News March 28, 2024

కరీనా కపూర్ పొలిటికల్ ఎంట్రీ?

image

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) పార్టీలో ఆమె చేరుతున్నట్లు సమాచారం. ఆమెతోపాటు ఆమె సోదరి కరిష్మా కపూర్ కూడా ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వీరు పోటీ చేయనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) పార్టీలో చేరారు.

News March 28, 2024

నల్లమిల్లికి చంద్రబాబు ఫోన్

image

AP: అనపర్తి నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు <<12940627>>ఫోన్<<>> చేశారు. ఈ సందర్భంగా టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం. ‘పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే నన్ను బలిచేశారు. మీ కోసం తెగించి పోరాడిన కొద్ది మందిలో నేనూ ఒకడిని. నాడు YSR పిలిచినా మా కుటుంబం మీ వెంటే నడిచింది. 40 ఏళ్ల మా కుటుంబ పోరాటాన్ని మరిచారా’ అని నల్లమిల్లి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

News March 28, 2024

FLASH: పరీక్షల తేదీలు మారాయ్

image

JEE మెయిన్ సెషన్-2 పరీక్ష తేదీల్లో మరోసారి మార్పులు జరిగాయి. APR 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షలను APR 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. అంతకుముందు APR 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన NTA.. రెండుసార్లు తేదీల్లో మార్పులు చేసింది. విద్యార్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలను jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి.

News March 28, 2024

మైనపు విగ్రహంతో ఐకానిక్ స్టార్

image

హీరో అల్లు అర్జున్​కు ఇవాళ అరుదైన గౌరవం దక్కనుంది. దుబాయ్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని రాత్రి 8 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఐకానిక్ స్టార్ ‘చాలా ఉత్సాహంగా ఉంది. ప్రతి నటుడికి ఇదో మైలురాయి క్షణం’ అని ట్వీట్ చేశారు. దానికి మైనపు విగ్రహంతో దిగిన ఫొటోను జతచేశారు.

News March 28, 2024

MLC ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 100 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏఆర్వో వెంకట మాధవరావు తెలిపారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. మొత్తం 1439 మంది ఓటర్లుండగా అందరూ ఓటేశారు. కాగా కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.

News March 28, 2024

వార్నర్, స్టొయినిస్‌కు ఆసీస్ బిగ్ షాక్

image

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, అస్టన్ అగర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. 2024-25 సీజన్‌కు గానూ వీరి సెంట్రల్ కాంట్రాక్టును సీఏ రద్దు చేసింది. జేవియర్ బార్ట్‌లెట్, అరోన్ హార్డీ, మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్‌కు తొలిసారి కాంట్రాక్ట్ కట్టబెట్టింది. వీరందరూ గతేడాది జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.

News March 28, 2024

6న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఏప్రిల్ 6న హైదరాబాద్‌ శివారులోని తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

News March 28, 2024

నిర్మల ‘డబ్బుల్లేవ్’ వ్యాఖ్యలపై మీరేమంటారు?

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ‘నా దగ్గర ‘‘అంత డబ్బు’’ లేకపోవడం వల్లే ఎన్నికలకు దూరంగా ఉంటున్నా’ అని ఆమె చెప్పారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ చేస్తున్న నేతలంతా తాను చెప్పిన ‘అంత డబ్బు’ ఖర్చు చేస్తున్నారా?, మరి డబ్బు లేని వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదనేదే తన ఉద్దేశమా అని అంటున్నారు. దీనిపై మీ కామెంట్? .

News March 28, 2024

ఈనెల 30న కాంగ్రెస్‌లోకి కేకే, విజయలక్ష్మి?

image

TG: BRS సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్‌లో చేరే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఈనెల 30న హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. కేకేతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కాసేపటి క్రితమే కేకే.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీ మారేందుకు ఆయన అనుమతి తీసుకునేందుకు కేకే వెళ్లినట్లు తెలుస్తోంది.

News March 28, 2024

ముగిసిన పోలింగ్

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.