India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని CM చంద్రబాబును Dy.CM పవన్ కోరారు. గత మూడేళ్లలో ₹48,537CR విలువైన బియ్యం కాకినాడ పోర్టు నుంచి తరలించారని, దీనిపై వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. YCP ప్రభుత్వ హయాంలో పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, ఇటీవల అక్కడికి వెళ్లిన తనకూ ఇబ్బంది ఎదురైందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

HYDలోని అమీన్‌పూర్ చెరువును పునరుద్ధరించడంతో అరుదైన పక్షి తిరిగి కనిపించిందన్న కథనంపై CM రేవంత్ స్పందించారు. మనం ప్రకృతిని రక్షిస్తే అది తిరిగి మనల్ని రక్షిస్తుందని నమ్ముతానని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా జరుగుతున్న నీటి వనరులు, పర్యావరణ సంపద విధ్వంసాన్ని తాము ఆపినట్లు చెప్పారు. దీంతో ప్రకృతి వెంటనే బహుమతిని ఇచ్చిందన్నారు. ఇది దేవుడి ఆమోదమేనని పేర్కొన్నారు. ఈ పక్షి శీతాకాలంలో ఆసియాకు వలస వస్తుంది.

TG: ములుగు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకే పోస్టుమార్టం నిర్వహిస్తామని DGP జితేందర్ తెలిపారు. తాము ఎవరిపైనా విష పదార్థాలు వినియోగించలేదని తెలిపారు. పౌర హక్కుల నేతల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేశామని, వారు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడంతో ప్రాణరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం బుధవారం జరగనుంది. MLAలు ముంబైలో ఉండాలని పార్టీ ఆదేశించింది. CMగా దేవేంద్ర ఫడణవీస్ పేరును అధిష్ఠానం దాదాపుగా ఖరారు చేసింది. LP మీటింగ్‌లో అధికారికంగా ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలను బీజేపీ అధిష్ఠానం కేంద్ర పరిశీలకులుగా నియమించింది.

AP: సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో
మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పీహెచ్‌సీలు/ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో డిసెంబర్ 4 నుంచి DEC 13 వరకు అప్లై చేసుకోవచ్చు. సైట్: http:apmsrb.ap.gov.in/msrb/

విభజన అంశాలపై AP, TG సీఎస్‌ల కమిటీ భేటీ ముగిసింది. 3 అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. డ్రగ్స్ నివారణకు పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల మధ్య రూ.861 కోట్ల మేర లేబర్ సెస్ పంపిణీకి అంగీకరించారు. విద్యుత్ బకాయిలతో పాటు 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పులపై పంచాయితీ తేలలేదు. దీంతో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది.

ప్రతి నలుగురిలో ఒకరు పెళ్లి చేసుకోరని, జీవితాంతం ఒంటరిగా ఉంటారని PEW రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. చాలా మంది తమ శృంగార సంబంధాలకు బదులుగా జీవితంలోని ఇతర అంశాలకు ప్రాధాన్యతనిస్తారనే విషయం తేలింది. జీవితంలో సక్సెస్ అయ్యేందుకు పెళ్లి అవసరం లేదనే భావనలో వీరున్నట్లు అధ్యయనం చెప్పింది. అయితే సింగిల్‌గా ఉన్నవారే అధిక స్థాయిలో వ్యక్తిగత వృద్ధిని సాధిస్తున్నట్లు పేర్కొంది.

పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చకు <<14770377>>తేదీలు ఖరారవ్వడం<<>> దేశ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి రాజ్యాంగం చుట్టూనే NDA, INDIA రాజకీయాలు నడిపాయి. రాజ్యాంగాన్ని మార్చేస్తారని, పేదల హక్కులు లాక్కుంటారంటూ ఒక దానిపై ఒకటి దుమ్మెత్తిపోసుకున్నాయి. దీంతో పార్లమెంటులో రాజ్యాంగంపై జరగనున్న ప్రత్యేక చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

U-19 ఆసియా కప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. జపాన్‌తో జరిగిన మ్యాచులో 211 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అమన్(122*) సెంచరీతో చెలరేగారు. ఛేదనలో జపాన్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. కాగా తొలి మ్యాచులో భారత జట్టు పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

చలికాలంలో మంట వేసుకుని వెచ్చదనం పొందడం చాలామందికి అలవాటు. కానీ కొందరు రాత్రుళ్లు ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకుని వెచ్చదనం పొందే ప్రయత్నం చేయడం ప్రాణాంతకంగా మారుతుంది. బొగ్గుల కుంపటి నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ వల్ల గదిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి శ్వాస తీసుకోలేరు. గతంలో ఇలా కుంపటితో పలువురు ప్రాణాలు కోల్పోగా అరకులోయలో నిన్న ఇద్దరు ఊపిరి వదిలారు.
Share It
Sorry, no posts matched your criteria.