India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో ఓటింగ్ శాతం సాయంత్రం 5 గంటలకు 57.70%గా నమోదైంది. అత్యధికంగా బెంగాల్‌లో 77.99% ఓటింగ్ రికార్డ్ అయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఝార్ఖండ్ (61.41%), ఒడిశా (59.60%), హరియాణా (55.93%), ఢిల్లీ (53.73%), జమ్మూకశ్మీర్ (51.35%), బిహార్ (52.24%), యూపీ (52.02%) ఉన్నాయి. మరోవైపు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 59.60% పోలింగ్ నమోదైంది.
దేశంలో ఆరో విడత పోలింగ్ ముగిసింది. 58 స్థానాల్లో 889మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు EVMలలో నిక్షిప్తం చేశారు. 6 గంటలకు ముందు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం ఇస్తున్నారు. యూపీలో 14, ప.బెంగాల్‌లో 8, హరియాణాలో 10, ఢిల్లీలో 7, బిహార్‌లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 4, జమ్మూలో ఒక లోక్‌సభ స్థానానికి, ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
SRH బ్యాటర్ అభిషేక్ నిన్న RRపై గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే బ్యాటింగ్‌కు బదులు బౌలింగ్‌తో అదరగొట్టారు. 4 ఓవర్లేసి శాంసన్, హెట్మయిర్ వికెట్లు తీశారు. తన తండ్రి వల్లనే బౌలింగ్ బాగా మెరుగుపడిందని మ్యాచ్ అనంతరం ఆయన తెలిపారు. ‘మా నాన్న, యూవీ నాకు అండగా నిలిచారు. తనకంటే నేను మంచి బౌలర్‌ను అని యువరాజ్ తరచూ చెబుతుండేవారు. నిన్నటి బౌలింగ్‌తో ఆయన హ్యాపీ అయ్యారనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
వయాకామ్ 18, స్టార్ ఇండియా వినోద ఛానళ్ల విలీనం గత కొంతకాలంగా ప్రతిపాదనల దశలో ఉంది. ఈ విలీనానికి సంబంధించి ఇండస్ట్రీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుమతిని వయాకామ్ 18 మాతృసంస్థ రిలయన్స్ తాజాగా కోరింది. ఈ విలీనం వలన దేశంలో పోటీ వ్యాపారాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వివరించింది. ఈ డీల్ పూర్తయితే స్టార్, వయాకామ్‌కు చెందిన 100కు పైగా ఛానళ్లు, 2 ఓటీటీ సంస్థలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి.
IPL ఫైనల్‌కు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు SRH ప్రాక్టీస్‌కు దూరంగా ఉంది. నిన్నే మ్యాచ్ ఆడటం, చెన్నైలో ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు ఇవాళ ప్రాక్టీస్ చేయట్లేదు. మరోవైపు కేకేఆర్ చివరగా మంగళవారం మ్యాచ్ ఆడటంతో ఆ ప్లేయర్లకు సరైన విశ్రాంతి లభించింది.
హై రిటర్న్స్ పేరుతో వచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘స్టాక్స్‌లో 3-5ఏళ్లకు 12-15% రిటర్న్ వస్తాయి. సుదీర్ఘకాలానికి అయితే 25-30% వరకు ఉంటాయి. ఇంతకు మించి రిటర్న్స్ వస్తాయని చెబితే వాటిని అనుమానించాలి. పాస్‌వర్డ్స్/ OTPలు షేర్ చేయొద్దు. పాస్‌వర్డ్స్ మారుస్తుండాలి. కొత్త యాప్/ వెబ్‌సైట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో షేర్ మార్కెట్ టిప్స్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేటుగాళ్ల వలలో పడి బాధితులు రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల గుజరాత్‌కు చెందిన ఓ మాజీ సీఏను కేటుగాళ్లు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామని ‘Stock Vanguard 150’ అనే గ్రూప్‌లో చేర్పించారు. నకిలీ పోర్ట్‌ఫోలియోలో అతడి చేత రూ.1.97కోట్లు పెట్టుబడి పెట్టించి టోకరా వేశారు.
రేపు ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా KKR, SRH కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. చెన్నైలో బోటు, ఆటోలో శ్రేయస్ అయ్యర్, కమిన్స్ ఫొటోలు దిగారు. ఈ ఫొటో షూట్‌ను ఐపీఎల్ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. ఆదివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఓటమి ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ పరాజయానికి మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ బలిపశువు చేస్తుందని పేర్కొన్నారు. బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఓటు బ్యాంకు కోసం కూటమి చిందులు వేస్తుందని దుయ్యబట్టారు. ప్రపంచ వేదికపై దేశానికి న్యాయం చేసే ప్రధాని భారత్‌కు అవసరమని చెప్పారు. ఇండియా కూటమి ఈ పదవితో కుర్చీలాట ఆడాలని చూస్తోందని విమర్శించారు.
‘జయజయహే తెలంగాణ’ పాటకు కీరవాణిని సంగీతం అందించమనడం చారిత్రక తప్పిదమని CM రేవంత్‌కు తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ‘మన ఉద్యోగాలు మనకే రావాలని, మన అవకాశాలు మనకే కావాలనే నినాదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాలవారు పాడటం ఏంటి? అలా చేయడమంటే తెలంగాణ కళాకారులను అవమానించడమే. ఈ గొప్ప అవకాశం మనవాళ్లకే ఇవ్వాలి’ అని సీఎంను కోరారు.
Sorry, no posts matched your criteria.