India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MIతో మ్యాచ్‌లో LSG ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా 15వ ఓవర్‌లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదారు.
బెంగళూరులో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆరెంజ్ అలర్ట్ ఉండగా తాజాగా IMD ఎల్లో అలర్ట్‌కు తగ్గించింది. రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆ తర్వాత వర్ష సూచన లేకపోవడం, చిన్నస్వామి స్టేడియంలో సబ్-ఎయిర్ సిస్టమ్ ఉండటంతో RCB, CSK మ్యాచ్ జరిగే అవకాశం ఉందని కర్ణాటక వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పేశారు.
ఎన్నికల ప్రచారం కోసం తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీన్ని ఈ నెల 21న వెకేషన్ బెంచ్ ముందు లిస్టింగ్ చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా ల్యాండ్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేయగా, అక్కడా ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ‘మీ రేటెంత’ అని అడిగిన బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన <<13262479>>వ్యాఖ్యలు<<>> అగౌరవంగా ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఈ నెల 20న సాయంత్రం 5లోపు అనుచిత వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గంగోపాధ్యాయ్ తమ్లుక్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నారు.
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కొమురం భీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రితో పాటు మరికొన్ని జిల్లాల్లో.. ఏపీలోని అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పూర్తి వివరాలకు పైన జోడించిన ఫొటోలు చూడండి.
‘డార్లింగ్స్.. మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ అందరిలోనూ ఆసక్తి పెంచిన హీరో ప్రభాస్ బుజ్జితో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ‘కల్కి’ మూవీలో ‘బుజ్జి’ పాత్రను రేపు రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘డార్లింగ్స్.. మీరు నా బుజ్జిని కలవడానికి వేచి ఉండండి’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టారు. కాగా స్క్రాచ్ ఎపిసోడ్ 4 పేరిట రేపు సాయంత్రం 5 గంటలకు మేకర్స్ ఈ పాత్రను రివీల్ చేస్తారు.
UK ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతామూర్తి ఆస్తి 150 మిలియన్ పౌండ్లు పెరిగి 651 మిలియన్ పౌండ్లకు చేరిందని సండే టైమ్స్ పేర్కొంది. UKలో 2022లో 177గా ఉన్న బిలియనర్ల సంఖ్య ఈ ఏడాది 165కి తగ్గిందని తెలిపింది. ధనవంతుల లిస్టులో బిజినెస్‌మ్యాన్ గోపీ హిందూజా £37.2bn సంపాదనతో టాప్‌లో ఉన్నారని వెల్లడించింది. పాల్ మెక్‌కార్ట్నీ £1bn నికర విలువతో బిలియనీర్ అయిన తొలి UK మ్యుజీషియన్‌గా నిలిచారని తెలిపింది.
టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీనిపై బోర్డు అధికారులు ఇప్పటికే ఆయనను సంప్రదించినట్లు ESPN cricinfo తెలిపింది. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్‌లో కేకేఆర్ మెంటార్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ పూర్తయిన తర్వాత కోచ్ పదవిపై అతనితో BCCI చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 27తో ముగియనుంది.
TMC చీఫ్ మమతా బెనర్జీపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘గంగోపాధ్యాయ్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయి. అసహ్యకరమైన, పూర్తిగా ఆమోదయోగ్యం కాని పదాలు వాడటం దారుణం. ఆయన మమతను అలా వ్యాఖ్యానించడం సిగ్గు చేటు. ఈ వ్యాఖ్యలకు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
IPL-17 నుంచి ఢిల్లీ నిష్క్రమించడంపై కెప్టెన్ పంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘చాలా కాలం తర్వాత మైదానంలోకి దిగడం అద్భుతంగా అనిపించింది. నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. నాపై అభిమానులు చూపుతున్న ప్రేమ వెలకట్టలేనిది. నేను ఇష్టపడే క్రికెట్ ఆడుతున్నందుకు థ్రిల్‌గా ఉంది. మున్ముందు మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలను సంపాదించుకోవాలని ఎదురుచూస్తున్నా’ అంటూ పంత్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.