India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రధాని మోదీ ఇవాళ ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను వీక్షించనున్నారు. పార్లమెంట్ హాల్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు. గోద్రా అల్లర్ల ఘటన కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు.

ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో గతేడాది నుంచి జరిగిన హెచ్చుతగ్గులను TNIE నివేదించింది. హౌసింగ్ ధరలు చదరపు గజానికి సగటున రూ.11వేలు ఉన్నట్లు తేలింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, పుణే, ముంబైలలో 2023 Q3 నుంచి 2024 Q4 వరకు ఇళ్ల ధరలను పరిశీలించారు. HYDలో స్క్వేర్ ఫీట్‌కు రూ.11,040 నుంచి ఇప్పుడు రూ.11,351కి పెరిగింది. ఇక్కడ 3శాతం వృద్ధిరేటు కనిపించింది.

ఈకామర్స్ సైట్లలో ఇవాళ సైబర్ మండే సేల్ నడుస్తోంది. అమెరికాలో నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్ డే’ ఉంటుంది. ఆరోజు వ్యాపారులు భారీ ఆఫర్లు ఇస్తుంటారు. దీనికి పోటీగా ఆన్‌లైన్ షాపింగ్ పెంచేందుకు ఈ-రిటైలర్లు 2005లో ‘సైబర్ మండే’ ఆఫర్ సేల్ ప్రకటించారు. థ్యాంక్స్ గివింగ్ డే తర్వాతి సోమవారం ఇది ఉంటుంది (ఈసారి DEC 2). USA నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ స్ట్రాటజీ ఇప్పుడు భారత్‌నూ తాకింది.

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్, ఛైర్మన్ సముదాయించినా విపక్ష ఎంపీలు వినలేదు. అదానీ అంశంపై చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను స్పీకర్, ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.

టాలీవుడ్ ‘మహానటి’ కీర్తి సురేశ్ & ఆంటోనీల వివాహం గోవాలో ఈనెల 12న జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు వివాహం జరగనుండగా, 10న ప్రీవెడ్డింగ్, 11న సంగీత్ నిర్వహించనున్నారు. 12న ఉదయం కీర్తి మెడలో ఆంటోనీ తాళి కట్టనుండగా అదేరోజు సాయంత్రం స్థానిక చర్చిలో మరోసారి వెడ్డింగ్ జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు.

AP: ‘ఫెంగల్’ తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణముఖి నది సహా నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకల పరిసరాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తిరుపతి, తిరుమలలో కొండచరియలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రతపై దృష్టి పెట్టాలని చెప్పారు.

లండన్‌లో నివసించే భారతీయ మూలాలున్న 10ఏళ్ల క్రిష్ అరోరా IQలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్‌ను దాటేశాడు. పియానో వాయించడంలో గ్రేడ్ 7 సర్టిఫికెట్ సాధించిన అతను, చెస్ కూడా బాగా ఆడగలడు. మానవ మేధస్సును కొలిచే ఐక్యూ(intelligence quotient)లో 162 సాధించి ఔరా అనిపించాడు. దీంతో ప్రపంచంలోని అత్యంత మేధావులైన 1శాతం మందిలో క్రిష్ నిలిచాడు. అటు, ఐన్‌స్టీన్ IQ 160గా చెబుతుంటారు.

TG: ఏటూరు నాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇవాళ లేదా మంగళవారం BJP శాసనసభాపక్ష నేతగా ఆయన్ను ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. గత అనుభవం, పార్టీ గెలుపులో కీలకం, RSS మద్దతు వంటివి మాజీ సీఎంకు కలిసొచ్చే అంశాలు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అమిత్ షా నేడు ఖరారు చేస్తారని తెలిసిందే.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు <<14765922>>నోటీసులు<<>> జారీ చేసింది. పోలింగ్ బూత్‌లో గరిష్ఠ ఓటర్ల సంఖ్యను 1500కు పెంచడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈసీఐకి ఆదేశాలిచ్చింది.
Sorry, no posts matched your criteria.