News March 31, 2024

మంగ్లీకి అరుదైన పురస్కారం

image

టాలీవుడ్ సింగర్ మంగ్లీకి అరుదైన పురస్కారం దక్కనుంది. ఆమెకు సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారం అందించనుంది. సంగీత ప్రపంచంలో మంగ్లీ అందుకున్న విజయాలకు గానూ ఈ అవార్డు ఇవ్వనున్నారు. కాగా మంగ్లీ ఇటీవల బెంగళూరులో స్వధా ఫౌండేషన్ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఉషా ఉతుప్, సుధా రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి ఆమె పాటలు పాడారు.

News March 31, 2024

ఏప్రిల్ 5న కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన ఖరారైంది. కరీంనగర్ రూరల్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడనున్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే.

News March 31, 2024

రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

image

గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డు నెలకొల్పారు. GT తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచారు. తాజాగా SRH‌తో మ్యాచులో క్లాసెన్ వికెట్ తీయడంతో ఈ ఘనత అందుకున్నారు. రషీద్ ఇప్పటివరకు గుజరాత్ తరఫున 49 వికెట్లు తీశారు. ఆ తర్వాతి స్థానంలో స్టార్ బౌలర్ షమీ(48) ఉన్నారు. గాయం కారణంగా షమీ ఈ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

News March 31, 2024

ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ!

image

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ప్రేమలు’ OTT రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను ఇటీవల తెలుగులో రిలీజ్ చేయగా.. మంచి వసూళ్లు రాబట్టింది. గిరీశ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కుమారుడు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేశారు. తొలుత మార్చి 29 నుంచే స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగింది.

News March 31, 2024

పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..(1/2)

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ-ఉత్తమ్, కరీంనగర్-పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి-శ్రీధర్ బాబు, వరంగల్-ప్రకాశ్ రెడ్డి, మహబూబాబాద్-నాగేశ్వర రావు, హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

News March 31, 2024

పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..(2/2)

image

TG: భువనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్-సంపత్ కుమార్, చేవెళ్ల-నరేందర్ రెడ్డి, మల్కాజిగిరి-మైనంపల్లి హనుమంత రావు, మెదక్-కొండా సురేఖ, నిజామాబాద్-సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్-సీతక్క, జహీరాబాద్-దామోదర రాజ నర్సింహ, నాగర్ కర్నూల్-జూపల్లి కృష్ణారావు.

News March 31, 2024

డీకే శివకుమార్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలోని తన ఆఫీసును కాంగ్రెస్ కార్యాలయంలా డీకే వాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. నిన్న ఆ కార్యాలయంలో నజ్మా నజీర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.

News March 31, 2024

పంత్ ఈజ్ బ్యాక్

image

లాంగ్ గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడుతున్న ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ సత్తా చాటారు. చెన్నైతో మ్యాచులో తనదైన షాట్లు బాదుతూ అర్ధ సెంచరీ చేశారు. దీంతో గాయం తర్వాత పంత్ ఆటపై వస్తున్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెప్పారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 31 బంతుల్లో ఫిఫ్టీ చేసిన పంత్ తన ఇన్నింగ్సులో 3 సిక్సర్లు, 4 ఫోర్లు బాదడం గమనార్హం.

News March 31, 2024

రేపు కవిత పిటిషన్‌పై విచారణ

image

TG: BRS MLC కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రేపు విచారించనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె గతంలో కోర్టును ఆశ్రయించగా.. విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. దీంతో రేపు కోర్టులో కవితకు ఊరట లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

News March 31, 2024

IPL: ఢిల్లీ భారీ స్కోరు

image

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. వార్నర్, పంత్ అర్ధసెంచరీలతో రెచ్చిపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. CSK బౌలర్లలో పతిరణ 3, జడేజా, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు. చెన్నై టార్గెట్ 192.