News May 23, 2024

‘కిర్గిస్థాన్’ తెలుగు విద్యార్థుల్ని తీసుకొచ్చేందుకు చర్యలు: AP NRT

image

AP: కిర్గిస్థాన్‌లోని తెలుగు విద్యార్థుల్ని తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఏపీ ఎన్నార్టీ సొసైటీ సీఈఓ హేమలత తెలిపారు. రోజూ 2 విమానాలు ఆ దేశానికి నడుస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని, ప్రస్తుతం కిర్గిస్థాన్‌ పరిస్థితి సాధారణంగానే ఉందని వివరించారు. ఆ దేశ రాజధాని బిష్కెక్‌లో విదేశీ విద్యార్థులపై ఇటీవల దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

News May 23, 2024

ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు పూర్తి

image

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన సొంత పట్టణం మషాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయనను చివరి చూపులు చూసేందుకు నగరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 63 ఏళ్ల రైసీ నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇరాన్ వెళ్లి రైసీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

News May 23, 2024

రేపే పాలిసెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

TG: రేపు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఉ.11 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమై మ.1.30 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 259 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. గంట ముందు నుంచే అనుమతి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. విద్యార్థులు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరేస‌ర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి. పరీక్షకు 92,808 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

News May 23, 2024

భారత్‌కు వేర్వేరు కోచ్‌లు అవసరం లేదు: స్వాన్

image

ప్రపంచ క్రికెట్లో ఇతర జట్ల తరహాలో టీమ్ ఇండియాకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ అవసరం లేదని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డారు. భారత క్రికెటర్లు ఇతర దేశాల లీగ్స్ ఆడరు కాబట్టి వారికి ఇలాంటి విధానాలు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ‘ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా లీగ్స్ ఆడుతుంటారు. కానీ భారత్‌కు ఆ బాధ లేదు. వారికి అన్ని ఫార్మాట్లలోనూ ఒక సమర్థుడైన కోచ్ ఉంటే చాలు’ అని వివరించారు.

News May 23, 2024

ఫేక్ లోగో వైరల్ చేశారని ఇద్దరిపై కేసు

image

TGSRTC ఫేక్ లోగోను వైరల్ చేశారంటూ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లోగోను షేర్ చేసినందుకు, దాన్ని తామే తయారు చేశామంటూ తనతో పాటు హరీశ్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని దిలీప్ ఆరోపించారు. ఉద్యమంలో అన్నీ ఎదుర్కొని వచ్చిన తమలాంటి వారిపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

News May 23, 2024

అతడు మంచి ఫ్యామిలీకి చెందిన కుర్రాడు: HC

image

ఓ అమ్మాయికి కాల్స్ చేసి వేధించిన కేసులో అరెస్టైన అబ్బాయికి మధ్యప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ అబ్బాయి మంచి ఫ్యామిలీకి చెందిన వాడని, అందుకే బెయిల్ ఇచ్చామని తీర్పు సందర్భంగా జడ్జి చెప్పడం గమనార్హం. ఇక రెండు నెలల బెయిల్ సమయంలో భోపాల్‌లోని ఆసుపత్రిలో సేవ చేయాలని అతడికి న్యాయమూర్తి షరతు విధించారు.

News May 23, 2024

సీఈఓగా రూ.166కోట్ల జీతం తీసుకున్నారు!

image

భారత ఐటీ రంగంలో అత్యధిక జీతం అందుకున్న సీఈఓగా థియరీ డెలాపోర్టే నిలిచారు. విప్రోకు సీఈఓగా ఉన్నప్పుడు ఈయన FY24లో రూ.166కోట్ల జీతం తీసుకున్నారు. ఇటీవల సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న డెలాపోర్టే పరిహారంగా రూ.92కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. ఆ స్థానాన్ని శ్రీనివాస్ పల్లియా (రూ.50కోట్ల జీతం) భర్తీ చేశారు. మరోవైపు ఇన్ఫోసిస్ CEO సాలిల్ పరేఖ్ రూ.56కోట్లు, HCL టెక్ సీఈఓ విజయకుమార్ రూ.28.4కోట్లు ఆర్జించారు.

News May 23, 2024

INDvsPAK మ్యాచ్ టికెట్ల ధరలపై లలిత్ మోదీ ఫైర్

image

టీ20 వరల్డ్ కప్‌లో టికెట్ల ధరలపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మండిపడ్డారు. ఐసీసీ తీరును ఆయన తప్పుబట్టారు. ‘జూన్ 9న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ టికెట్ ధర చూసి షాక్ అయ్యా. ఒక్కో టికెట్ 20 వేల డాలర్ల(రూ.16.6 లక్షలు)కు విక్రయిస్తున్నారు. అమెరికా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నది లాభాల కోసం కాదు. గేమ్ విస్తరించడానికి. మామూలు టికెట్ ధర కూడా 2,750 డాలర్లు ఉండటం దారుణం’ అని ట్వీట్ చేశారు.

News May 23, 2024

APEAPCET ప్రిలిమినరీ కీ విడుదల

image

AP: ఏపీఈఏపీసెట్ (పాత ఎంసెట్) ప్రిలిమినరీ కీ విడుదలైంది. కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లు విడుదల చేశారు. ఈ నెల 25 ఉ.10 గంటల్లోపు కీపై అభ్యంతరాలు తెలపవచ్చని అధికారులు తెలిపారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్, ఈ నెల 18 నుంచి నేటి వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. దాదాపు 3.61 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాశారు. కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News May 23, 2024

నా బెస్ట్ క్రికెటర్లు వీరే: హర్ష గోయెంకా

image

ఇండియా: సచిన్ టెండూల్కర్
ఆస్ట్రేలియా: బ్రాడ్‌మాన్
ఇంగ్లండ్: లెన్ హట్టన్
శ్రీలంక: ముత్తయ్య మురళీధరన్‌
దక్షిణాఫ్రికా: కలిస్, పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్
వెస్టిండీస్: గ్యారీ సోబర్స్, న్యూజిలాండ్: రిచర్డ్ హ్యాడ్లీ
అఫ్గానిస్థాన్‌: రషీద్ ఖాన్, బంగ్లాదేశ్: షకిబ్‌ అల్ హసన్‌
● మీ బెస్ట్ క్రికెటర్లు ఎవరో కామెంట్ చేయండి..