India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశంకు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ జీవో ఇచ్చింది. ఇప్పటికే VRS కోసం దరఖాస్తు చేసుకున్న ఆయన కొత్త హోదాలో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం TGPSC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. గురుకులంలో చదివి IAS స్థాయికి వెళ్లిన ఆయన పలు జిల్లాలకు కలెక్టర్‌గా, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయ బౌలర్లు భారత్‌లో ఇంకా రాలేదని ఛతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘నేను మన దేశవాళీ టోర్నీలో ఎంతోమంది స్పిన్నర్లను చూశాను. కానీ అశ్విన్, జడ్డూని రీప్లేస్ చేయగల స్థాయి ఎవరికీ లేదు. అలాంటి ఆటగాళ్లు మళ్లీ రావాలంటే చాలాకాలం పడుతుంది. నైపుణ్యం కలిగిన యువ బౌలర్లు కొంతమంది ఉన్నారు కానీ వారికింకా చాలా అనుభవం రావాలి’ అని స్పష్టం చేశారు.

నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఛాతిపై ఎవరో కూర్చున్నట్లు, కాళ్లు, చేతులు కదలించలేకపోవడం, నోట మాట రాకపోవడం జరుగుతుంటుంది. ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తుంది. దాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు. 2-3నిమిషాలు మాత్రమే ఉంటుంది. 30% మందికి జీవితంలో ఒక్కసారైనా ఈ స్లీప్ పెరాలసిస్ వస్తుందని, ఇది యువకుల్లో కామన్‌గా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. దాని గురించి ఆందోళన వద్దంటున్నారు. మీకూ ఎప్పుడైనా ఇలా జరిగిందా?

కేరళలోని మంజేరీ పోక్సో కోర్టు ఓ వ్యక్తికి 141ఏళ్ల జైలు శిక్ష విధించింది. 12 ఏళ్ల సవతి కూతురిపై పలుమార్లు అత్యాచారం చేసినందుకు శిక్షతో పాటు రూ.7.85లక్షల ఫైన్ వేసింది. 2021లో మలప్పురం స్టేషన్లో నమోదైన కేసుపై జైలుకెళ్లిన నిందితుడు 2022లో బెయిల్‌పై వచ్చి మరోసారి అత్యాచారం చేశాడు. అత్యధిక జైలు శిక్ష(40ఏళ్లు), వివిధ శిక్షలు ఏకకాలంలో అనుభవించాలనే తీర్పు మేరకు అతను 40 ఏళ్లు కఠిన శిక్ష అనుభవించనున్నాడు.

ఫెంగల్ తుఫాను తమిళనాడును వణికిస్తోంది. కాగా తీరం దాటే ముందు చెన్నైలోని ఎన్నూర్ ఎక్స్‌ప్రెస్ రోడ్డుపైకి సముద్రపు నీరు చేరింది. రోడ్డుపైకి చేరిన సముద్రపు నీటిలోనే ఓ బస్సు దూసుకెళ్తున్నప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అటు తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై నుంచి విమానాల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. అక్కడ స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల దాడి జరిగింది. శివపురి జిల్లాలోని మాధవ్ నేషనల్ పార్కులో ఓ యంత్రాన్ని ప్రారంభించేందుకు ఆయన వెళ్లారు. ఈలోపే ఒక్కసారిగా తేనెటీగలు వచ్చిపడటంతో మంత్రి సెక్యూరిటీ సిబ్బంది కర్చీఫ్‌లు, టవల్స్‌తో ఆయనకు రక్షణ కల్పించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈక్రమంలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు.

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న గగన్‌యాన్ మిషన్ కోసం వ్యోమగాముల తొలి దశ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇస్రో, నాసా సంయుక్తంగా ఈ శిక్షణ ఇచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో మొదలైన ట్రైనింగ్ సెషన్‌లో వ్యోమగాములకు మిషన్‌కి సంబంధించిన ఫెసిలిటీ టూర్స్, లాంచ్ సీక్వెన్సీలను అర్థం చేసుకోవడం, స్పేస్ సూట్ ఫిట్టింగ్, ఫుడ్ ట్రయల్స్‌పై అవగాహన కల్పించారు. కాగా 2026లో గగన్‌యాన్ యాత్ర చేపట్టనున్నారు.

ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మరో ఓటమి చవిచూసింది. జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో 41-28 తేడాతో ఓడింది. హాఫ్ టైమ్‌లో 18-18తో ఇరు జట్లు సమంగా ఉండగా సెకండాఫ్‌లో జైపూర్ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. దీంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై పట్నా పైరేట్స్ 54-29 తేడాతో గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో హరియాణా ఫస్ట్, టైటాన్స్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి.

IPLలో 2008 నుంచి 2025 వరకు అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లు వీరే:
1.రోహిత్ శర్మ- రూ.210.90 కోట్లు
2.విరాట్ కోహ్లీ- రూ.209.20 కోట్లు
3.ఎంఎస్ ధోనీ- రూ.192.84 కోట్లు
4.రవీంద్ర జడేజా- రూ.143.01 కోట్లు
5. సునీల్ నరైన్- రూ.125.25 కోట్లు

AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులంతా రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. తుఫాన్ తీవ్రత, తాజా పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేశారు. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు సెలవులు పెట్టవద్దని మంత్రి ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.