News December 7, 2024

పుష్ప-2: రెండు రోజుల్లో రూ.449 కోట్ల వసూళ్లు

image

‘పుష్ప-2’ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మైల్‌స్టోన్‌ను అతి వేగంగా చేరుకున్న సినిమాగా రికార్డు సృష్టించిందని తెలిపింది. తొలి రోజు రూ.294కోట్ల కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్లు గంటకు లక్షకుపైగా అమ్ముడవడం గమనార్హం. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.

News December 7, 2024

ఇక ఇండియా కూట‌మికి కాలం చెల్లిన‌ట్టేనా..!

image

INDIA కూట‌మి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మిత్ర‌ప‌క్షాలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్‌కు దూర‌మ‌వుతున్నాయి. మ‌మ‌త‌కు బాధ్య‌తలు ఇవ్వాల‌ని SP ప‌ట్టుబ‌డుతోంది. అదానీ వ్య‌వ‌హారంలో INC ఆందోళ‌న‌ల‌కు SP, TMC దూరంగా ఉన్నాయి. ఆప్ ఇప్ప‌టికే ఢిల్లీలో దూరం జ‌రిగింది. MH, హ‌రియాణాలో త‌మ‌ను లెక్క‌లోకి తీసుకోలేద‌ని వామ‌పక్షాలు గుర్రుగా ఉన్నాయి. లాలూ ప్ర‌సాద్‌కు బాధ్య‌తలు ఇవ్వాల‌ని అటు RJD కోరుతోంది. మీ అభిప్రాయమేంటి?

News December 7, 2024

మొబైల్ డేటా, వైఫై ఏది వాడితే మంచిది?

image

మొబైల్ డేటా కంటే వైఫైతో ఇంటర్నెట్ వాడుకోవడం బ్యాటరీకి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ డేటా ఉపయోగిస్తే సిగ్నల్ కోసం వెతుకుతూ ఫోన్ ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తుందని, దీనివల్ల బ్యాటరీ త్వరగా ఖర్చవుతుందంటున్నారు. అలాగే 3G, 4G, 5G నెట్‌వర్క్స్ మధ్య స్విచ్ అవడం వల్ల బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రెయిన్ అవుతుంది. వైఫై సిగ్నల్ స్ట్రాంగ్, స్థిరంగా ఉంటుందని దీనివల్ల తక్కువ పవర్ అవసరం పడుతుందని పేర్కొంటున్నారు.

News December 7, 2024

భారత్‌కు కొనసాగుతున్న ‘హెడ్’ఏక్

image

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ తన ప్రత్యర్థి భారత్ అయితే చాలు రెచ్చిపోతుంటారు. ఇప్పుడు BGTలోనూ తన రికార్డును కొనసాగిస్తున్నారు. అడిలైడ్ టెస్టులో 111 బంతుల్లోనే సెంచరీ కొట్టి డే నైట్ టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు. డే-నైట్ టెస్టుల్లో 3 సెంచరీలు హెడ్ పేరిట ఉన్నాయి. కాగా గత ఏడాది వరల్డ్ కప్ ఫైనల్, టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్ విజయాన్ని హెడ్ సెంచరీలతో అడ్డుకున్న సంగతి తెలిసిందే.

News December 7, 2024

అడగొద్దు.. చెప్పొద్దు: రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో కొత్త ట్రెండ్

image

రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌లో ఓ కొత్త ట్రెండు మొదలైంది. అదే DADT. అంటే డోన్ట్ ఆస్క్, డోన్ట్ టెల్. తమ బంధం హాయిగా, ఆనందంగా, చికాకుల్లేకుండా సాగిపోవడానికి వెస్ట్రన్ కంట్రీస్‌లో చాలా జంటలు దీన్ని ఫాలో అవుతున్నాయి. తమ శృంగార, భావోద్వేగ జీవితాల గురించి డిస్కస్ చేసుకోకూడదని కొత్త బంధంలోకి అడుగుపెట్టే ముందే భాగస్వాములు మాట తీసుకుంటారు. అసూయ, వివాదాలకు తావుండదనే చాలా జంటలు DADT అనుసరిస్తున్నాయని తెలిసింది.

News December 7, 2024

వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల కేసు.. అజిత్ పవార్‌కు ఊరట

image

MH Dy.CM అజిత్ ప‌వార్‌కు ఊర‌ట ల‌భించింది. ₹వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల కేసులో IT ట్రిబ్యున‌ల్ క్లీన్‌చిట్ ఇచ్చింది. MH స‌హ‌కార బ్యాంకు స్కాం కేసులో జ‌రందేశ్వ‌ర్ షుగ‌ర్ మిల్లును సీజ్ చేశారు. బ్యాంకులో బోర్డు సభ్యుడిగా అజిత్ ఉండగా మిల్లును తక్కువ ధరకే వేలం వేశారని, వేలంలో మిల్లు కొన్న సంస్థ నుంచి దాన్ని అజిత్ కుటుంబం దక్కించుకుందని ఆరోపణలున్నాయి. నిధుల మళ్లింపు ఆధారాలు లేవని ట్రిబ్యునల్ తేల్చింది.

News December 7, 2024

రోహిత్.. నో ‘హిట్’

image

భారత టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో 6 పరుగులకే ఔటయ్యారు. కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్సులోనూ 3 పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ ఫామ్‌పై ఆందోళనలు నెలకొన్నాయి.

News December 7, 2024

పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే చంద్రబాబు లక్ష్యం: VSR

image

AP: Dy.CM పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే CM చంద్రబాబు లక్ష్యమని YCP MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. జలజీవన్ మిషన్ పథకం పనుల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న వార్తను షేర్ చేశారు. ఈ శాఖలు పవన్ నిర్వహించేవేనని, భవిష్యత్తులో తన కుమారుడికి ముప్పుగా పరిణమిస్తుందనే పవన్‌ను అణచివేయడానికి చంద్రబాబు తన ట్రేడ్‌ మార్కు వ్యూహాలను అమలు చేస్తున్నారని ట్వీట్ చేశారు.

News December 7, 2024

టెన్త్ పూర్తయిన వారికి అవకాశం

image

AP: ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్&ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డ్రోన్ పైలట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. టెన్త్ పూర్తయిన వారు DEC 9 లోపు అప్లై చేసుకోవచ్చు. 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెలకు రూ.19వేలతో ఉద్యోగం ఇస్తారు. టూవీలర్ లైసెన్స్ ఉండాలి. DEC 10న గుంటూరులోని ప్రభుత్వ ITI కాలేజీలో ఇంటర్వ్యూ ఉంటుంది. వివరాలకు: 8074607278, 99888 53335.

News December 7, 2024

బంగ్లాలో మరో 2 ఆలయాల ధ్వంసం

image

బంగ్లాదేశ్‌లోని ఢాకా జిల్లాలో మరో రెండు గుళ్లను అక్కడి దుండగులు తగలబెట్టినట్లు కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తెలిపారు. ‘ఈరోజు తెల్లవారుజాము 2-3 గంటల మధ్య సమయంలో రాధాకృష్ణ ఆలయం, మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలకు నిప్పుపెట్టారు. లక్ష్మీనారాయణుల విగ్రహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆలయాలను, హిందువుల్ని కాపాడేందుకు అక్కడి పోలీసులు, ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.