India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తనను కలిసేందుకు సమయం కేటాయించినందుకు PM మోదీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘పార్లమెంట్ సెషన్లతో బిజీగా ఉన్నా నాకు సమయం కేటాయించిన ప్రధానికి కృతజ్ఞతలు. గాంధీనగర్‌లో తొలిసారి భేటీ నుంచి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారీ ఆయనపై అభిమానం మరింత పెరుగుతుంటుంది. భారత్ పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత స్ఫూర్తిదాయకం. థాంక్యూ సర్’ అని పేర్కొన్నారు.

గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు ఈగల్‌గా నామకరణం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు.

ఈ ఏడాది తొలి 9నెలల్లో భారత్ రూ.11,333కోట్ల సైబర్ మోసానికి గురైనట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో రూ.4,636 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌తో రూ.3,216 కోట్లు, డిజిటల్ అరెస్ట్ మోసాల వల్ల రూ.1,616కోట్లు నష్టపోయినట్లు వివరించింది. 2021నుంచి మొత్తం 30.05లక్షల సైబర్ క్రైం ఫిర్యాదులు వచ్చాయంది. ఇందులో 45 శాతం మోసాలు కంబోడియా, మయన్మార్, లావోస్ కేంద్రంగా జరుగుతున్నట్లు గుర్తించారు.

మహారాష్ట్ర, హరియాణా ఓటములకు నిందిస్తూ ఇండియా కూటమి EVMలపై వీధి, న్యాయ పోరాటాలకు సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేకసార్లు వాటి విశ్వసనీయతను శంకించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఓడినప్పుడు ఒకలా గెలిచినప్పుడు మరోలా మాట్లాడటం కరెక్టు కాదని చెప్పింది. AP పార్టీల తీరునూ తప్పుబట్టింది. మరి EVMలపై పోరాటం కరెక్టేనంటారా? మీ కామెంట్.

మహారాష్ట్ర CM ఎవరనేదానిపై త్వరలోనే సమాధానం దొరుకుతుందని ఫడణవీస్ తెలిపారు. మహాయుతి కూటమి నేతలు దీనిపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తొలుత CMపై క్లారిటీ వచ్చాకే మిగతా నిర్ణయాలు ఉంటాయన్నారు. EVMలపై ప్రతిపక్షాలు తిరుగుబాటుకు సిద్ధమయ్యాయన్న మీడియా ప్రశ్నపై స్పందిస్తూ సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసిందని, EVMవిధానం కొనసాగుతుందన్నారు. ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు మానుకోవాలని ఢిల్లీలో చెప్పారు.

AP: డిసెంబర్ 3, 4 తేదీల్లో వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ కాన్ఫరెన్స్‌లో విజన్-2047, వివిధ సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లతో సీఎం చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పనుల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సాస్కి(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) పథకం ద్వారా APకి కేంద్రం రూ.113.75 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తొలి విడత నిధుల్లో 75% వినియోగించాక కేంద్రం తదుపరి విడత నిధులు విడుదల చేస్తుందన్నారు. కేంద్రం సాయంతో పర్యాటకంలో ఏపీని నం.1గా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.

IPL వేలంలో SRHకు ఎంపికవడంపై హర్షల్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘SRHకు ఎంపికవడం చాలా రిలీఫ్‌గా ఉంది. ఆ జట్టు తరఫున బౌలింగ్ చేయడం సులువేమో కానీ వారికి అపోజిట్‌గా బౌలింగ్ వేయడం కష్టం. గత సీజన్‌లో SRH బ్యాటర్లు ఎలా విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశారో చూశాం. కాబట్టి ఆ టీమ్‌కు ఆడటం ఉపశమనాన్నిస్తుంది’ అని తెలిపారు. గత సీజన్‌లో PBKSకు ఆడిన హర్షల్‌ను తాజా వేలంలో రూ.8కోట్లతో SRH కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే .

మహారాష్ట్రలో చిత్తుగా ఓడిపోయిన MVA దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతోందని సమాచారం. తమ పరాభవానికి EVMలే కారణమని భావిస్తోంది. వాటిని తీసేసి మళ్లీ బ్యాలెట్ వ్యవస్థ అమలు కోసం నిరసనలు చేపట్టనుందని తెలుస్తోంది. ఇందుకోసం కోర్టుల్లో పోరాడేందుకు కాంగ్రెస్, NCP SP, SS UBT లీగల్ టీమ్స్‌నూ ఏర్పాటు చేస్తున్నాయి. మహారాష్ట్ర ఓటమిపై ప్రశ్నిస్తున్న ఇండియా కూటమి ఝార్ఖండ్‌లో విజయంపై సందేహాల్లేవని చెప్తుండటం గమనార్హం.

TG: మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికే రూ.10 వేల కోట్ల కేటాయించామని, అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కాకుల్లా అరుస్తున్నారని మండిపడ్డారు. పనిలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉండదన్నారు. మూసీ నిర్వాసితులకు వ్యాపార రుణాలు ఇస్తామని చిట్‌చాట్‌లో వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.