News November 25, 2024

BHUVI: ఆరెంజ్ ఆర్మీ హార్ట్ బ్రేక్!

image

ఐపీఎల్ వేలంలో టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఆర్సీబీ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. కాగా భువీ ఆర్సీబీకి వెళ్లిపోవడంతో SRH ప్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ‘మిస్ యువర్ గేమ్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా 2013 నుంచి భువనేశ్వర్ SRHకే ఆడుతున్నారు. భువీ టీమ్ ఇండియా జెర్సీలో కంటే ఆరెంజ్ జెర్సీలోనే అందరికీ గుర్తుకొస్తారు. భువీ గతంలో ఆర్సీబీ తరఫున కూడా ఆడిన విషయం తెలిసిందే.

News November 25, 2024

ముంబై ఇండియన్స్‌లోకి మరో తెలుగు కుర్రాడు

image

ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు కుర్రాడు కాకినాడకు చెందిన పెన్మత్స వెంకట సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కే ఆయనను సొంతం చేసుకుంది. ఇప్పటికే ముంబై జట్టులో హైదరాబాదీ తిలక్ వర్మ ఉన్న సంగతి తెలిసిందే. కాగా వైజాగ్‌కు చెందిన అవినాశ్‌ను రూ.30 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే బైలపూడి యశ్వంత్, విజయ్ కుమార్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News November 25, 2024

Women Tax Payers: ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ

image

ఆదాయ ప‌న్ను చెల్లించే మ‌హిళ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కంటే తెలంగాణ‌లో అధికంగా ఉన్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఏపీ నుంచి 6.53 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ప‌న్ను చెల్లించారు. అదే తెలంగాణలో 8.55 ల‌క్ష‌ల మంది ప‌న్ను చెల్లించిన‌ట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గ‌త ఐదేళ్ల గ‌ణాంకాలు తీసుకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే మ‌హిళ‌లు తెలంగాణ‌లో అధికంగా ఉన్న‌ట్టు నివేదిక వెల్ల‌డించింది.

News November 25, 2024

ఇది కదా విజయం అంటే..!

image

లక్ష్య ఛేదనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్న మాటలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిరూపించారు. ‘2004లో గోవాలో IFFIల ఈవెంట్ మేనేజ్మెంట్‌లో నాగ్ పనిచేశారు. సరిగ్గా 20 ఏళ్లకు IFFI పుస్తకంలో ఆయనకు ఓ పేజీ కేటాయించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. కాగా ‘మహానటి’తో నేషనల్ అవార్డు అందుకున్న ఆయన ‘కల్కి’తో రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్‌గా చరిత్రలోకెక్కారు.

News November 25, 2024

షాకింగ్: సర్ఫరాజ్ ఖాన్ అన్‌సోల్డ్

image

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టన్నులకొద్దీ రన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ను IPL వేలంలో దురదృష్టం వెంటాడింది. స్టార్ హిట్టర్‌గా పేరొంది, ప్రస్తుతం BGTలో భారత జట్టుకూ ఎంపికైన అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. గతంలో అతడు RCB, పంజాబ్‌, DC తరఫున ఆడారు. అయితే సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్‌ను పంజాబ్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.

News November 25, 2024

ఇలాంటి జింకలను మీరెప్పుడైనా చూశారా?

image

జింకల్లో ఎన్నో రకాలున్నాయి. అందులో సైగ జింక అరుదైనది. ఇది కాస్త విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది. మధ్య ఆసియాలోని గడ్డి భూముల్లో కనిపించే సైగ జింకలకు విచిత్రమైన, ఉబ్బెత్తు ముక్కు ఉంటుంది. కాలానుగుణ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను భరించడంలో ఈ ముక్కు సహాయపడుతుంది. నాసికా రంధ్రాలు గాలి ఫిల్టర్‌లుగా పనిచేస్తాయి. చల్లటి గాలిని పీల్చుకుని ఊపిరితిత్తులకు చేరేలోపు వేడి చేస్తాయి.

News November 25, 2024

బాలినేని సంతకంతోనే సెకీ ఒప్పందం: చెవిరెడ్డి

image

AP: అప్పట్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకంతోనే సెకీతో ఒప్పందం కుదిరిందని ycp నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఆయన దీనిపైనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ‘జగన్ గురించి బాలినేని వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. పార్టీలో ఉన్నప్పుడు బాలినేని స్పెషల్ ఫ్లైట్స్‌లో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇచ్చి గౌరవించారు. కానీ జగన్‌నే ఆయన బ్లాక్ మెయిల్ చేశారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News November 25, 2024

స్మిత్ మరోసారి అన్‌సోల్డ్

image

ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ IPL వేలంలో మరోసారి అన్‌సోల్డ్‌గా మిగిలారు. అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. గత వేలంలోనూ స్మిత్‌ను ఎవరూ కొనలేదు. ఇక మిచెల్ శాంట్నర్‌ను ముంబై రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. సికిందర్ రజా, నిస్సాంక, అట్‌కిన్‌సన్, జోసెఫ్, రిచర్డ్ గ్లీసన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News November 25, 2024

MI కీలక ఆటగాళ్లను దక్కించుకున్న RCB

image

ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు టిమ్ డేవిడ్(రూ.5.25 కోట్లు), రొమారియో షెఫర్డ్ (రూ.1.50 కోట్లు)ను బెంగళూరు దక్కించుకుంది. మరోవైపు MI విల్ జాక్స్‌ను కొన్న సమయంలో ఆర్సీబీ RTM ఉపయోగించలేదు. ఇందుకు ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీ ఆర్సీబీ సీఈఓను టేబుల్ దగ్గరికి వెళ్లి మరీ హగ్ చేసుకున్నారు.

News November 25, 2024

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

APలో ఉమ్మడి తూ.గో-ప.గో, గుంటూరు-కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్ MLC, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ, తూ.గో-ప.గో జిల్లాల టీచర్స్ MLC ఎన్నికల డ్రాఫ్ట్ రోల్స్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అన్ని పత్రాలు సమర్పించిన వారి పేర్లను లిస్టులో ఉంచారు. మీ నియోజకవర్గం ఎంపిక చేసుకుని, జిల్లా, పోలింగ్ బూత్ వివరాల ద్వారా మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ పేరు తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.