India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: గోదావరి జలాలను ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీసుకెళ్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గోదావరి-పెన్నా-బనకచర్ల ప్రాజెక్టు చేపట్టాలని సీఎం ఆదేశించారని, సీమ అవసరాల కోసం హంద్రీనీవా కాలువ కెపాసిటీని పెంచుతామని తెలిపారు. DEC రెండో వారంలో సీఎం పోలవరాన్ని సందర్శిస్తారని చెప్పారు. జనవరిలో డయాఫ్రం వాల్ పనులు చేపడతామని, త్వరలో R&R కాలనీల నిర్మాణం, భూసేకరణ తిరిగి ప్రారంభిస్తామని వివరించారు.

దేశంలో సైనిక అత్యవసర పరిస్థితి (సైనిక పాలన) విధిస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ ప్రకటించారు. ఉత్తర కొరియా దాడుల భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా దేశంలోని ప్రతిపక్షాలు ఉత్తర కొరియాకు అనుకూలంగా ఉన్నాయని యోల్ ఆరోపిస్తున్నారు. దేశ అంతర్గత, బహిరంగ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మరో మార్గం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే చీఫ్ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

విడుదలకు ముందే ‘పుష్ప-2’ సంచలనాలు నమోదు చేస్తోంది. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. కల్కి, బాహుబలి-2, కేజీఎఫ్-2 రికార్డులను చెరిపేసిందని పేర్కొన్నాయి. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ అయిందని, భారత సినీ చరిత్రలో ఇదే రికార్డు అని ‘పుష్ప’ టీం ట్వీట్ చేసింది.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండేను బీజేపీ ముఖ్యనేత దేవేంద్ర ఫడణవీస్ కలిశారు. సీఎం అధికార నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. మరోవైపు సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు.

వైసీపీ హయాంలో ఆస్తులను లాక్కోవడం ట్రెండ్‌గా మారితే, వాటిని చూసి మౌనంగా ఉండటం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఆస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గంగవరం పోర్టును గత ప్రభుత్వం అదానీకి రాసిచ్చిందని, తిరిగి వాటాను వెనక్కు తీసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ECIలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్ల నియామక ప్రక్రియలో జ్యుడిషియరీని తప్పించే చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి CJI తప్పుకున్నారు. గతంలో ఈ కేసులను తాను విచారించినా, ప్రస్తుత పరిస్థితులు వేరవ్వడంతో మరో బెంచ్ విచారిస్తుందని CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. నియామక ప్రక్రియలో CJIని తప్పించి కేంద్ర మంత్రికి స్థానం కల్పిస్తూ కేంద్రం 2023లో చట్టం చేయడం వివాదమైంది.

సినిమాలు విడుదలైన తొలి మూడు రోజుల వరకు సోషల్ మీడియాలో రివ్యూలపై నిషేధం విధించాలన్న తమిళ నిర్మాతల సంఘం పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఒకరి అభిప్రాయాన్ని నియంత్రించడం వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడమేనని జడ్జి స్పష్టం చేశారు. అయితే యూట్యూబ్‌లో సినిమాలపై విమర్శలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.

TG: ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల <<14772568>>మరణాలపై<<>> మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. పది రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం దారుణమని, ఆ కాలేజీలపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ర్యాంకుల పేరిట మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ ఉంటే 8688007954కు కాల్ లేదా minister.randbc@gmail.comకు మెయిల్ చేయాలన్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు గత మూడు సెషన్లలో వరుసగా లాభాలను అర్జించాయి. ఎఫ్ఐఐలు తమ డిజిన్వెస్ట్‌మెంట్‌కు బ్రేక్ ఇవ్వడంతో సూచీలు మంగళవారం దూసుకుపోయాయి. ఎఫ్ఐఐలు రూ.3,664 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సెంటిమెంట్‌ను బలపరిచినట్టైంది. అదే సమయంలో డీఐఐలు రూ.250 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అధిక వెయిటేజీ రంగాలకు లభించిన కొనుగోళ్ల మద్దతు లాభాలకు కారణంగా తెలుస్తోంది.

AP: రేపు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Sorry, no posts matched your criteria.