News October 13, 2024

జైలులో నాటకం.. సీతను వెతుకుతూ ఖైదీల పరార్

image

ఉత్తరాఖండ్‌లోని రోషనాబాద్ జైలులో నాటకమాడుతూ ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దసరా సందర్భంగా జైలులో రామాయణం నాటకం వేశారు. ఇందులో భాగంగా వానర పాత్రధారులు పంకజ్, రాజ్ కుమార్.. సీతను వెతికే క్రమంలో 22 అడుగుల జైలు గోడపై నుంచి పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే దూకి పరారయ్యారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

News October 13, 2024

మాజీ మంత్రి హత్య.. సీఎం రాజీనామాకు విపక్షాల డిమాండ్

image

మహారాష్ట్రలో మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్దిఖీ దారుణ <<14343654>>హత్యకు<<>> గురికావడం సంచలనం రేపింది. దీనికి సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడణవీస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని NCP(SP), శివసేన(UBT) డిమాండ్ చేశాయి. Y కేటగిరీ భద్రత కలిగిన రాజకీయ నేతనే కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ప్రశ్నించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తాయి.

News October 13, 2024

మీ పిల్లలకు ఇవి నేర్పుతున్నారా?

image

వయసు పెరిగే పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని స్కిల్స్ నేర్పించాలి. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, సాయం చేయడం వంటివి నేర్పాలి. చెట్లు నాటడం, సంరక్షణ, తోటి పిల్లలతో ఎలా మెలగాలో చెప్పాలి. డబ్బు విలువ తెలియజేయాలి, వస్తువులపై ధరలు, క్వాలిటీ వంటివి చూపించాలి. మార్కెట్‌లో బేరాలు ఆడటం నేర్పించాలి. ఎమోషనల్ బ్యాలెన్స్‌పై అవగాహన కల్పించాలి. పెద్దలను గౌరవించేలా తీర్చిదిద్దాలి.

News October 13, 2024

‘దసరా’ దర్శకుడితో నాని మరో మూవీ

image

‘దసరా’ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్‌కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

News October 13, 2024

సంజూ శాంసన్ సెల్ఫ్‌లెస్ ప్లేయర్: సూర్య

image

వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘నాకు నిస్వార్ధపరులైన ఆటగాళ్లతో కూడిన జట్టు అంటే ఇష్టం. ఎవరైనా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించి జట్టు ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు. పరుగులు సాధించే క్రమంలో రికార్డులు వాటంతటవే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News October 13, 2024

రతన్ టాటా ఓ ఛాంపియన్: నెతన్యాహు

image

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఛాంపియన్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. ‘నాతోపాటు ఇజ్రాయెల్ ప్రజలందరూ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నాం. ఆయన భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేయండి’ అని ప్రధాని మోదీని ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సంతాపం తెలిపారు.

News October 13, 2024

ఇరాన్ అణు స్థావరాలపై సైబర్ అటాక్?

image

ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. తమ విలువైన డాటా చోరీకి గురైనట్లు ఇరాన్ కూడా వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

News October 13, 2024

మరోసారి నిరాశపర్చిన అభిషేక్ శర్మ

image

టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ సిరీస్‌లో అభి వరుసగా 16, 15, 4 పరుగులే చేశారు. దీంతో అంచనాలకు తగ్గట్లుగా అతడు రాణించలేకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో వచ్చిన ఛాన్స్‌లను ఆయన వృథా చేసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే ఆడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమని చెబుతున్నారు.

News October 13, 2024

అక్టోబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1679: పెను తుపానుతో మచిలీపట్నం ప్రాంతంలో 20 వేల మందికి పైగా మృతి
1965: హాస్య నటి కల్పనా రంజనీ జననం
1973: కవి, గీత రచయిత కందికొండ యాదగిరి జననం
1987: బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్ మరణం
1990: హీరోయిన్ పూజా హెగ్డే జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి జననం
ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం

News October 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.