News March 29, 2024

బుమ్రా పేరిట చెత్త రికార్డు

image

టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా అతడు రికార్డులకెక్కారు. 2013లో ఐపీఎల్ డెబ్యూ చేసిన బుమ్రా ఇప్పటి వరకు 29 నో బాల్స్ వేశారు. అతడి తర్వాతి స్థానాల్లో ఉమేశ్ యాదవ్(24), శ్రీశాంత్(23), ఇషాంత్ శర్మ(22), అమిత్ మిశ్రా(21), లసిత్ మలింగ(18) ఉన్నారు.

News March 29, 2024

మార్చి 31లోపు చేయాల్సిన పనులివే

image

* మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నవారు రీకేవైసీ పూర్తి చేయాలి.
* బ్యాంకుల్లో ఆధార్, పాన్ కార్డు లేకపోతే కేవైసీని అప్‌డేట్ చేయాలి.
* ఐటీ రిటర్న్, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయాలి.
* SBI అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి ముగియనుంది.
* గృహ రుణాలపై పలు బ్యాంకులు ఇస్తున్న ప్రత్యేక రాయితీలు మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి.

News March 29, 2024

పోటీ నుంచి తప్పుకోవట్లేదు: ఎంపీ కవిత

image

TG: తాను లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎంపీ మాలోతు కవిత స్పష్టం చేశారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని తెలిపారు. ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఊహాగానాలు రావడంతో ఆమె స్పందించారు.

News March 29, 2024

ధోనీ అద్భుతమైన ప్లేయర్: స్టీవ్ స్మిత్

image

క్రికెట్‌ను ధోనీ కంటే గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరని ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కొనియాడారు. ‘వికెట్ల వెనుక మిస్టర్ కూల్‌ను మించిన ఆటగాడు ఇండియాలో లేరు. అన్ని కోణాల్లోనూ ఆటను అర్థం చేసుకుంటారు. గేమ్ బయట ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. గ్రౌండులో చాలా కూల్‌గా ఉంటారు. అతనొక అద్భుతమైన ప్లేయర్. మహేంద్రుడితో కలిసి ఆడటం నాకు దక్కిన గొప్ప అవకాశం. నాకు ఆటపరంగా ఎంతో సాయం చేశారు’ అని పేర్కొన్నారు.

News March 29, 2024

దేవినేని ఉమాకు ఎన్నికల బాధ్యతలు

image

AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు అధిష్ఠానం ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా ఆయనను నియమించింది. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో ఆయనకు టికెట్ దక్కలేదు. 2009, 14లో ఆయన మైలవరం MLAగా గెలుపొందారు. YCP నుంచి TDPలో చేరిన సిట్టింగ్ MLA కృష్ణప్రసాద్‌కు TDP మైలవరం టికెట్ ఇచ్చింది.

News March 29, 2024

‘ఫోన్ నంబర్లు మార్చలేక చస్తున్నాం’

image

TG: రాష్ట్రంలో వలస నేతలతో రాజకీయం హీటెక్కుతోంది. ఈ పరిణామాలపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘తెల్లారేసరికి ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఫోన్లో వాళ్ల పేరు వెనుకో ముందో పార్టీ పేరు తగిలించి సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ మార్చలేక చస్తున్నాం’ అని కొందరు, ‘ఒకప్పుడు.. బెల్లం చుట్టూ ఈగలు. ఇప్పుడు.. అధికారం చుట్టూ నేతలు’ అంటూ మరికొందరు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

News March 29, 2024

విశ్వక్ సేన్ కొత్త మూవీ టైటిల్ ఇదే..

image

హీరో విశ్వక్ సేన్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త మూవీపై అప్డేట్ వచ్చింది. న్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ టైటిల్‌ను చిత్రబృందం రివీల్ చేసింది. ‘మెకానిక్ రాకీ’ పేరును ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్ నటిస్తోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ విడుదలకు సిద్ధమైంది.

News March 29, 2024

మంత్రుల నియోజకవర్గంలో గెలుపెవరిదో?

image

AP: ఉమ్మడి నెల్లూరు(సిటీ, రూరల్) సెగ్మెంట్ మంత్రుల నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారముంది. గతంలో సుబ్బారెడ్డి, వెంకట రెడ్డి, రామనారాయణ రెడ్డి, రమేశ్ రెడ్డి, నారాయణ, అనిల్ కుమార్‌లను మంత్రి పదవులు వరించాయి. ఈసారి నెల్లూరు సిటీలో నారాయణ(TDP), ఖలీల్ అహ్మద్(YCP).. రూరల్‌లో శ్రీధర్ రెడ్డి(TDP), ప్రభాకర్ రెడ్డి(YCP) పోటీ పడుతున్నారు.
#ELECTIONSPECIALS

News March 29, 2024

న్యూజిలాండ్ To అమెరికా

image

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ యూటర్న్ తీసుకున్నారు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న అతడు USA తరఫున ఆడాలని నిర్ణయించుకున్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోరె అమెరికాలో స్థిరపడి అక్కడి దేశవాళీ లీగ్‌లలో రాణిస్తున్నారు. తాజాగా అతడికి అమెరికా నేషనల్ క్రికెట్ టీమ్‌లో చోటు దక్కింది. కెనడాతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. T20WC-2024లోనూ USA తరఫున బరిలోకి దిగనున్నారు.

News March 29, 2024

అందుకే కేజ్రీవాల్ ఫోన్ కావాలంటున్నారు: అతిశీ

image

ఈడీని BJP పొలిటికల్ వెపన్‌లా వాడుకుంటోందని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. ‘కేజ్రీవాల్ ఫోన్‌లో ఏముందో తెలుసుకోవాలని BJP అనుకుంటోంది. లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో ఆయన వాడిన ఫోన్ తమకు లభించలేదని ఈడీ గతంలో చెప్పింది. ఇప్పుడేమో ఆయన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పట్లేదని అంటోంది. ఫోన్‌లోని వివరాల కోసం కస్టడీని పొడిగించాలని కోరింది. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకునేందుకే ఇలా చేస్తోంది’ అని అన్నారు.