India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘వ్యవసాయ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. దేశంలోని రైతులంతా మా వెంటే ఉన్నారు. ఆధునిక టెక్నాలజీని వ్యవసాయం రంగంలో సమృద్ధిగా ఉపయోగిస్తున్నాం. ఆత్మనిర్భర్ దిశగా భారత్ దూసుకెళ్తోంది. దేశ ప్రజల కలలు సాకారం చేసే దిశగా ప్రయత్నిస్తాం’ అని పీఎం పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో YCP హయాంలో పెట్టిన అన్ని ప్రభుత్వ పథకాల పేర్లను టీడీపీ ప్రభుత్వం మార్చింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు-చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి- ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన- పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, జగనన్న విదేశీ విద్యాదీవెన-అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యా నిధిగా పేర్లు మార్చింది.
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి ఎగబాకారు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో సెంచరీ బాదిన ఆమె ఇంటర్నేషనల్ కెరీర్‌లో 7,000 పరుగుల మైలురాయి చేరుకున్నారు. ఈక్రమంలో 715 పాయింట్లతో వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్‌లోనూ పైకి దూసుకెళ్లారు. ఈ జాబితాలో 772 పాయింట్లతో బ్రంట్(ఇంగ్లండ్), 768 పాయింట్లతో ఆటపట్టు(శ్రీలంక) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.
తిరుమల మాడవీధుల్లో ఎండలో నడిచేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం కలిగించేలా రోడ్డుపై కూల్ పెయింట్ వేశారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైట్ కూల్ పెయింట్ వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలోనే ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. 1999లో జరిగిన గైసల్ రైలు ప్రమాదంలో 290 మంది మరణించారని, దీనికి బాధ్యత వహిస్తూ అటల్ బిహారి వాజ్‌పేయి క్యాబినెట్‌లో రైల్వే మంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ రాజీనామా చేశారని గుర్తుచేస్తున్నారు.
AP: రాష్ట్రంలోని 253 మండల లెవల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి 2 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 62 కేంద్రాల్లో తనిఖీలు పూర్తవగా, 24 చోట్ల అక్రమాలను గుర్తించినట్లు తెలిపారు. కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడా కనిపించిందన్నారు. దీనికి బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
TG: మెట్రో రైలు సేవలను మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, ఆ తర్వాత సంగారెడ్డి వరకు విస్తరించాలని మెదక్ MP రఘునందన్ రావు కోరారు. ఈ మేరకు మెట్రో MD NVS రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన MD త్వరలో గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు. 6 నెలల్లోపు శంకుస్థాపన కోసం కేంద్రాన్ని ఒప్పించాలని MP లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి?
విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా ‘ఫ్లయింగ్ స్కూల్’కు శ్రీకారం చుడుతోంది. భవిష్యత్తులో పైలట్ల కొరత ఉంటుందనే ఉద్దేశంతో పైలట్లను తయారు చేసేందుకు మహారాష్ట్రలోని అమరావతి వేదికగా ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పుతోంది. ఏడాదికి 180మందికి పైలట్ శిక్షణ ఇవ్వనుంది. అనుభవం లేకున్నా ఆసక్తి ఉన్నవారు ఇందులో ప్రవేశం పొందవచ్చట. ప్రస్తుతం ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలు ఇండియా, విదేశాల్లో ట్రైనింగ్ స్కూళ్లను నడిపిస్తున్నాయి.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడటంపై ఇండియా కూటమి నేతలకు AAP ఎంపీ స్వాతి మాలీవాల్ లేఖ రాశారు. ఈ విషయం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నేతలను కోరారు. ‘ఈ వ్యవహారంపై మాట్లాడినందుకు నాకు అండగా నిలవాల్సిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే నన్ను దూషిస్తున్నారు. 8ఏళ్ల పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌గా సేవలు అందించిన నాకు ఇలా జరగడం బాధాకరం’ అని పేర్కొన్నారు.
రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వ్యక్తిగా, ఆటగాడిగా తాను మెరుగవడంలో భార్య మిర్కా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆమె వల్లనే తనకు క్రమశిక్షణ అలవడిందన్నారు. కష్టకాలంలో తన వెంటే ఉండి ప్రోత్సహించిందన్నారు. టెన్నిస్ ప్లేయర్ అయిన మిర్కాను 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో రోజర్ తొలిసారి కలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.