India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ICET ఫలితాలను HYD ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు విడుదల చేశారు. జూన్ 5, 6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 77వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 71,647 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో 33,928 మంది పురుషులు కాగా, 37,718 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. 5543 మంది నాన్-లోకల్ కేటగిరీలో అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. WAY2NEWS యాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లిన నేపథ్యంలో మరోసారి ‘MELODI’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో మోదీతో సెల్ఫీని షేర్ చేసిన ఇటలీ ప్రధాని మెలోని ‘గుడ్ ఫ్రెండ్స్ #MELODI’ అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి వీరి ఫొటోలతో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం G7లోని 4దేశాలకు మించిన ఎకానమీ భారత్ సాధించడంతో మోదీని మెలోని ప్రత్యేకంగా <<13433417>>ఆహ్వానించారు.<<>>
AP: టెక్నాలజీ సాయంతో పరిపాలనను సులభతరం చేసేందుకు 2014లో TDP ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థే రియల్ టైమ్ గవర్నెన్స్. చంద్రబాబు రాకతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్యవస్థతో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో సచివాలయంలోనే పర్యవేక్షించొచ్చు. ప్రభుత్వ శాఖల పనితీరు, ట్రాఫిక్, ప్రాజెక్టులు, మీడియా, వాతావరణం వంటి అంశాలను RTGS కేంద్రం నుంచే సమీక్షించొచ్చు. తమ ప్రాంతాల్లోని సమస్యలపై ప్రజలు ఇందులో ఫిర్యాదు చేయొచ్చు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, హనుమకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
AP: డిప్యూటీ సీఎంగా నియమితులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కంగ్రాట్స్ చెప్పారు. ‘మంత్రివర్గంలో వివిధ శాఖలు పొందిన నా సహచరులందరికీ అభినందనలు. అందరం రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనకు నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మీరు కృషి చేస్తారనే నమ్మకం నాకుంది. నూతన ప్రయాణంలో మరోసారి అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్వీట్ చేశారు.
AP: రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక శాఖలు దక్కడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం&వైద్య విద్య శాఖలు నాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ పెద్దలు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞుడను. ప్రజలకు అంకితభావంతో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నా. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఓ దశలో 23,490కి చేరి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన నిఫ్టీ, మార్కెట్ ముగిసే సమయానికి 66 పాయింట్ల లాభంతో 23,465 వద్ద స్థిరపడింది. మరోవైపు సెన్సెక్స్ సైతం 77వేల మార్క్ చేరుకుని 181 పాయింట్ల లాభంతో 76,992 వద్ద క్లోజ్ అయింది. కాగా నిఫ్టీ మిడ్‌క్యాప్ సైతం 55,262 పాయింట్లు చేరి జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
జీ7 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి బారీలో ఉన్న ‘నమస్తే ఇండియా’ రెస్టారెంట్ ఆయనకు ఆహారాన్ని ఏర్పాటు చేయనుంది. నోరూరించే భారత వంటకాలకు ఈ హోటల్ ప్రసిద్ధి. శాకాహార భోజన తయారీలోనూ మంచి పేరుండటంతో, మోదీకి భోజనాన్ని అందించే బాధ్యతల్ని దీనికి అప్పగించినట్లు తెలుస్తోంది.
AP డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండనున్నారు. పవన్ గౌరవం తగ్గించకూడదనే ఉద్దేశంతో మరెవరికీ ఈ పదవిని చంద్రబాబు కేటాయించలేదు. జగన్ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండగా, ఈ సారి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు జనసేనానికి దక్కాయి.
ఐపీఓకు అనుమతి కోరుతూ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నేడు సెబీకి డ్రాఫ్ట్ ఫైల్ చేసింది. ఈ ఐపీఓతో రూ.7వేల కోట్లు సమీకరించాలని సంస్థ భావిస్తోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.4వేల కోట్లు, మాతృ సంస్థ అయిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.3వేల కోట్ల షేర్లు విక్రయించనున్నాయి. సెబీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ ఐపీఓ అందుబాటులోకి రానుంది. కాగా షేర్ కొనుగోలు ధరను సంస్థ వెల్లడించాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.