News January 6, 2025

ఆందోళన వద్దు.. మీరోజు కోసం వేచి ఉండండి!

image

ఇద్దరూ ఒకేసారి ప్రారంభించినప్పటికీ నీ స్నేహితుడు ముద్దాడిన విజయం మీ దరిచేరలేదని ఆందోళన పడుతున్నారా? ఓసారి పైనున్న ఈ ఫొటో చూడండి. రెండు జామకాయలు ఒకేసారి పక్కపక్కనే పెరిగినా, ఒకటి మాత్రం పండుగా మారింది. అచ్చం ఇలానే విజయం కోసం మీ సమయం వచ్చేవరకూ వేచి ఉండాలి. నిరాశతో మీరు ఫెయిల్ అయ్యారని అనుకోకుండా మీరోజు కోసం వేచి ఉండండి. విజయంలో ఉన్న స్వీట్‌నెస్‌ను రుచిచూడండి.

News January 6, 2025

అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ <<15069986>>పోలీసులు మరోసారి<<>> నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన వెళ్తే గంటలోగా పర్యటన పూర్తి చేసుకోవాలన్నారు. దీనిని రహస్యంగా ఉంచాలని, ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామన్నారు.

News January 6, 2025

కేంద్రం సహకరిస్తే ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాం: CM

image

TG: మెట్రో రైలు విస్తరణకు, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని అన్నారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని కోరారు.

News January 6, 2025

భారత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుంది.. ట్రూడోపై సెటైర్లు

image

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి <<15076593>>రాజీనామా చేస్తారని<<>> వార్తలు రావడంతో భారతీయులు ఖుషీ అవుతున్నారు. ఖలిస్థానీలకు మద్దతు తెలిపి, ఇండియాపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తగిన శాస్తి జరిగిందని పోస్టులు చేస్తున్నారు. ఇండియాకు హాని చేసే శక్తులు కెనడాలో ఉన్నా.. వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సపోర్ట్ చేశారని ఫైరవుతున్నారు. భారత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుందని ఎద్దేవా చేస్తున్నారు.

News January 6, 2025

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌కు ఆటంకం?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు తమిళనాడులోని ‘లైకా ప్రొడక్షన్స్’ షాక్ ఇచ్చింది. డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్-3’ని పూర్తి చేయకుండా దిల్ రాజు తన ‘గేమ్ ఛేంజర్’ను TNలో విడుదల చేయొద్దని సూచించినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ తర్వాత ఇండియన్-3 మిగిలిన షూటింగ్ పూర్తిచేస్తామని శంకర్ లైకాకు తెలిపారని టాక్. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి.

News January 6, 2025

No Hikes: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్!

image

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాకిచ్చింది. వేతనాల పెంపును FY25 నాలుగో త్రైమాసికానికి వాయిదా వేసినట్టు తెలిసింది. అంటే ఏప్రిల్ వరకు పెంపు ఉండనట్టే. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో హైక్ ఇవ్వడం గమనార్హం. సాధారణంగా ఇన్ఫీ 2025 ఆరంభంలోనే హైక్‌ను ప్రకటించాల్సింది. ప్రాఫిటబిలిటీ కోసం HCL TECH, LTI MINDTREE, L&T వేతనాల పెంపును వాయిదా వేయడంతో ఆ బాటలోనే నడిచింది. పర్ఫామెన్స్ బోనస్ మాత్రం సగటున 90% వరకు ఇచ్చింది.

News January 6, 2025

గుజరాత్‌లో తొలి HMPV వైరస్ కేసు: దేశంలో ఎన్నంటే?

image

గుజరాత్‌లో తొలి HMPV వైరస్ కేసు నమోదైనట్టు సమాచారం. అహ్మదాబాద్ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పేషంట్ చేరినట్టు ABP అస్మిత న్యూస్ తెలిపింది. ఆ చిన్నారి వయసు రెండేళ్లని పేర్కొంది. దీంతో దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు చేరుకున్నట్టైంది. బెంగళూరులో మూడు, ఎనిమిది నెలల చిన్నారులకు HMPV సోకినట్టు ICMR ఉదయం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది.

News January 6, 2025

ఆఫీసుల్లో మాస్కులు షురూ!

image

HMPV భారత్‌లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు దాపురించేలా ఉన్నాయి. కార్పొరేట్ కార్యాలయాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. జనాల తాకిడి ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇకపై మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. బెంగళూరులో ఇవాళ ఒక్క రోజే 2 HMPV పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

News January 6, 2025

ఘోరం.. చంపి, గుండెను బయటకు తీశారు!

image

ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను అత్యంత ఘోరంగా చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అతడిని చంపి గుండెను బయటకు తీశారని, కాలేయం 4 ముక్కలైందని గుర్తించారు. పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. రూ.120 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ముకేశ్ కథనాలు ప్రసారం చేశారు. ఆ కొన్నిరోజులకే కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో ముకేశ్ డెడ్ బాడీ లభ్యమైంది.

News January 6, 2025

ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

image

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హైదరాబాద్‌లోని ఆ ఆఫీసుకు చేరుకున్నారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, సెజ్ వాటాలను తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సెజ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కోణంపై ప్రధానంగా ఆయన్ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.