India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 198 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో భారత జట్టు తడబడింది. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో కెప్టెన్ అమన్(26) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో ఇక్బాల్, తమీమ్ తలో 3, ఫహద్ 2, మరుఫ్, రిజాన్ చెరో వికెట్ తీశారు. దీంతో ఆసియాకప్ బంగ్లాదేశ్ వశమైంది.

ఇండియా కూటమికి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్ని NCP(SP) చీఫ్ శరద్ పవార్ స్వాగతించారు. ‘ఆమెకు కూటమిని నడిపే సామర్థ్యం ఉంది. నేతృత్వం వహిస్తానని చెప్పే హక్కు కూడా ఉంది. దేశంలో సమర్థత కలిగిన నేతల్లో ఆమె ఒకరు. పార్లమెంటుకు ఆమె పంపిన ఎంపీలందరూ కష్టపడి పని చేసే వారే’ అని స్పష్టం చేశారు.

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 4న అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తుందని పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశముంది.

సిరియాలో ప్రభుత్వం కూలిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాబా వంగా అనే జ్యోతిషురాలు చెప్పిన జోస్యం గురించి చర్చ నడుస్తోంది. ‘సిరియా ప్రభుత్వం పడిపోయినప్పుడు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఓ యుద్ధం మొదలవుతుంది. అది 3వ ప్రపంచయుద్ధానికి దారి తీస్తుంది. చివరికి పశ్చిమ దేశాలు నాశనమవుతాయి’ అని పేర్కొన్నారు. 1996లో బాబా వంగా చనిపోయారు. అయితే, ఆమె చెప్పిన కొన్ని జోస్యాలు గతంలో నిజమయ్యాయి.

INDIA కూటమికి రాహుల్ సారథ్యంపై మిత్రపక్షాల్లో ఆందోళన నెలకొందని BJP ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌పై SP అసంతృప్తిగా ఉందని, ఇదే భావనలో ఉన్న మమతా బెనర్జీ కూటమిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారని BJP ప్రతినిధి నళిన్ కోహ్లీ అన్నారు. దీనికి శరద్ పవార్ కూడా మద్దతు పలకడం రాహుల్ నాయకత్వంపై వారిలో నెలకొన్న ఆందోళనలకు నిదర్శనమన్నారు. ఇందులో బీజేపీ ప్రమేయం లేదన్నారు.

TG: రైతులకు మేలు జరిగే సూచనలు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. 2024 ఆర్‌వోఆర్ కొత్త చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని చెప్పారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్యులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజీ వేళల్లో వాట్సాప్‌లో అన్ని సందేశాలను చూసుకోవడం వీలు పడదు. దీంతో కొన్నింటిని చూడకుండానే వదిలేస్తాం. ఇలాంటి వాటిని గుర్తు చేసేందుకు మెసేజ్ రిమైండర్ ఫీచర్ రానుంది. ఇది యాప్‌లో చదవకుండా వదిలేసిన సందేశాలను ట్రాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. అందుబాటులోకి రాగానే సెట్టింగ్స్‌లోని నోటిఫికేషన్‌లో ఉన్న రిమైండర్స్‌ను ఎంచుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు.

AP: మహిళలు, ఆడపిల్లల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న దాడులు బాధాకరమని, వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆడబిడ్డలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొందరు డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారని, ఈగల్ టీమ్ ద్వారా వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

TG: కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు తప్పని ఆయన అన్నారు. వెంటనే ఆమె సారీ చెప్పినట్లు గుర్తుచేశారు. ఆవిడపై సోషల్‌మీడియాలో జరిగిన ప్రచారమే దీనికి కారణమైందని, ఈ విషయంలో తాను చొరవ తీసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగిందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.