News December 20, 2024

మీకు తెలుసా?.. వారాల వ్యవధిలో రెండు సార్లు పుట్టిన చిన్నారి!

image

టెక్సాస్‌లోని లూయిస్‌విల్లేకు చెందిన మార్గరెట్ హాకిన్స్ బోమెర్ 16 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు శిశువుకు వెన్నెముక సమస్యను వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసేందుకు తల్లి గర్భంలోంచి 20 నిమిషాల పాటు బయటకు తీసి వెన్నెముకపై ఉన్న కణితిని ఆపరేషన్ చేసి తొలగించారు. తర్వాత శిశువును తిరిగి గర్భసంచిలో ఉంచారు. వారాలు నిండిన తర్వాత మరోసారి ఆపరేషన్ చేసి చిన్నారి లిన్లీ హోప్‌‌కు రెండో జన్మనిచ్చారు.

News December 20, 2024

2024లో భారత్ సాధించిన గొప్ప విజయాలివే!

image

ఇండియా సాధించిన అతిపెద్ద విజయాలను పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా Xలో రాసుకొచ్చారు. అందులో చంద్రయాన్-3ని మన దేశం సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొచ్చారు. దీని తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం, G20 నాయకత్వం, డిజిటల్ ఇండియా పెరగడం, 110 యునికార్న్‌లకు పైగా అభివృద్ధి, మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రపంచ కప్ విజయం, గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరగడం అని తెలిపారు.

News December 20, 2024

ఆ అటార్నీ జనరల్ త్వరలో రాజీనామా

image

అదానీపై అమెరికా న్యాయ శాఖ మోపిన లంచాల అభియోగాల కేసును డీల్ చేస్తున్న బ్రూక్లిన్ అటార్నీ జనరల్ బ్రియాన్ పీస్ తన పదవికి Jan 10న రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పీస్ కొన్ని హైప్రొఫైల్ కేసులను వాదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అటార్నీగా USకు సేవ‌లందించ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. 2021లో బైడెన్ ఆయ‌న్ను నియ‌మించ‌గా, ట్రంప్ బాధ్య‌తలు చేప‌ట్ట‌డానికే ముందే రాజీనామా చేయ‌నున్నారు.

News December 20, 2024

తిరుమల రూ.300 టికెట్ల బుకింగ్ తేదీల్లో మార్పు

image

మార్చి నెల శ్రీవాణి, రూ.300 దర్శనం టికెట్ల విడుదల తేదీల్లో మార్పు చేసినట్లు TTD ప్రకటించింది. శ్రీవాణి టికెట్లు డిసెంబర్ 25న ఉ.11 గంటలకు, రూ.300 టికెట్లు డిసెంబర్ 26న ఉ.11 గంటలకు రిలీజ్ చేస్తామని పేర్కొంది. అదేరోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మార్పును గమనించి <>ttdevasthanams.ap.gov.in<<>> వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

News December 20, 2024

అత్యధిక వ్యూస్ కలిగిన యూట్యూబ్ ఛానల్ ఇదే!

image

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లను మిస్టర్ బీస్ట్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే, అత్యధిక వ్యూస్ మాత్రం టీసిరీస్‌ ఛానల్ కలిగి ఉంది. ఇందులోని వీడియోస్‌కు మొత్తం కలిపి 259.4 బిలియన్ వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత ‘కోకోమిలన్- నర్సరీ రైమ్స్’కు 184.7 బిలియన్ వ్యూస్, ‘సెట్ ఇండియా’కు 165.8B, ‘SONY SAB’కి 116.2B, కిడ్స్ డయానా షోకి 104.1B, LIKE NASTYAకి 101.6B, ZEE TVకి 91 బిలియన్ వ్యూస్ వచ్చాయి.

News December 20, 2024

బీజేపీ ఎంపీల‌కు ఆస్కార్ ఇవ్వాలి: జ‌యా బ‌చ్చ‌న్‌

image

రాహుల్ గాంధీ తోయ‌డం వ‌ల్లే తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు చెబుతున్న BJP MPల న‌ట‌నా చాతుర్యానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాల‌ని MP జ‌యా బ‌చ్చ‌న్ ఎద్దేవా చేశారు. త‌న సినీ జీవితంలో ఎన్న‌డూ చేయ‌ని విధంగా BJP ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుర్ న‌ట‌న ప్ర‌ద‌ర్శించార‌ని విమ‌ర్శించారు. స‌భ‌లోకి వెళ్తున్న త‌మ‌ను బీజేపీ ఎంపీలు అడ్డ‌గించార‌ని, ఈ క్ర‌మంలో జరిగిన తోపులాట‌లో ఎవ‌రైనా స‌హ‌జంగానే కింద‌ ప‌డ‌తార‌న్నారు.

News December 20, 2024

25 నుంచి థియేటర్లలో ‘పుష్ప 2’ కొత్త వెర్షన్?

image

‘పుష్ప 2’ కొత్త వెర్షన్‌ను మేకర్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిడివికి మరో 18 నిమిషాల ఫుటేజ్ కలిపారని, దీనిని ఈ నెల 25 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారని టాక్. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు ఉంది. కొత్త సీన్లు కలిపితే 3 గంటల 38ని. కానుంది. కలెక్షన్లు పెంచేందుకు ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రూ.1,500 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.

News December 20, 2024

తన తల్లిలా మరెవరూ చనిపోవద్దని..!

image

ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో కరీముల్ హక్ అనే పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన కార్మికుడు తన తల్లిని కోల్పోయాడు. దీంతో తన తల్లికి జరిగినట్లు మరెవరికీ అవ్వొద్దని ఆయన వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బైక్‌ను అంబులెన్సుగా మార్చుకుని స్వగ్రామం ధలాబరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తక్షణ సేవలు అందిస్తూ 7వేల కంటే ఎక్కువ మందిని ఆయన కాపాడారు. ఆయనకు 2017లో పద్మశ్రీ వరించింది.

News December 20, 2024

‘భూ భారతి’ బిల్లు ఆమోదంపై రూపకర్త ఏమన్నారంటే?

image

TG: ‘భూ భారతి’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంపై భూ చట్టాల నిపుణుడు, బిల్లు రూపకర్త భూమి సునీల్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టం రూపొందించేందుకు ఆయన ఎంతలా శ్రమించారో Xలో రాసుకొచ్చారు. ‘ఓ సంవత్సర కష్టం. వందల గంటల మీటింగ్‌లు. వేల మంది అభిప్రాయాలు. 24 డ్రాఫ్ట్‌లు. భూభారతి (ఆర్.ఓ.ఆర్) చట్టం. ఈరోజు అసెంబ్లీ ఆమోదించింది’ అని పేర్కొన్నారు.

News December 20, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది.