India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిమచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ స్థానంలో విమలా శర్మ ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటేశారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె కుటుంబీకుల సాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ స్థితిలో ఉన్నా కర్తవ్యాన్ని మరువని విమలను EC ప్రశంసించింది. గంట నిలబడాలని, మరో పని ఉందనే సాకులతో ఓటేయని వారున్న రోజుల్లో ఈమె అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ MP స్థానంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీలో ఉన్నారు.
FY24లో ఇన్ఫోసిస్, TCS, విప్రో, LTI, HCL నుంచి 25,000 మంది మహిళా ఉద్యోగులు బయటికొచ్చినట్లు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. ఆ IT కంపెనీల్లో ఉమెన్ ఎంప్లాయీస్ సంఖ్య 5.40 లక్షల నుంచి 5.15 లక్షలకు చేరినట్లు పేర్కొంది. ఉద్యోగాల్లో ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలతోనే జాబ్స్ వదులుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జెండర్ గ్యాప్‌ను భర్తీ చేసి, ఫ్లెక్సిబుల్ పనివేళలు కల్పించి మహిళలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
AP: కౌంటింగ్ రోజున ఓటమి భయంతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలు, కార్యకర్తలు ఓట్ల లెక్కింపునకు ముందు, ఫలితాలు వెలువడిన తర్వాత సంయమనంతో వ్యవహరించాలని ట్వీట్ చేశారు. కాగా, ఈవీఎం ధ్వంసంతో పాటు సీఐ, టీడీపీ ఏజెంట్‌పై దాడి, మహిళపై దుర్భాషలాడిన కేసుల్లో పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మరోవైపు వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బేబీ బంప్‌తో కనిపించారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఆమె డిన్నర్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రణ్‌వీర్ తన ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ వదంతులు వచ్చాయి. కానీ తాము కలిసే ఉన్నామంటూ రణ్‌వీర్ క్లారిటీ ఇచ్చారు.
AP: ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజున జిల్లా కేంద్రాలకు అభ్యర్థుల అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు, పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున చేరుకోనున్నారు. ఇప్పటికే హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు బుక్ చేసుకున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతో నిర్వాహకులు ధరలను రెట్టింపు చేశారు. దీంతో ఎక్కడ చూసినా 4వ తేదీన రూమ్స్ ఖాళీ లేవనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.
టీ20 WCకి సీనియర్లను ఎంపిక చేయడం భారత్‌కు గతంలో కలిసిరాలేదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ‘నేను సెలక్టర్ అయితే యువ ప్లేయర్లను మాత్రమే ఎంపిక చేసేవాడిని. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో రోహిత్-కోహ్లీ ఓపెనింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జైస్వాల్‌కు ప్లేయింగ్ 11లో చోటు కష్టం. ఇద్దరు రైట్ హ్యాండర్లతో ఓపెనింగ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు’ అని స్టార్‌స్పోర్ట్స్ షోలో అభిప్రాయపడ్డారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తిచేస్తామని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివర్లో పార్ట్-1 రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాల VFX, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేయనున్నట్లు డైరెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తప్పుకున్న విషయం తెలిసిందే.
టీమ్ ఇండియా తుది జట్టు కూర్పు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. దీంతో వీరిలో ఎవరిని తుది జట్టులో ఆడించాలనేదానిపై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అనుభవం ఆధారంగా పంత్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు టాక్. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో అనుభవానికే పెద్ద పీట వేయాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
TG: సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, BC రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబరులో ఈ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే BC రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు టాక్. ప్రజలకు ఇబ్బందులు లేకుండా 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.