News November 29, 2024

క్రికెటేతర అథ్లెట్లకేదీ గౌరవం.?

image

ఫొటోలోని వ్యక్తి పేరు సర్వాన్ సింగ్. 1954 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చారు. అయినా గుర్తింపు, ఉద్యోగం రాలేదు. బెంగాల్ ఇంజినీరింగ్ గ్రూప్‌ రెజిమెంట్‌లో చేరి 1970లో రిటైర్ అయ్యారు. బతుకుతెరువు కోసం గోల్డ్ మెడల్ అమ్మేసి ట్యాక్సీ కొనుక్కున్నారు. పేదరికంలోనే కన్నుమూశారు. నేటికీ క్రికెటేతర అథ్లెట్లలో చాలామందిది ఇలాంటి కథే. ఇతర క్రీడలకూ దేశంలో ప్రాధాన్యం దక్కాలన్నదానిపై మీ అభిప్రాయం?

News November 29, 2024

అందరి సపోర్ట్ భారత్‌కే.. ఒంటరైన పాక్!

image

ICC ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు భారత్‌కే సపోర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు ఒప్పుకోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒంటరైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో భద్రత దృష్ట్యా అక్కడికి వెళ్లేది లేదని భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టోర్నీ పాకిస్థాన్ నుంచి తరలించి వేరే దేశాల్లో నిర్వహించేందుకు ICC కసరత్తు చేస్తోంది.

News November 29, 2024

YELLOW ALERT: 3 రోజులు జాగ్రత్త!

image

TGలో చలి తీవ్రత పెరుగుతోందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజులు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు YELLOW <>ALERT<<>> జారీ చేసింది. కాగా గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో చలి విపరీతంగా ఉంటోంది. సాయంత్రం 5 గంటలు అయిందంటే చల్లగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటలైనా చలి ప్రభావం తగ్గడంలేదు. పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 29, 2024

శాలిబండ పీఎస్‌‌కు ‘బెస్ట్’ గుర్తింపు

image

హైదరాబాద్‌లోని శాలిబండ పీఎస్‌కు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. దేశంలో 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శాలిబండ పీఎస్ నిలిచిందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సత్వర కేసుల పరిష్కారం, ఇతర అంశాల ఆధారంగా ఈ ప్రకటన చేసింది. దీంతో హైదరాబాద్ సీపీని డీజీపీ జితేందర్ రెడ్డి అభినందించారు.

News November 29, 2024

50 ఏళ్లలో తొలిసారిగా ఆస్తమాకు కొత్త చికిత్స

image

ఆస్తమాకు బ్రిటన్‌ పరిశోధకులు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న బెన్రాలిజమాబ్ అనే ఔషధాన్ని ఇంజెక్షన్‌లా మార్చినట్లు వారు తెలిపారు. ‘ఒక్క డోసుతోనే రోగుల్లో అద్భుతమైన ఫలితాలొచ్చాయి. స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం పోయింది. గడచిన 50 ఏళ్లలో ఆస్తమా చికిత్స మారలేదు. మా తాజా పరిశోధన కొత్త చికిత్సను తీసుకురానుంది. అత్యవసర సమయాల్లో ఆస్తమా రోగుల ప్రాణాల్ని కాపాడుతుంది’ అని పేర్కొన్నారు.

News November 29, 2024

‘ఆర్మీ’ని అవమానించారంటూ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు

image

తన ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్‌ ‘ఆర్మీ’ అనే పదాన్ని వాడటాన్ని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు తప్పుబట్టారు. తనకూ ఓ ఆర్మీ ఉందంటూ దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆయన వ్యవహరించారని HYDలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్‌పై FIR నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

News November 29, 2024

గవర్నర్‌ను కలిసిన CM చంద్రబాబు

image

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను CM చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో దాదాపు గంటపాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి.

News November 29, 2024

హైబ్రిడ్ మోడల్ తప్పదు.. పాక్‌కు తేల్చిచెప్పిన ఐసీసీ?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని పాకిస్థాన్‌కు ICC ఈరోజు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. తొలుత అందుకు ససేమిరా అన్న పీసీబీ, రేపటి వరకు ఆలోచించుకునేందుకు సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే <<14743739>>మీటింగ్‌ రేపటికి వాయిదా పడిందని<<>> ఐసీసీ వర్గాలు తెలిపాయి. వేరే దారి లేని నేపథ్యంలో పీసీబీ ఒప్పుకోక తప్పదని పేర్కొన్నాయి.

News November 29, 2024

ఘోర ప్రమాదం.. 100 మంది గల్లంతు

image

నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. దీంతో సుమారు 100 మంది గల్లంతయ్యారు. ఫుడ్ మార్కెట్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ప్రమాద సమయంలో పడవలో 200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 29, 2024

SMATలో ఝార్ఖండ్ సంచలనం

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(SMAT)లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఝార్ఖండ్ విధ్వంసం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్ 20 ఓవర్లకు 93 పరుగులు చేయగా 4.3 ఓవర్లలోనే ఝార్ఖండ్ 94 రన్స్‌ను ఛేజ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ 23 బంతుల్లోనే 77 పరుగులు చేయడం విశేషం. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టుకు ఆడనున్న సంగతి తెలిసిందే.