

BC రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలి: ఆర్ కృష్ణయ్య

image

TG: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచుతామన్న హామీ నెరవేర్చాలి. కులగణన చేపట్టి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. లేదంటే ఎన్నికలను అడ్డుకుంటాం. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News May 17, 2024

పూరన్ విధ్వంసం.. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ

image

MIతో మ్యాచ్‌లో LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్‌లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదారు.