India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఎన్నికల్లో 10 స్థానాలకు పరిమితమైన YCP కాసేపటి క్రితం మరో నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకుంది. దర్శిలో ఫ్యాను గుర్తు అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ 2,597 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. TDP అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనబర్చారు. మధ్యాహ్నం సమయంలో ఓట్ల లెక్కింపుపై ఏజంట్ల మధ్య వాగ్వాదంతో కాసేపు కౌంటింగ్ ఆగింది. ఉన్నతాధికారుల సమక్షంలో తిరిగి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఫుల్ పిక్చర్ వచ్చేసింది. NDA కూటమిలోని టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి 135, జనసేన 21కి 21, బీజేపీ 10కి 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఏపీలో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి భారీ విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఓ సవాల్ విసిరారు. ‘కేంద్రంలోని ఎన్డీఏకి మద్దతివ్వాలంటే ముందస్తు షరతుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసే ధైర్యం మీకుందా?’ అని ఆయన ట్వీట్ చేశారు. NDA అధికారంలోకి వచ్చేందుకు బాబు కీ రోల్ పోషిస్తారనే వార్తలొస్తుండటంతో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.
కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కరీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ థాక్రేపై 1.37 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ స్థానంలో ఆయనకు ఇది వరుసగా మూడో విజయం. మరోవైపు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి గజేంద్ర షెకావత్ గెలిచారు. అటు రాజ్‌కోట్‌లో బీజేపీ అభ్యర్థి పర్షోత్తమ్ ఖోడాభాయ్ 4.84 లక్షల ఓట్ల మెజారిటీతో విక్టరీ సాధించారు.
TGలో 8 ఎంపీ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో విజయం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనను ఆశీర్వదించి తమ ఆత్మస్థైర్యాన్ని పెంచారని తెలిపారు. మరింత సమర్థవంతమైన పాలన అందించడానికి ఉత్సాహాన్నిచ్చారని పేర్కొన్నారు. ప్రజల మద్దతు తమకే ఉందని ఈ ఫలితాలతో రుజువైందన్నారు. రేపటితో కోడ్ ముగుస్తుందని, మళ్లీ ప్రజాప్రభుత్వం మొదలవుతుందని రేవంత్ స్పష్టం చేశారు.
‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సంచలన విజయం సాధించారు. ఖడూర్ సాహిబ్ నుంచి జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన పాల్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. మాజీ PM ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ సింగ్ ఖస్లా(స్వతంత్ర) ఫరీద్‌కోట్‌లో 75 ఓట్ల తేడాతో గెలుపొందారు.
వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన మంత్రి బొత్స సత్యనారాయణకు ఓటమి తప్పలేదు. ఆయన భార్య, సోదరుడు సైతం పరాజయం పాలయ్యారు. చీపురుపల్లిలో కళా వెంకట్రావు చేతిలో 11,971 ఓట్ల తేడాతో బొత్స ఓడిపోయారు. గజపతినగరంలో పోటీ చేసిన ఆయన సోదరుడు అప్పలనర్సయ్య 25,301 ఓటమి చెందారు. విశాఖ MPగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ.. టీడీపీ అభ్యర్థి భరత్ చేతిలో 4,96,063 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయి ఇంటిదారి పట్టారు.
ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. ఈ సినిమా నుంచి రేపు ఉదయం 10 గంటలకు అప్డేట్ రానున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. దీంతో ట్రైలర్ గురించే కావొచ్చని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
AP: అల్లూరి జిల్లా రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా నిలిచింది. వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన శిరీష 15 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు. గతంలో అంగన్‌వాడీ టీచర్‌గా ఆమె.. ఇప్పుడు MLAగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
AP: మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ ఘన విజయం సాధించారు. దీంతో దాదాపు 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది. చివరగా 1985లో టీడీపీ తరఫున ఇక్కడి నుంచి కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ ఇక్కడ ఓటమిపాలైంది. చివరకు 2024 ఎన్నికల్లో లోకేశ్ గెలుపొంది రికార్డు సృష్టించారు.
Sorry, no posts matched your criteria.