India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. DPIIT డేటా ప్రకారం 2024-25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) రూ.70,795 కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలవగా, కర్ణాటక, ఢిల్లీ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రూ.9,023 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, హరియాణా తరువాతి స్థానాల్లో నిలిచాయి.
రష్యా మాజీ ఒలింపిక్ క్రీడాకారిణి అలీనా కబేవాతో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు బిడ్డల్ని కన్నారని ఫోర్బ్స్ నివేదిక సంచలన కథనాన్ని ప్రచురించింది. మాస్కోలో పుతిన్‌కు చెందిన ఓ భారీ బంగ్లాలో అలీనా, ఆమె బిడ్డలు ఇవాన్, వ్లాదిమిర్ జూనియర్ కట్టుదిట్టమైన భద్రత మధ్య నివసిస్తున్నారని రాసుకొచ్చింది. కాగా పుతిన్‌కు ఓ మాజీ భార్య ఉన్నారు. ఆమెతో ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు.
దేశవ్యాప్తంగా 85శాతం జిల్లాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఐపీఈ గ్లోబల్, ఇస్రీ ఇండియా చేసిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. సంప్రదాయ వరద ప్రభావిత ప్రాంతాలు కరవుతో, సంప్రదాయ కరవు ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. 1973 నుంచి 2023 మధ్యకాలంలో వాతావరణ పరిస్థితుల వివరాలను అధ్యయనం చేసిన మీదట గత దశాబ్దకాలంలో వాతావరణంలో విపరీత మార్పులు ఐదింతలు పెరిగాయని వెల్లడించింది.
విఘ్నేశ్వరుడిని వివేకం, జ్ఞానం ప్రసాదించే దేవుడిగా భావిస్తారు. వివాహానికి సంబంధించిన పనులు వివేకంతో చేస్తూ విజయం సాధించాలని గణపతిని పూజిస్తారు. వినాయకుడు ఆదిపూజ్యుడు. నవ దంపతులు సంతోషకరమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదం పొందడానికి శుభలేఖపై ఫొటోను ముద్రిస్తూ భక్తిని చాటుకుంటారు. హిందూ ఆచారాల్లో వివాహం పవిత్రమైనది. ఈ బంధాన్ని చివరి వరకు కొనసాగించేందుకు పెళ్లిలో గణేశుడిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు.
Vodafone Idea షేర్ ధర శుక్రవారం 11.4% పడిపోయింది. ముందు రోజు ముగింపు రూ.15.09 నుంచి రూ.13.36 కనిష్ట స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో స్టాక్ ధరలో 83% భారీ క్షీణతను చూడవచ్చన్న గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల నేపథ్యంలో స్టాక్ నష్టాలబాటపట్టింది. ఈ లెక్కన స్టాక్ ధర రూ.2.5 స్థాయికి చేరుకోవచ్చని చెప్పింది. బలహీన వృద్ధి, మార్జిన్ ఆదాయం, బ్యాలెన్స్ షీట్ వల్ల ధర తగ్గవచ్చని అంచనా వేసింది.
TG: వరదల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే <<14038049>>తీరుగా<<>> చూడాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు కలిపి తక్షణ సాయంగా రూ.3,300 కోట్లు ప్రకటించామని వెల్లడించారు. ఇకపైనా అండగా ఉంటామని సెక్రటేరియట్‌లో సీఎంతో భేటీ సందర్భంగా హామీ ఇచ్చారు.
తిరుమలలో దాదాపు 4ఏళ్ల తర్వాత తిలక ధారణ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. దీన్ని టీటీడీ ఈవో శ్యామలరావు పున:ప్రారంభించారు. తిరుమలలోని ఏటీసీ, సుపథం, వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, VQC ఎంట్రీలు, రూ.300 లైన్, KKC మెయిన్ వద్ద నిరంతరాయంగా తిలక ధారణ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాగా కరోనా వల్ల ఈ కార్యక్రమాన్ని టీటీడీ గతంలో నిలిపివేసింది. తాజాగా పున:ప్రారంభించింది.
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీటరుకు రూ.4 నుంచి రూ.6 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబర్‌లో మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకూ ధరలు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు TPCC చీఫ్ బాధ్యతలు అప్పగించడంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్దేశానుసారం, సీనియర్ల మార్గదర్శకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణ ప్రజల సేవలో పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
శాకాహార భోజనం ధరలు జులైతో పోలిస్తే ఆగస్టులో 8 శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే నాన్‌వెజ్ భోజనం ధరలు 12 శాతం తగ్గినట్లు పేర్కొంది. టమాటా, ఎల్పీజీ, అందులో వినియోగించే సరకుల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని తెలిపింది. మరోవైపు చికెన్ ధరలు భారీగా 50 శాతం తగ్గడంతో నాన్‌వెజ్ థాలీ ధరలు దిగి వచ్చినట్లు వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.