News June 7, 2024

అశోక్ గజపతిరాజు సతీమణికి తీవ్ర అస్వస్థత

image

AP: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సతీమణి సునీల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం ఎమ్మెల్యేగా అశోక్ కుమార్తె అదితి విజయలక్ష్మి విజయం సాధించారు.

News June 7, 2024

పాక్‌తో మ్యాచ్ చరిత్ర అవుతుంది: హార్దిక్ పాండ్య

image

T20WCలో ఎల్లుండి పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ తనకు మరింత స్పెషల్‌గా ఉంటుందని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెల్లడించారు. ఇది పోరాటం కాదు.. చరిత్ర అవుతుందని పేర్కొన్నారు. ‘పాక్‌తో పోరు ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటుంది. ఆనందం, బాధ, ఆందోళన అన్నింటినీ అభిమానులు, ఆటగాళ్లు అనుభవిస్తారు. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. హార్దిక్ పాక్‌పై 6 మ్యాచ్‌లలో 84 రన్స్, 11 వికెట్లు పడగొట్టారు.

News June 7, 2024

కాంగ్రెస్: 3 ఎన్నికల్లో 195.. బీజేపీ: 2024లోనే 240

image

2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. 2014 నుంచి ఇప్పటివరకు 3 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన మొత్తం సీట్ల కంటే 2024లో బీజేపీ సాధించిన సీట్లు ఎక్కువ కావడం గమనార్హం. హస్తం పార్టీ 2014లో 44, 2019లో 52, 2024లో 99 సీట్లు.. అంటే మొత్తం 195 స్థానాల్లో గెలిచింది. అయితే 2024 ఎన్నికల్లోనే బీజేపీ 240 సీట్లు సాధించింది.

News June 7, 2024

ఈ రాత్రికి మంత్రి పదవులపై స్పష్టత!

image

కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఈ రాత్రికి ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్డీయే పక్ష నేతలు కాసేపట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లనున్నారు. కూటమిలోని పార్టీలకు ఇచ్చే మంత్రి పదవులపై చర్చించనున్నారు. ఆ తర్వాత అమిత్ షా నివాసంలోనూ కసరత్తు చేయనున్నారు. నిన్న మంత్రి పదవులపై మోదీ, బీజేపీ, RSS నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

News June 7, 2024

రాష్ట్రంలో ఘర్షణలపై స్పందించిన చంద్రబాబు

image

AP: YCP కవ్వింపు చర్యలపై TDP క్యాడర్ సంయమనం పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని TDP ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. పోలీసులు సైతం శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

News June 7, 2024

మన్మోహన్ హయాంలోనే అత్యధిక స్టాక్ మార్కెట్ లాభాలు: బ్లూమ్‌బర్గ్

image

దేశంలో సెన్సెక్స్ పురోగతిపై బ్లూమ్‌బర్గ్ ఆసక్తికర నివేదికను వెల్లడించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం(2004-14)లోనే స్టాక్ మార్కెట్ అత్యధికంగా 397.79% లాభాలను ఇచ్చినట్లు పేర్కొంది. మోదీ పాలన(2014-24)లో ఇన్వెస్టర్లకు 202.16% రిటర్నులు వచ్చినట్లు తెలిపింది. PV నరసింహారావు హయాం(1991-96)లో 180.76%, వీపీ సింగ్ పాలన(1989-90)లో 91.94% లాభాలు వచ్చాయని చెప్పింది.

News June 7, 2024

గవర్నర్‌తో నూతన సీఎస్ నీరభ్ భేటీ

image

AP: విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో నూతన సీఎస్ నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎస్‌కు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు సీఎస్‌గా విధులు నిర్వహించిన జవహర్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

News June 7, 2024

రాజ్యాంగం వల్లే దేశానికి సేవ చేయగలుగుతున్నా: మోదీ

image

భారత రాజ్యాంగం కోట్లాది మందికి నమ్మకాన్ని, బలాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘నా జీవితంలోని ప్రతి క్షణాన్ని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగంలోని విలువలను నిలబెట్టడానికి అంకితం చేశాను. రాజ్యాంగం వల్లే పేదరికంలో, వెనుకబడిన కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

News June 7, 2024

వారి తరఫున మీసం తిప్పుతున్నా: నాగబాబు

image

AP: జనసేన నేత నాగబాబు మీసం తిప్పారు. ‘ఈ మీసం తిప్పింది.. జనసేనాని 100% స్ట్రైక్‌రేట్‌తో గెలిచారని కాదు. కూటమి అఖండ విజయం సాధించిందని కూడా కాదు. ఈ ధర్మపోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరఫున నేను గర్వంతో తిప్పుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మీసం తిప్పుతున్న ఫొటోను జతచేశారు.

News June 7, 2024

మోదీతో అకీరా.. రేణూదేశాయ్ ఎమోషనల్ పోస్ట్!

image

ప్రధాని నరేంద్ర మోదీ పక్కన తన కుమారుడు అకీరా నందన్‌ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని నటి రేణూదేశాయ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం. మోదీని కలిసిన వెంటనే అకీరా నాకు ఫోన్ చేశాడు. మోదీ చాలా గొప్పవారని.. ఆయన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉంటుందని చెప్పాడు. అకీరా మాటలు వింటున్నంతసేపు నేను ఆనందంలో మునిగిపోయా’ అని ఆమె పేర్కొన్నారు.