News April 3, 2024

IPL: కోల్‌కతా బ్యాటింగ్

image

ఢిల్లీతో మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచింది. విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
★ ప్లేయింగ్ XI
DC: పృథ్వీ షా, వార్నర్, మిచెల్ మార్ష్, పంత్, స్టబ్స్, అక్షర్, సుమిత్ కుమార్, రసిఖ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
KKR: ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, రస్సెల్, నరైన్, రమణదీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

News April 3, 2024

మృణాల్ ఠాకూర్‌కు బిగ్ ఆఫర్?

image

సీతారామం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్‌కు భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చేయబోయే ఓ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఈనెల 5న థియేటర్లలో విడుదల కానుంది.

News April 3, 2024

ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించాం: జగన్

image

AP: రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించామని సీఎం జగన్ అన్నారు. ‘రూ.3 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఎన్నో పథకాలతో అక్కచెల్లెమ్మలకు అండగా ఉన్నాం. మహిళలకు ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పటివరకు రూ.2.70 లక్షల కోట్లు మీ ఖాతాల్లో నేరుగా వేశాం. 130 సార్లు మీ బిడ్డ జగన్ బటన్ నొక్కారు. నా కోసం రెండు సార్లు బటన్లు నొక్కండి’ అని ఆయన పేర్కొన్నారు.

News April 3, 2024

15న కేసీఆర్ సభ

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 15న మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. కాగా కేసీఆర్ ఇటీవల మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలో ఉన్నారు.

News April 3, 2024

మరమరాలు ఆరోగ్యానికి మంచివేనా?

image

తెలుగు రాష్ట్రాల్లో మరమరాలతో ఉగ్గాని, లడ్డూలు, భేల్ పూరి, స్వీట్స్ లాంటి స్నాక్స్ తయారు చేసుకుని తింటుంటారు. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరమరాల్లో పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గిస్తుంది. ఇవి తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలు, పేగు ఆరోగ్యానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

News April 3, 2024

బొగ్గు గనుల్లో చిక్కుకున్న 70మంది కార్మికులు

image

తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే 9 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక భూకంపం వల్ల రెండు బొగ్గు గనులు కూలడంతో అందులో 70 మంది కార్మికులు చిక్కుకున్నట్లు ప్రకటించారు. వీరంతా అందులో పనిచేస్తుండగా గనులు కూలాయి. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

News April 3, 2024

మీ ఓటు విలువ మీ ఐదేళ్ల భవిష్యత్: జగన్

image

AP: ప్రజల ఓటు విలువ వారి ఐదేళ్ల భవిష్యత్ అని సీఎం జగన్ అన్నారు. ‘ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు.. చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షాన ఉన్నా. ఒక్కడి మీద అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నారు. మీ ఓటు వల్ల మీ తలరాతలు మారతాయి. ఎవరి వల్ల మంచి జరిగిందో తెలుసుకుని ఓటేయండి. ఈ ఎన్నికల్లో వైసీపీకి తోడుగా ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు.

News April 3, 2024

మరోసారి ఆస్పత్రి పాలైన సూపర్‌స్టార్

image

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో దుమ్ము రేగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల తన భార్య గీతా శివరాజ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

News April 3, 2024

ఫిలిం ఛాంబర్‌ సమీపంలో అగ్నిప్రమాదం

image

TG: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఫిలిం ఛాంబర్‌ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. స్వరుచి హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 3, 2024

తైవాన్ ప్రజలకు అండగా ఉంటాం: మోదీ

image

తైవాన్ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో తైవాన్ ప్రజలకు అండగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు. కాగా తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పటివరకు 9 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.