India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం రోడ్ షోలు నిర్వహించనున్నారు. 4న కొవ్వూరు, గోపాలపురం, 5న నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ఆయన పర్యటిస్తారు. ప్రజాగళంలో భాగంగా ఇప్పటికే ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు.
భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడటమే తన లక్ష్యమని యువ పేసర్ మయాంక్ యాదవ్ అన్నారు. ‘వేగంగా బౌలింగ్ చేయడానికి డైట్, సరిపడా శిక్షణ అవసరం. త్వరగా రికవరీ కావడానికి చన్నీటి స్నానం, డైట్‌పై ఫోకస్ చేస్తున్నా’ అని తెలిపారు. కాగా ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మయాంక్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు.
TG: మండు వేసవిలో నీరు దొరక్క వన్య ప్రాణులు అల్లాడిపోతున్నాయి. వీటి కోసం తెలంగాణ అడవులలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో జీవాలు గొంతు తడుపుకుంటున్నాయి. పులి, జింకలు, అడవి దున్నలు, హైనాలు నీటి కుంటల్లో దాహార్తిని తీర్చుకుంటున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కగా.. వీటిని అటవీ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వన్యప్రాణులు కోసం అధికారులు తీసుకుంటున్న చర్యల్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన EMPS కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చింది. జులై 31 వరకు అమల్లో ఉండే ఈ పథకం కింద రాయితీల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. మొత్తం 3.72లక్షల ఈవీ వెహికల్స్ కొనుగోలును ప్రోత్సహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద EV బైక్‌లకు రూ.10 వేలు, ఇ-రిక్షా, ఇ-కార్ట్‌లకు రూ.25వేలు, 3 చక్రాల ఈవీలను కొనుగోలు చేసే వారికి రూ.50 వేల సబ్సిడీ లభిస్తుంది.
ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తాజాగా మరో 500 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలుస్తోంది. ఎటువంటి నోటీసులు లేకుండా, సంస్థ నుంచి వైదొలగాలని సదరు ఉద్యోగులకు ఫోన్‌ల ద్వారా సమాచారం పంపుతున్నట్లు సమాచారం. విక్రయ విభాగం, అధ్యాపకులు, ట్యూషన్ సెంటర్లపై ఉద్యోగాల కోత ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కర్ణాటక CM సిద్దారామయ్య వెల్లడించారు. ప్రస్తుత సీఎం పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘ప్రజల కోరిక మేరకు గత ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే నాలుగేళ్లలో నాకు 83 ఏళ్లు పూర్తవుతాయి. ఆ తర్వాత అంత నిబద్ధతతో పని చేయలేను. నా ఆరోగ్య పరిస్థితి గురించి నాకే తెలుసు. అందుకు రాజకీయాలు చాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు.
AP: ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చంద్రబాబు ఏనాడు చేయలేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ‘ఏనాడైనా ప్రజలకు ఒక ఇల్లు ఇచ్చారా? సెంటు జాగా ఇచ్చారా? మీకెందుకు ఓటెయ్యాలి. ఈ నెల ఒకటో తేదీన పింఛను రాలేదంటే అందుకు కారణం చంద్రబాబే. ఆయనకు రాజకీయాలే ముఖ్యం. పవన్ సినిమాలు చూడండి.. కానీ ఓటు వేయకండి. పవన్, చంద్రబాబుకి ఓటేస్తే వారు HYDలోనే ఉంటారు.. CM జగన్ ఎప్పుడు మీ మధ్యే ఉంటారు’ అని చెప్పారు.
రోహిత్ శర్మను సారథిగా తప్పించి, పాండ్యకు పగ్గాలు అప్పగించడం రోజురోజుకూ పెద్ద వివాదంగా మారుతోంది. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు గౌరవం ఇవ్వకుండా, 5 టైటిల్స్ అందించిన విషయాన్ని మర్చిపోయి అవమానించారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫలితంగా కొత్త కెప్టెన్ పాండ్యకు అవమానాలు తప్పట్లేదు. కెప్టెన్సీ మార్పుపై ముంబై ఫ్రాంచైజీ వ్యవహార శైలి బాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికను 63 ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న వీరి వివాహం జరగగా అభం శుభం తెలియని బాలికను పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. అయితే కన్యను పెళ్లి చేసుకోవాలనే పాత ఆచారం ప్రకారం వివాహం జరిగిందని ఈ వేడుకకు హాజరైన ఓ అతిథి వివరించాడు. ఈ ప్రాంతంలో ఈ విధానం సర్వసాధారణమని చెప్పడం గమనార్హం.
1955: ప్రముఖ గాయకుడు హరిహరన్ జననం
1962: నటి జయప్రద జననం
1973: నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జననం
1964: భారత మాజీ క్రికెటర్ అజయ్ శర్మ జననం
1680: మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మరణం
Sorry, no posts matched your criteria.