India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అరచేతిలో నెట్ ఉండటంతో స్వల్ప అస్వస్థత కలిగినా గూగుల్‌ని అడగడం చాలామందికి పరిపాటిగా మారింది. అలా చూడటం కూడా సైబర్‌కాండ్రియా అనే మానసిక రుగ్మతేనంటున్నారు వైద్యులు. ఓ అధ్యయనం ప్రకారం ఇంటర్నెట్ వాడేవారిలో 72శాతం మంది తమ ఆరోగ్య సమస్యలపై గూగుల్ చేస్తున్నారట. దీని వల్ల అపోహలతో ఆందోళనకు లోనయ్యే ప్రమాదముందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య ఉంటే వైద్యులకు చూపించుకోవడం సరైనదని సూచిస్తున్నారు.

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, నటుడు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జైనాబ్ రవ్‌డ్జీతో అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని ప్రకటించారు. వారిద్దరిని అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాగా వచ్చే నెల 4న అఖిల్ సోదరుడు నాగచైతన్య కూడా శోభిత ధూళిపాళను వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

జీవితకాలంలో వేరే దేశాన్ని ఓసారి చూస్తే గొప్ప అనుకుంటాం. కానీ US యువతి లెక్సీ ఆల్ఫోర్డ్ 21 ఏళ్ల వయసుకే 195 దేశాలు చుట్టేసి గిన్నిస్ రికార్డుకెక్కారు. తాజాగా విద్యుత్ కారులో ప్రపంచమంతా తిరిగిన తొలి వ్యక్తిగా మరో రికార్డునూ సృష్టించారు. కారులో 200 రోజుల పాటు 6 ఖండాలను దాటారు. తన తల్లిదండ్రులు ట్రావెల్ ఏజెంట్లుగా చేసేవారని, వారి స్ఫూర్తితోనే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారామె.

జపాన్‌లో 150 ఏళ్ల చరిత్ర కలిగిన షికోకు బ్యాంక్ తమ సిబ్బందిగా చేరేవారికి అసాధారణ నిబంధనలు పెట్టింది. ‘ఇక్కడ ఉద్యోగం చేసేవారు డబ్బు చోరీ చేసినా, దొంగతనానికి సహకరించినా ఆ మొత్తాన్ని చెల్లించి ఆత్మహత్య చేసుకోవాలి’ అని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ మేరకు అధికారిక డాక్యుమెంట్‌పై రక్తంతో సంతకం చేయాలని పేర్కొంది. ఉద్యోగుల్లో నైతికత పెంచేందుకు ఎన్నో ఏళ్లుగా ఇలా చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.

AP: 2029 నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నైపుణ్యాభివృద్ధి కోసం డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మిస్తామని చెప్పారు. ‘స్టార్టప్‌లకు రూ.25 లక్షల సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అలాగే యూత్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తాం. మరిన్ని ఐటీ పాలసీలపై చర్చిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Adani Groupపై లంచాల ఆరోపణలు ఆ గ్రూప్ విదేశీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. కెన్యా ఇప్పటికే 2 ప్రాజెక్టులను రద్దు చేసుకుంది. నిధులు సమకూర్చడానికి ఫ్రెంచ్‌కు చెందిన పార్ట్‌నర్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ వెనకడుగు వేసింది. కొలంబోలో అదానీ పోర్టుకు $553 మిలియన్ల నిధుల మంజూరుపై US సంస్థ పునరాలోచిస్తోంది. బంగ్లాదేశ్ పాత ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం పున:సమీక్షిస్తోంది.

ఢిల్లీలో కాలుష్యం అతి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి పౌరుల ఊపిరితిత్తులు కచ్చితంగా ఎంతోకొంతమేర నాశనం అయి ఉంటాయని అశోక యూనివర్సిటీ డీన్, పరిశోధకుడు అనురాగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ స్థాయి కాలుష్యం వలన ఆరోగ్యవంతుల లంగ్స్ కూడా ఇప్పటికే నాశనమవడం ప్రారంభమై ఉంటుంది. ఆల్రెడీ ఆస్తమా, ఇన్ఫెక్షన్లున్నవారి సమస్యలైతే వర్ణనాతీతంగా ఉంటాయి. ఈ కాలుష్యం ఎవర్నీ వదిలిపెట్టదు’ అని హెచ్చరించారు.

ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని, బ్యాలెట్ విధానం మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ పిటిషన్ వేశారు. పిటిషనర్ వాదనలో బలమైన కారణం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది.

రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దుకు సంబంధించి హోం శాఖకు ఫిర్యాదులు అందాయని అలహాబాద్ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ విషయమై చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించింది. రాహుల్‌కు బ్రిటిష్ పౌరసత్వం ఉందని, ఆయన భారత పౌరసత్వం రద్దుకు CBI దర్యాప్తు కోరుతూ కర్ణాటక BJP నేత విఘ్నేశ్ కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 19న జరిగే తదుపరి విచారణలో ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది.

TG: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల పురోగతి గురించి ఆయనతో సీఎం చర్చించారు. దీంతో పాటు రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సర్వే చేయాలని ప్రతిపాదించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.