India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: దేశంలో నియంత పాలనకు ఇదే నిదర్శనమని మంత్రి సీతక్క ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. నిన్న అద్వానీకి భారత రత్న ఇచ్చే సమయంలో ప్రధాని మోదీ ఆయన పక్కనే కూర్చొని ఉండగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిల్చొని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆదివాసీ మహిళను అవమానించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
AP: ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై పరిమితులు విధించగా.. తాజాగా రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్వోలు మ్యాపింగ్ చేయాలని సూచించింది. ఎండీయూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.
‘కచ్చతీవు’పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఇది ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం కాదని తెలిపారు. ‘ఈ దీవి గురించి కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు దాని గురించి 21 సార్లు తమిళనాడుకు సమాధానం ఇచ్చాను’ అని పేర్కొన్నారు. 1947 నాటికి భారత్ అధీనంలో ఉన్న దీవిని 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ శ్రీలంకకు కట్టబెట్టిందని ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
భారత్ – శ్రీలంకను వేరుచేసే పాక్ జల సంధిలో రామేశ్వరం దీవికి సమీపంలో ఈ కచ్చతీవు ఉంది. 1.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ <<12964536>>దీవి<<>>లో ఎవరూ నివసించరు. ఇక్కడ సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగే వేడుకల్లో తమిళులు పాల్గొంటారు. స్వాతంత్ర్యం రాకముందు ఈ దీవి రామ్‌నాడ్ పాలకుల ఆధీనంలో ఉండేది. అనంతరం భారత్‌లో చేరింది. మత్స్యసంపద ఎక్కువగా ఉండటంతో భారత మత్స్యకారులు చేపల వేట సాగిస్తారు.
శ్రీలంక మాత్రం ఈ ఒప్పందాన్ని పట్టించుకోవడం లేదు. మత్స్యకారులను తరుచూ అదుపులోకి తీసుకుంటోంది. న్యాయపరంగా ఈ <<12964536>>దీవి<<>> అప్పగింత చెల్లదని తమిళనాడులోని పలు పార్టీలు వాదిస్తున్నాయి. భారత భూభాగాలను రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు సేకరణతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మరోసారి పెళ్లి చేసుకోవాలని ఉంటే ఎన్నికలలోపే చేసుకోవాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలకు AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ తీవ్రంగా స్పందించారు. ‘ఆయనకు శక్తి లేక ఒక్క బిడ్డనే కన్నారు. నాకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. నాకు మళ్లీ చేసుకోవాలని అనిపిస్తే నేను ముఖ్యమంత్రిని అడగను’ అని పేర్కొన్నారు. కాగా తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ అజ్మల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.
AP: సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. రాజకీయ నేత, CM అన్న కారణాలతో విచారణ జాప్యం కావొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ ప్రక్రియ వేగంగా జరగాలని సీబీఐని ఆదేశించిన కోర్టు.. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.
నేడు రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై తప్ప అన్ని జట్లూ పాయింట్స్ టేబుల్‌లో ఖాతా తెరిచాయి. రెండు మ్యాచులూ ఘోరంగా ఓడిన ముంబైని కెప్టెన్ హార్దిక్ పాండ్య ఏ విధంగా నడిపించనున్నారన్నది ఆసక్తికరం. హోం స్టేడియమైన వాంఖడేలో కూడా తనపై వచ్చే తీవ్ర స్థాయి వ్యతిరేకతను ఆయన అధిగమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబైని విజయతీరాలకు చేర్చడం పాండ్యకు అగ్ని పరీక్షేనని విశ్లేషకులు అంటున్నారు.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ థియేటర్లలో సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీని ప్రకారం ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో టిల్లు స్క్వేర్ OTTలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో CM కేజ్రీవాల్ ED కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను Mar21న ED అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. Mar28 వరకు కస్టడీకి ఇచ్చింది. మరోసారి దాన్ని Apr1కి పొడిగించింది. అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు April 3కి వాయిదా వేసింది.
Sorry, no posts matched your criteria.