News January 17, 2025

సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు

image

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.

News January 17, 2025

ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదు: కుమారస్వామి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తేవడమే కేంద్రం లక్ష్యమని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రానున్న రెండు, మూడేళ్లలో ప్లాంట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా చేస్తామన్నారు. ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదని స్పష్టం చేశారు. ఇవాళ ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ మొదటిదేనని, భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సాయాల ప్రకటనలు చేస్తామని పేర్కొన్నారు.

News January 17, 2025

ప్రధాని మోదీకి ధన్యవాదాలు: లోకేశ్ హర్షం

image

స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్రధాని మోదీ ఆమోదించిన రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్లాంట్‌కు పెద్దపీట వేసిన ప్రధాని మోదీకి ఈ క్రెడిట్ దక్కాలి. కేంద్రానికి ధన్యవాదాలు’ అని తెలిపారు.

News January 17, 2025

30లక్షల శునకాలను వధించే యోచనలో మొరాకో?

image

FIFA ప్రపంచ కప్‌-2030 నేపథ్యంలో మొరాకోలోని పలు నగరాలను వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు సందర్శించనున్నారు. అందుకు అనుగుణంగా నగరాలు మరింత అందంగా కనిపించేందుకు 30 లక్షల వీధి కుక్కలను వధించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని జంతు హక్కుల ప్రచారకర్త జేన్ గుడాల్ ఖండించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సంప్రదించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News January 17, 2025

అర్జున అవార్డు అందుకున్న దీప్తి జీవాంజి

image

పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలుగు తేజం దీప్తి జీవాంజి అర్జున అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా దీప్తి అవార్డు తీసుకున్నారు. వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి పారాలింపిక్స్ ఉమెన్స్ 400మీ పరుగులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.

News January 17, 2025

Veg Mode Fee వసూలుపై జొమాటో CEO క్షమాపణలు

image

కొత్తగా తెచ్చిన ‘వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్ ఫీ’పై విమర్శలతో జొమాటో వెనక్కి తగ్గింది. తాను వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినందుకు అదనంగా ₹2 ఛార్జ్ చేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘దేశంలో శాకాహారిగా ఉండటం ఖర్చుతో కూడుకున్నది’ అని జొమాటో CEOను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఇది వైరల్ కాగా స్పందించిన CEO దీపిందర్, తప్పుకు క్షమాపణ కోరడంతో పాటు ఈ స్టుపిడ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తానన్నారు.

News January 17, 2025

స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ప్రధాని మోదీ ట్వీట్

image

స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ప్లాంట్ ఈక్విటీ మద్దతు కింద రూ.10,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణంలో ఉక్కు రంగ ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తోంది’ అని పేర్కొన్నారు.

News January 17, 2025

8th పే కమిషన్.. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!

image

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2016లో 7th పే కమిషన్ ఏర్పాటుచేయగా, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీంతో బేసిక్ శాలరీ ₹7K నుంచి ₹18Kకు పెరిగింది. ఇప్పుడు 8వ కమిషన్‌లో ఫిట్‌మెంట్ 2.86 ఉంటుందని, బేసిక్ జీతం ₹51,480కి పెరుగుతుందని నిపుణుల అంచనా. కనీస పెన్షన్ ₹9K నుంచి ₹20+Kకి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.

News January 17, 2025

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ హామీని కేంద్రం నిలబెట్టుకుంది: రామ్మోహన్

image

విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాన్ని కేంద్రం కాపాడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు డైరెక్ట్ ఈక్విటీ కింద రూ.10,300Cr, షేర్ క్యాపిటల్ కింద రూ.1,140Cr బదిలీ చేసేలా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. దీంతో ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు.

News January 17, 2025

ఏపీ ప్రజలు గర్వించే విషయమిది: సీఎం చంద్రబాబు

image

AP: స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే పరిశ్రమ మాత్రమే కాదని, దీనికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.