News June 4, 2024

మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యం.. నవనీత్ రానా వెనుకంజ

image

మహారాష్ట్రలో ఇండియా కూటమి అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చింది. 26 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఎన్డీయే 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. సుప్రియా సూలే(NCP SP), నితిన్ గడ్కరీ (బీజేపీ) ఆధిక్యంలో ఉండగా, నవనీత్ రానా (బీజేపీ) వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

బర్రెలక్క కంటే నోటాకే ఎక్కువ ఓట్లు!

image

నాగర్‌కర్నూల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు ఉ.11గంటల వరకు 1032 ఓట్లు వచ్చాయి. అదే సమయానికి నోటాకు 1500 ఓట్లు పడ్డాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి.

News June 4, 2024

అఖిలేశ్ యాదవ్ ముందంజ

image

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ స్థానం నుంచి బరిలో ఉన్న ఆయన బీజేపీ అభ్యర్థి సుబ్రత్‌పై 40వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా భావించే ఈ రాష్ట్రంలో బీజేపీ, INDIA కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాగా UPలో SP 62, కాంగ్రెస్ 17 స్థానాల్లో బరిలో దిగింది.

News June 4, 2024

ఖమ్మం, నల్గొండలో గెలుపు దిశగా కాంగ్రెస్

image

ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ జోరు సాగుతోంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి లక్షా 86ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 6వ రౌండ్ ముగిసే సమయానికి లక్షా 70వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.

News June 4, 2024

ప్రకాశం జిల్లాలో ఆధిక్యంలో ఉన్నది వీరే

image

AP: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దర్శి, గిద్దలూరులో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. మిగతా 10 స్థానాల్లో టీడీపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. యర్రగొండపాలెం, మార్కాపురం, ఒంగోలు, కందుకూరు, అద్దంకి, కొండపి, సంతనూతలపాడు, చీరాల, కనిగిరి, పర్చూరులో టీడీపీ ఆధిక్యంలో ఉంది.

News June 4, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ ఆధిక్యాలు..

image

➢మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి: 30876 ఓట్ల ఆధిక్యం
➢బాపట్లలో వేగేశన నరేంద్రవర్మ: 30978 ఓట్ల ఆధిక్యం
➢సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ: 24713 ఓట్ల ఆధిక్యం
➢పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర: 24819 ఓట్ల ఆధిక్యం ➢వేమూరు(ఎస్సీ)లో నక్కా ఆనందబాబు: 10810 ఓట్ల ఆధిక్యం ➢గుంటూరు వెస్ట్‌లో మహమ్మద్ నసీర్ అహ్మద్: 15582 ఓట్ల ఆధిక్యం ➢చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు: 11797 ఓట్ల ఆధిక్యం

News June 4, 2024

తిరగబడ్డ ‘రాయలసీమ’ ఫలితం

image

AP: గత అసెంబ్లీ ఎన్నికల్లో <<13372262>>రాయలసీమ<<>> జిల్లాల నుంచి 52 సీట్లకుగాను వైసీపీకి ఏకంగా 49 సీట్లు రాగా, ఈసారి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఆఖరికి సీఎం జగన్ సొంత జిల్లాలోనూ ఆరు చోట్ల వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. 4 జిల్లాల్లో 40+ స్థానాల్లో కూటమి నేతలు లీడింగులో కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే సరికి దాదాపుగా ఇవే రిజల్ట్స్ ఉంటాయని అంచనా.

News June 4, 2024

తమిళనాడులో బీజేపీకి షాక్

image

సౌతిండియాలో పాగా వేద్దామనుకుంటున్న బీజేపీకి తమిళ ఓటర్లు షాక్ ఇస్తున్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 39 స్థానాలుండగా BJP 19 చోట్ల పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలోనూ లీడింగ్‌లో కొనసాగడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం BJP మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం.

News June 4, 2024

NDAలో రెండో అతిపెద్ద పార్టీగా TDP!

image

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అలాగే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పేలా కనిపిస్తున్నారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ (272) సాధించకపోతే బాబు కీలకంగా మారుతారు. ఎందుకంటే 16 సీట్లతో ఇప్పుడు ఎన్డీయేలో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించేలా ఉంది. ఢిల్లీలో మోదీ అధికారంలో ఉంటే ఏపీకి ప్రాధాన్యం ఇవ్వకతప్పదు.

News June 4, 2024

మెదక్‌లో BRS, BJP మధ్య దోబూచులాట

image

మెదక్‌లో BRS, BJP మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. పదో రౌండ్‌లో ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 679 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అంతకు కొద్దిసేపటి క్రితం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యం సాధించి, మళ్లీ వెనుకంజలోకి వెళ్లారు.