News June 4, 2024

కంగ్రాట్స్ చంద్రబాబు, లోకేశ్, పవన్: RGV

image

ఎన్నికల ఫలితాలను చూసి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్లేటు మార్చారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేనాని పవన్ కళ్యాణ్‌లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అప్పటివరకూ విమర్శలు చేసిన ఆర్జీవీ ఇలా మారిపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

News June 4, 2024

సర్వేపల్లిలో టీడీపీ జెండా పాతిన సోమిరెడ్డి

image

AP: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్ రెడ్డిపై 16 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కాగా సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. 2012లో కోవూరు ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు. రెండు దశాబ్దాల తర్వాత ఆయన గెలుపు రుచి చూశారు.

News June 4, 2024

మరికాసేపట్లో జగన్ ప్రెస్‌మీట్

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మరికాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

News June 4, 2024

యూసుఫ్ పఠాన్ విజయం

image

పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరీపై 69వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధిర్ రంజన్ ఇక్కడ ఇప్పటివరకు 5 సార్లు వరుసగా గెలుపొందగా, ఈసారి మాత్రం ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. అటు కర్ణాటకలోని ధార్వాడ్‌లో కేంద్ర మంత్రి, BJP అభ్యర్థి ప్రహ్లాద్ జోషి 97,324 ఓట్ల తేడాతో INC అభ్యర్థి వినోద్ అసూతిపై గెలిచారు.

News June 4, 2024

ఒడిశాలో బీజేపీకి జై!

image

ఒడిశాలో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నవీన్ పట్నాయక్ పాలనతో విసిగిపోయారో లేదా కొత్త ప్రభుత్వం కోరుకున్నారో, కాషాయ పార్టీకే ఓటర్లు మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ 79 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. మరోవైపు పట్నాయక్ పార్టీ BJD 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్పష్టమైన లీడింగ్‌ ఉండటంతో BJP గెలుపు ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

News June 4, 2024

పనిచేయని కేసీఆర్ వ్యూహం

image

TG: పార్లమెంట్ ఎన్నికల్లో BRS బోర్లా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేడర్‌లో ఉత్సాహం నింపుదామనుకున్న KCR వ్యూహం పనిచేయలేదు. స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా ఓట్లు రాలలేదు. దీనికితోడు మేడిగడ్డ కుంగడం, లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్ వంటివి BRSకు మైనస్‌గా మారాయి. లోక్‌సభ ఎన్నికలు కావడంతో జాతీయ పార్టీలవైపే ప్రజలు మొగ్గుచూపడంతో BRS పూర్తిగా వెనకబడింది.

News June 4, 2024

YCPని వదిలేసిన ఎమ్మెల్యేలందరూ గెలిచారు!

image

AP: ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలందరూ తిరిగి మళ్లీ గెలిచారు. గుమ్మనూరి జయరామ్ (గుంతకల్లు), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), వసంత కృష్ణప్రసాద్ (మైలవరం), కొలుసు పార్థసారథి (నూజివీడు) టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

News June 4, 2024

మమత జోరు.. మోదీ బేజారు

image

పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలు తారుమారవుతున్నాయి. మోదీ ప్రభంజనంలో బీజేపీ ఈసారి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు పేర్కొన్నా ఓటర్లు టీఎంసీకే పట్టం కట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 42 స్థానాల్లో TMC 29, బీజేపీ 12, కాంగ్రెస్ ఒక స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. దీంతో మమతా జోరు ముందు మోదీ మంత్ర ప్రజల్లోకి వెళ్లలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

News June 4, 2024

ALERT: కాసేపట్లో భారీ వర్షం

image

TG: హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకున్నాయి. వచ్చే గంట, రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఐఎస్ సదన్, దిల్‌సుఖ్‌నగర్, తదితర ప్రాంతాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు.

News June 4, 2024

BREAKING: ప్రధాని మోదీ ఘన విజయం

image

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఘన విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ఆయన సమీప అభ్యర్థి అజయ్ రాయ్(కాంగ్రెస్)పై 1.50 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోదీకి 6,12,970 ఓట్లు పడ్డాయి. ఆయన వారణాసిలో గెలవడం ఇది వరుసగా మూడోసారి.