News December 14, 2024

KTRను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: పాడి కౌశిక్ రెడ్డి

image

TG: హీరో అల్లు అర్జున్‌ను నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నిన్ననే బెయిల్ పేపర్లు అందినా జైలు అధికారులు ఆయనను ఇవాళ రిలీజ్ చేయడం ఏంటని నిలదీశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని అంటున్నారని, ఆయనను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.

News December 14, 2024

ICUలో అద్వానీ: లేటెస్ట్ హెల్త్ అప్డేట్

image

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని LK అద్వానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఢిల్లీ అపోలో ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. నిజానికి రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రికి వచ్చారని తెలిసింది. శనివారం మాత్రం ICUలో అడ్మిట్ చేశారు. సీనియర్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరీ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 97ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

News December 14, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.980 తగ్గి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.900 తగ్గి రూ.71,400గా ఉంది. మరోవైపు సిల్వర్ ధర కూడా కేజీపై రూ.వెయ్యి తగ్గింది. దీంతో ప్రస్తుతం లక్ష రూపాయలుగా ఉంది.

News December 14, 2024

నమ్మకంతో పరీక్ష రాయండి.. గ్రూప్-2 అభ్యర్థులకు వెంకటేశం సూచన

image

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకం ఉంచి గ్రూప్-2 అభ్యర్థులు పరీక్షలు రాయాలని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం సూచించారు. రేపు, ఎల్లుండి జరిగే ఎగ్జామ్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుందని, అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత వేగంగా ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

News December 14, 2024

మంచు విష్ణు సంచలన ప్రకటన ఇదేనా?

image

నటుడు మంచు విష్ణు ఈరోజు 12 గంటలకు <<14871804>>సంచలన ప్రకటన<<>> చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన ‘హర హర మహాదేవ్’ అంటూ ఓ వార్త లింక్‌ను షేర్ చేశారు. హాలీవుడ్ దిగ్గజం విల్ స్మిత్‌తో విష్ణు నేతృత్వంలోని తరంగ వెంచర్స్ టైఅప్ అవనుందని వార్త సారాంశం. త్వరలోనే దీనిపై గుడ్ న్యూస్ రావొచ్చని చెప్పుకొచ్చారు. దీనిద్వారా OTT ప్లాట్‌ఫారమ్స్, యానిమేషన్, గేమింగ్స్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.

News December 14, 2024

నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు: మోహన్ బాబు

image

తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. ‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించలేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను చూపెట్టాలని మీడియాను కోరుతున్నా’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.

News December 14, 2024

గురువు ఆజ్ఞతోనే శిష్యుడి అమలు: బన్నీ అరెస్టుపై అంబటి

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘గురువు ఆజ్ఞ, శిష్యుడు అమలు, అల్లు అర్జున్ అరెస్టు. ఇది నా మాట కాదు.. ఇది జనం మాట!’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీజీ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ట్యాగ్ చేశారు.

News December 14, 2024

అత్యధిక భారతీయులున్న దేశాల్లో US టాప్!

image

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఇండియా నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. దీంతో విదేశాల్లో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. USలో 54,09,062 మంది భారతీయులు ఉన్నారు. UAEలో 35,68,848, మలేషియాలో 29,14,127, కెనడాలో 28,75,954, సౌదీ అరేబియాలో 24,63,509, మయన్మార్‌లో 20,02,660, UKలో 18,64,318, దక్షిణాఫ్రికాలో 17,00,000 మంది ఉన్నారు.

News December 14, 2024

జమిలి ఎన్నికలు 2029లోనే: చంద్రబాబు

image

AP: జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు 2029లోనే జరుగుతాయని CM చంద్రబాబు అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు తమ పూర్తి మద్ధతు ఉంటుందని చెప్పారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం నడుస్తోంది. విజన్-2020లాగే విజన్-2047 కూడా సక్సెస్ అవుతుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం చేపడుతున్నాం. అవగాహన లేకే YCP జమిలి ఎన్నికలపై ఏది పడితే అది మాట్లాడుతోంది’ అని ఆయన మండిపడ్డారు.

News December 14, 2024

క్రికెట్‌కు ఇద్దరు పాక్ ఆటగాళ్ల వీడ్కోలు

image

క్రికెట్‌కు ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు. పేసర్ మహ్మద్ అమీర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కాగా అమీర్ గతంలో ఓసారి రిటైర్మెంట్ పలికారు. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వీడ్కోలు పలికారు. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తమ చివరి మ్యాచ్ ఆడేశారు.