India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తమ పాలనలో తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సర్వజ్ఞానులం అనే భ్రమలు మాకు లేవు. అందరి సలహాలు స్వీకరించి, చర్చించి ముందుకెళ్తాం. ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాలు, లోటుపాట్ల సమీక్షకు అవకాశమిస్తున్నాం. పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది. ప్రజల సంపద గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్లింది’ అని రేవంత్ వివరించారు.
TG: ఆరు గ్యారంటీల కోసం 1.28 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డూప్లికేట్ అప్లికేషన్లు మినహాయించగా 1.9 కోట్ల దరఖాస్తులు మిగిలినట్లు చెప్పారు. వాటిని కంప్యూటరీకరించి, ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నట్లు చెప్పారు. 70 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.
TG: తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన సోనియా గాంధీ, మన్మోహన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణతో సోనియాది పేగు బంధం అని తెలిపారు. ‘దశాబ్ది ఉత్సవాలకు సోనియాను ఎందుకు ఆహ్వానించారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ తల్లిని పిలవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది. ప్రపంచ పటంలోనే హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలపబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో చాలా మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా), తేజ (నెదర్లాండ్స్), కశ్యప్ ప్రజాపతి (ఒమన్), అల్ఫేశ్ రంజనీ, రోనక్ పటేల్ (ఉగాండా), రవీందర్, నిఖిల్, పర్గత్, శ్రేయస్ మొవ్వ (కెనడా), మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్, సౌరభ్ నేత్రావాల్కర్ (USA) ఉన్నారు.
తమ విచారణకు హాసన్ MP ప్రజ్వల్ రేవణ్ణ సహకరించడం లేదని సిట్ అధికారులు తెలిపారు. తామడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. ఆయన న్యాయవాది ద్వారా బదులిస్తానని చెప్పినట్లు తెలిపారు. కాగా ‘నేనేం తప్పు చేయలేదు. ఇది రాజకీయ కుట్ర. ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదు. నేనెవరిపైనా అత్యాచారం చేయలేదు. నా ఫోన్ ఏడాది కిందటే పోయింది’ అని ప్రజ్వల్ జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.
TG: 2017 PRC ప్రకారం 21 శాతం ఫిట్‌మెంట్‌తో RTC ఉద్యోగులకు పెరిగిన జీతాలు నిన్న ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వేతన సవరణతో ఒక్కో ఉద్యోగికి రూ.8వేల నుంచి రూ.11 వేల వరకు వేతనం పెరుగుతుందని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 50వేలకు పైగా సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
TG: రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘జాతీయ ప్రగతికి రాష్ట్రం చేసిన సహకారం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారు. ఈ రాష్ట్రానికి గొప్ప చరిత్ర, శక్తిమంతమైన సంస్కృతి ఆశీర్వాదం ఉన్నాయి. రాబోయే కాలంలో రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ MLC ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా అందులో 27 చెల్లనివిగా అధికారులు గుర్తించారు. మరోవైపు కౌంటింగ్ జరుగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి కేంద్రం నుంచి వెళ్లిపోవడం చర్చకు దారితీసింది.
టీ20 WCలో ఆతిథ్య అమెరికా ఖాతా తెరిచింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 రన్స్ టార్గెట్‌ను ఆ జట్టు 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరోన్ జోన్స్ 94*, గౌస్ 65 రన్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. USA జూన్ 6న పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
TG: సకల జనుల విజయంతోనే తెలంగాణ ఆవిర్భావం సాధ్యమైందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడే దశాబ్దకాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని Xలో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ పోరాటాలకు పురిటిగడ్డ. ఇక్కడ గాలిలో, నేలలో, నీటిలో, మాటలో, పాటలో సైతం పోరాట పటిమ కనిపిస్తుంది. అభివృద్ధి ఫలాలన్నీ ప్రజలందరికీ అందాలి. అప్పుడే అమరులకు నిజమైన నివాళి. జనసేన తరఫున ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.