News September 5, 2024

రేషన్ ‌కార్డు లేని వారికి ఆధార్ ద్వారా సరకులు

image

AP: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి <<14017515>>నిత్యావసరాలు <<>>పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ-పోస్ మిషన్ ద్వారా నిత్యావసరాలు ఇస్తామన్నారు. ముంపు ప్రాంతాల్లో 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 2 లక్షల మందికి సరకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు.

News September 5, 2024

ఆగస్టులో 27 వేల మందిని ఇంటికి పంపిన టెక్ సంస్థలు

image

టెక్ సంస్థల్లో మరోసారి లేఆఫ్స్‌ కొనసాగుతున్నాయి. గత నెలలో ఏకంగా 40 కంపెనీలు 27 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. లేఆఫ్స్ ప్రకటించిన సంస్థల్లో ఐబీఎం, ఇంటెల్, సిస్కో వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ఇంటెల్ సంస్థ ఆగస్టులో 15 వేల మంది, సిస్కో సిస్టమ్స్ 6 వేల మందిని ఇంటికి పంపింది. యాపిల్, డెల్, షేర్‌చాట్ సంస్థలు కూడా కొంత మందిని తొలగించాయి. ఈ ఏడాదిలో మొత్తం 1.26 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

News September 5, 2024

విజయ్ లుక్స్ వైరల్.. నెట్టింట ట్రోలింగ్

image

తమిళ హీరో విజయ్‌కి సంబంధించిన ఓ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులతో విజయ్ దిగిన ఫొటోను ఆయన ఫ్యాన్స్ ట్రెండ్స్ పేజీ తాజాగా షేర్ చేసింది. అందులో మీసం లేకుండా కేవలం గడ్డంతో ఆయన కనిపిస్తున్నారు. దీంతో విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఆ లుక్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌’లో డీ-ఏజింగ్ పాత్ర కోసం ఆయన కొత్త లుక్ ట్రై చేసిన సమయంలో ఈ ఫొటోను తీసినట్లు కోలీవుడ్ వర్గాలంటున్నాయి.

News September 5, 2024

మంత్రి సవిత తనయుడి మంచి మనసు

image

AP: విజయవాడ వరద బాధితులకు మంత్రి సవిత తనయుడు జగదీశ్ సాయి తన వంతు సాయం చేశారు. తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.21 వేలను సీఎం చంద్రబాబుకు అందించారు. చిన్న వయసులోనే సహృదయంతో ఆలోచించిన ఆ బాలుడిని అందరూ అభినందిస్తున్నారు. కాగా వారంరోజులుగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సవిత పర్యటిస్తున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆమె చర్యలు తీసుకుంటున్నారు.

News September 5, 2024

డేరా బాబాకు 6 సార్లు పెరోల్ ఇచ్చిన జైలు మాజీ అధికారికి బీజేపీ టికెట్

image

అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న డేరా స‌చ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్‌కు ఆరుసార్లు పెరోల్ మంజూరు చేసిన జైలు మాజీ అధికారి సునీల్ సంగ్వాన్‌కు హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ ద‌క్కింది. ఇటీవ‌ల త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన సునీల్ మూడు రోజుల క్రితమే బీజేపీలో చేరారు. 67 మందితో కూడిన బీజేపీ తొలి జాబితాలో స‌నీల్ సంగ్వాన్‌ పేరు కూడా ఉండడం గమనార్హం.

News September 5, 2024

సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో కమల్ హాసన్.. ఫొటో వైరల్

image

విశ్వనటుడు కమల్ హాసన్ బాల్యనటుడిగానూ నటించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల వయసులోనే ‘కలత్తూర్ కణమ్మ’ సినిమాలో నటించగా దీనికి ఆయనకు రాష్ట్రపతి మెడల్ లభించింది. దీంతో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బంగారు పతకాన్ని కమల్ హాసన్‌కు అందించారు. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఈ ఫొటో వైరలవుతోంది.

News September 5, 2024

MS WORD వాడుతున్నారా?

image

కంప్యూటర్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో MS WORDతో పని పడుతుంది. అయితే, ఇంపార్టెంట్ మేటర్‌ని టైప్ చేశాక సేవ్ చేయకముందే అనుకోకుండా క్లోజ్ కావడంతో టెన్షన్ పడుతుంటారు. అలాంటి వారికి ఈ టెక్నిక్ ఉపయోగపడొచ్చు. ఎప్పుడైనా సేవ్ చేయకుండా ఎగ్జిట్ అయితే ఇలా చేయండి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోకి వెళ్లి MY PC/THIS PCని ఓపెన్ చేసి సెర్చ్‌లో .ASD టైప్ చేస్తే అందులో ఈ ఫైల్ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

News September 5, 2024

జోగి రమేశ్ కోసం పోలీసుల వేట

image

AP: TDP కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం పోలీసులు హైదరాబాద్‌లో గాలిస్తున్నారు. ఆయనను పట్టుకునేందుకు 3 స్పెషల్ టీమ్స్ హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నాయి. జోగితోపాటు YCP నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాం కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే కేసులో YCP మాజీ MP నందిగం సురేశ్‌ను పోలీసులు హైదరాబాద్‌లోనే అరెస్ట్ చేశారు.

News September 5, 2024

ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.

News September 5, 2024

ఉదయ్‌పూర్ ఘటన‌లో నిందితుడికి బెయిల్

image

ఉదయ్‌పూర్‌లో టైలర్‌ కన్హయ్యలాల్‌ హత్య కేసులో నిందితుడు మహమ్మద్ జావేద్‌కు రాజస్థాన్‌ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2022లో మహ్మద్ ప్రవక్తపై BJP మాజీ లీడర్ నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించారనే ఆరోపణలతో కన్హయ్య లాల్ అనే టైలర్‌ను అతని దుకాణంలో రియాజ్ అత్తారి, గౌస్ మహ్మద్ తల నరికి చంపారు. వీరికి జావేద్ సహకరించాడని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.