News April 2, 2024

డీఎస్సీ దరఖాస్తుల గడువు పెంపు, పరీక్షల తేదీలు ఖరారు

image

TG: రాష్ట్రంలో డీఎస్సీ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా.. దీనిని జూన్ 20 వరకు పొడిగించింది. అలాగే డీఎస్సీ పరీక్ష తేదీలు కూడా విద్యాశాఖ ఖరారు చేసింది. జులై 17 నుంచి అదే నెల 31 వరకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News April 2, 2024

ఈ హామీలు చంద్రబాబు నెరవేర్చారా?: సీఎం జగన్

image

AP: 2014లో కూడా చంద్రబాబు అనే పశుపతి 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, అనేక హామీలిచ్చి మోసం చేశారని సీఎం జగన్ ఫైరయ్యారు. ‘చంద్రబాబు, పవన్, మోదీ కలిసి ముఖ్యమైన హామీలంటూ ఊదరగొట్టారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణాల మాఫీ చేశారా? అర్హులైన అందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? ఆడబిడ్డలు పుట్టిన వెంటనే రూ.25వేలు ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చారా?’ అని ప్రజలను ప్రశ్నించారు.

News April 2, 2024

విశాఖ హనుమంతుడి ఫొటోను పోస్ట్ చేసిన వార్నర్

image

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆంజనేయుడి విగ్రహాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. ఐపీఎల్ కోసం ప్రస్తుతం విశాఖలో ఉన్న అతడు ఇవాళ నగర వ్యాప్తంగా పర్యటించారు. హనుమంతవాకలో ఉన్న ఆంజనేయుడిని చూసి ముచ్చటపడిన వార్నర్ ఆ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. వార్నర్ గతంలోనూ వినాయకుడి, శ్రీరాముడి ఫొటోలను షేర్ చేశారు.

News April 2, 2024

జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తొస్తాయి: సీఎం

image

AP: చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకు రాదని CM జగన్ ఎద్దేవా చేశారు. జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తాయని పేర్కొన్నారు. ‘జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ గుర్తొస్తాయి. లంచాలు లేని పాలన అంటే గుర్తొచ్చేది జగన్. వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువ లబ్ధి చేకూర్చాం’ అని తెలిపారు.

News April 2, 2024

జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్

image

AP: మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆ ముఠా నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచిన పశుపతి లాగా.. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనే పసుపు పతి వస్తున్నారు. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.

News April 2, 2024

వివాహేతర శృంగారం నేరం కాదు: రాజస్థాన్ HC

image

ఇద్దరు మేజర్లు ఏకాభిప్రాయంతో వివాహేతర శ‌ృంగారం చేస్తే నేరంగా పరిగణించలేమని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్యను ముగ్గురు కిడ్నాప్ చేశారని భర్త పిటిషన్‌ వేశారు. కోర్టులో హాజరైన సదరు భార్య.. ముగ్గురిలో ఒకరితో తాను సహజీవనం చేస్తున్నానని చెప్పింది. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెను శిక్షించాలని కోర్టును భర్త తరఫు లాయర్ కోరగా.. ఆమె చేసిన పనిని నేరంగా పరిగణించలేమని కోర్టు చెప్పింది.

News April 2, 2024

ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదు: సీఎం జగన్

image

AP: 99 శాతం హామీలు అమలు చేసిన తమ ముందు 10% హామీలు కూడా అమలు చేయని చంద్రబాబు నిలబడగలరా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. మదనపల్లి సభలో మాట్లాడుతూ.. ‘అధికారం కోసం తోడేళ్లన్నీ కలిసి వస్తున్నాయి. నన్ను ఓడించడానికి CBN, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదు. మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి వస్తారా? విపక్షాల పొత్తులకు మేం భయపడటం లేదు’ అని పేర్కొన్నారు.

News April 2, 2024

డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం: సీఎం జగన్

image

AP: తాము ఐదేళ్లుగా విశ్వసనీయమైన పాలన అందించామని సీఎం జగన్ తెలిపారు. మదనపల్లిలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించాం. మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేశాం. మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు కళ్ల ముందు కనిపిస్తోంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలిచి డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం. దీనికి మీరంతా సిద్ధమా? 58 నెలల్లో మంచి జరిగితేనే ఓటు వేయాలని మనం కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

News April 2, 2024

టాటా మోటార్స్‌కు చైనా ఈవీలతో సవాల్!

image

కేంద్రం ఇటీవల తెచ్చిన ఈవీ కొత్త పాలసీతో టెస్లా వంటి ఫారిన్ ఈవీ కంపెనీలు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియరైంది. ఈ నిర్ణయం దేశీయంగా ఈవీ రంగంలో టాప్‌లో ఉన్న టాటాకు సైతం ఊతమిచ్చిందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి. అయితే ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కంపెనీ BYD అందుబాటు ధరలకు ఈవీలను తెచ్చే ప్లాన్‌లో ఉందట. ఈ నేపథ్యంలో టాటాకు చైనా సంస్థలు సవాల్‌గా మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

News April 2, 2024

సూర్య గ్రహణం రోజున జైళ్లలో లాక్‌డౌన్.. ఖైదీల దావా

image

సంపూర్ణ <<12895461>>సూర్యగ్రహణం<<>> సందర్భంగా ఈ నెల 8న USలోని జైళ్లలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ రోజు కొన్ని నిమిషాలు పూర్తి చీకటిగా ఉంటున్నందున ఖైదీల సందర్శనను నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు పవిత్రమైన రోజున మతపరమైన కార్యక్రమాలను నిరోధించడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని పలువురు ఖైదీలు న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది.