News June 16, 2024

పరీక్ష తేదీలు ప్రకటించిన TGPSC

image

TG: గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలను TGPSC ఖరారు చేసింది. జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌ను పైనున్న ఫొటోల్లో చూడవచ్చు. CBRT విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు 3 రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.

News June 16, 2024

వీరిలో మీ నాన్న ఎలాంటి వారు? 2/2

image

ఓవర్ ప్రొటెక్టివ్ డాడీ (ఎప్పుడూ మీ వెంటే ఉండేవారు), ది కూల్ డాడీ (ఏం జరిగినా ఓ నవ్వు నవ్వేవారు), ఎమోషనల్ డాడీ (ముఖ్యమైన ఈవెంట్లలో ఏడ్చేవారు), ఫ్యాషన్ డాడీ (అస్సలు డ్రెస్ సెన్స్ లేనివారు), హ్యాపీ డాడీ (ఇంట్లో అన్ని పనులు చేసేవారు), డిజాస్టర్ డాడీ (తన కోసం కూడా వంట చేసుకోలేని వారు), యాక్సిడెంటల్ డాడీ (మీకు సహాయం చేయాలని ఉన్నా ప్రమాదానికి గురై మంచంలో ఉన్నవారు). మీ ఫాదర్ ఎలాంటి వారో కామెంట్ చేయండి.

News June 16, 2024

వీరిలో మీ నాన్న ఎలాంటి వారు? 1/2

image

ఒకప్పుడు నాన్నంటే మందలింపులు, దండనలు ఉండేవి. కానీ ఇప్పుడు ఓ స్నేహితుడిగా మారాడు. అన్ని విషయాల్లో దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. ఒకప్పుడు నాన్న ఇంట్లో లేకపోతే అల్లరి. కానీ ఇప్పుడు నాన్న ఇంట్లో ఉంటేనే అల్లరి, లేదంటే నిశ్శబ్దమే. ప్రస్తుతం ప్రపంచంలో 7 రకాల నాన్నలు ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది.

News June 16, 2024

3 వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి

image

AP: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ వీటి ఏర్పాటుపై సమీక్షించారు. ‘3 వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీటి నిర్వహణ మళ్లీ ఇస్కాన్‌కు ఇవ్వాలా? టెండర్లు పిలవాలా? అనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీరుస్తాం. గతంలో 4 కోట్ల 60 లక్షల ప్లేట్ల ఆహారం అందించాం’ అని ఆయన వెల్లడించారు.

News June 16, 2024

మాజీ AAG పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు

image

AP: మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్(AAG) పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని మంగళగిరి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లుగా పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు.

News June 16, 2024

పోలవరం పనులపై ‘AP FACT CHECK’

image

AP: 2019కి ముందు పోలవరంలో 72% పనులు జరిగితే 2019-24 మధ్య 4 శాతమే జరిగాయని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ‘2019కి ముందు రూ.11,537కోట్లు ఖర్చు చేస్తే 2019-24 మధ్య రూ.5వేల కోట్లు ఖర్చు చేశారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. కాఫర్ డ్యాం, గ్యాప్-1 ప్రధాన డ్యాంలో ఇబ్బందులు వచ్చాయి. గైడ్‌బండ్ కుంగిపోయింది. కొత్తగా ఎలాంటి DPR ఆమోదం పొందలేదు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు కూడా నిర్మించలేదు’ అని వివరించింది.

News June 16, 2024

కోహ్లీ పరుగుల ఆకలితో ఉండటం మంచిదే: బ్యాటింగ్ కోచ్

image

టీ20 WCలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ‘కోహ్లీ బాగా రాణిస్తున్నారా లేదా అని ప్రతిసారి ప్రశ్నలు తలెత్తుతాయి. ఆయన పరుగులు చేయాలనే ఆకలితో ఉండటం మంచిదే. సూపర్-8 మ్యాచుల్లో కోహ్లీ అగ్రెసివ్‌నెస్ జట్టుకు సహాయపడుతుంది. నెట్స్‌లో ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రన్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News June 16, 2024

19 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

image

AP: ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4 రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 18న కేబినెట్ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News June 16, 2024

నేత్రావల్కర్‌కు జీతం పెంచాలి.. నెటిజన్ల డిమాండ్

image

ఓవైపు ఒరాకిల్ వంటి సంస్థలో ఉద్యోగం చేస్తూ, అమెరికా తరఫున బౌలర్‌గానూ రాణిస్తున్నారు సౌరభ్ నేత్రావల్కర్. యూఎస్ఏ జట్టు సూపర్-8కు చేరుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సౌరభ్‌కు జీతాన్ని పెంచాలంటూ ఒరాకిల్‌ను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అతడికి పని బరువును తగ్గించాలని కోరుతున్నారు. ముంబైలో పుట్టిన సౌరభ్ 2010లో భారత్ తరఫున అండర్-19 వరల్డ్ కప్ ఆడారు. ఉద్యోగరీత్యా USలో స్థిరపడ్డారు.

News June 16, 2024

చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు

image

AP: గుంటూరులో మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. నాని ఎక్కడున్నా బయటకు రావాలి అంటూ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఆ ఫ్లెక్సీలు వేయించారు. కాగా ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం చేసి ఆయన బూట్లు తుడుస్తానని నాని ప్రకటించినట్లు సమాచారం.