India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సరైన సమయంలో చర్యలు తీసుకోవడంతో విచ్చలవిడిగా అన్‌సెక్యూర్డ్ లోన్స్ మంజూరు కాకుండా అదుపు చేయగలిగామని RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ లోన్స్ మితిమీరకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు తీసుకోవడం మంచిదని భావించామన్నారు. పర్సనల్ లోన్స్, స్టూడెంట్ లోన్స్, క్రెడిట్ కార్డులు మొదలైనవి ఈ అన్‌సెక్యూర్డ్ లోన్స్ పరిధిలోకి వస్తాయి. ముంబైలోని ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
AP: టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో గోరంట్లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల అందరు ఎమ్మెల్యేతో అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా మరికాసేపట్లో భారత్-అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. మ్యాచ్ జరిగే బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో వర్షం పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ జరిగే సమయంలో వాన కురిసే ఛాన్స్ ఉంది. కాగా టీమ్ ఇండియా ఒక మార్పుతో ఇవాళ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించనున్నట్లు సమాచారం.
YCP అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటి నుంచి చేపట్టాలని CBI కోర్టు నిర్ణయించింది. ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లను మళ్లీ విచారించనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ కొనసాగుతోంది. సీబీఐ కోర్టు గత జడ్జి బదిలీ కావడంతో డిశ్చార్జి పిటిషన్ల విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.
నీట్ పేపర్ లీక్ కేసులో <<13474011>>అరెస్టయిన<<>> అనురాగ్ యాదవ్(22)కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక రోజు ముందే పేపర్‌ను పొందిన అతనికి 720కి గాను 185 మార్కులే వచ్చాయి. పర్సంటైల్ స్కోరు 54.84 మాత్రమే. ఫిజిక్స్‌లో 85, బయాలజీలో 51 పర్సంటైల్ రాగా, కెమిస్ట్రీలో 5 వచ్చింది. ఆలిండియా ర్యాంకు 10,51,525 సాధించాడు. టైమ్ లేకపోవడంతో సమాధానాలు గుర్తు పెట్టుకోలేకపోయానని అతను విచారణలో చెప్పాడు.
AP: పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ సర్కారు రద్దు చేసింది. అలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సీఎస్ నీరభ్ కుమార్ అన్ని శాఖల HODలు, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను ఆదేశించారు. తొలగింపులపై ఈ నెల 24లోగా నివేదిక ఇవ్వాలన్నారు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పనిసరైతే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు.
ముంబై ఆధారిత ఓ బ్యూటీ బ్రాండ్ వ్యవస్థాపకుడు తీసుకున్న నిర్ణయం అతన్నే ఫైన్ కట్టేలా చేసింది. కంపెనీ ఉత్పాదకతను పెంచేందుకు కఠినమైన నియమాన్ని ఆయన ప్రవేశపెట్టారు. సిబ్బంది 9.30 గంటల్లోపు ఆఫీస్‌కు రావాలని, లేకపోతే రూ.200 ఫైన్ వేస్తామని తెలిపారు. అయితే, ఈ నియమం పాటించడంలో అతను విఫలమయ్యాడు. పది రోజుల్లో 5 సార్లు లేటుగా రావడంతో రూ.వెయ్యి ఫైన్ చెల్లించినట్లు అతడు Xలో పేర్కొన్నాడు.
స్టాక్ మార్కెట్‌లో HDFC బ్యాంక్ షేర్ల కొనుగోళ్ల హవా కొనసాగుతోంది. మ్యూచువల్ ఫండ్లు వరుసగా ఐదు నెల పెద్ద మొత్తంలో ఈ సంస్థ షేర్లు కొన్నాయి. మేలో ఏకంగా ₹7600కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశాయి. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అత్యధికంగా రూ.2669కోట్ల విలువైన షేర్లు కొంది. కాగా మ్యూచువల్ ఫండ్లు APRలో ₹1,890కోట్లు, MARలో ₹4,600 కోట్లు, FEBలో ₹8,432 కోట్లు, JANలో ₹12,884 కోట్ల విలువైన HDFC షేర్లను కొన్నాయి.
ఇ-స్కూటర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా ₹5,500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (యాజమాన్యానికి చెందిన షేర్లు విక్రయించడం) ద్వారా ₹1750 కోట్లు రాబట్టాలని సంస్థ భావిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ 47.3 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కేపెక్స్ పెంచేందుకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
AP: సీఎం చంద్రబాబు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. దీంతో భారీ స్వాగత ఏర్పాట్లు చేసేందుకు కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు.
Sorry, no posts matched your criteria.