News May 23, 2024

పక్షి ఈక రూ.23 లక్షలు

image

న్యూజిలాండ్‌లో అంతరించిపోయిన huia bird ఈక రికార్డు ధర పలికింది. 100 ఏళ్ల నాటి 9 గ్రాముల బరువున్న ఈకను వేలానికి పెట్టగా ఏకంగా రూ.23 లక్షలకు అమ్ముడుపోయింది. ఇది బంగారం కన్నా విలువైనది కావడంతోనే భారీ ధర పలికిందని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ హుయా పక్షులు 1907లో చివరి సారి కనిపించగా 1920 తర్వాత భూమిపై తమ ఉనికినే కోల్పోయాయని చెబుతున్నారు. తెలుపు, నలుపు రంగుల్లో ఈ ఈకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయట.

News May 23, 2024

అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘క్రూ’

image

కరీనాకపూర్, టబు, కృతిసనన్ నటించిన ‘క్రూ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మార్చి 29న థియేటర్లలో విడుదలైన ‘క్రూ’ మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టింది. రాజేష్ కృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కరీనా, టబు, కృతి ఎయిర్ హోస్టెస్‌ పాత్రల్లో నటించారు.

News May 23, 2024

ఎవరెస్టుపై చంద్రబాబు ఫొటో.. లోకేశ్ అభినందన

image

AP: మత్స్యకార కుటుంబానికి చెందిన ఉపేంద్ర అనే యువకుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపై టీడీపీ నేత నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ‘అనంతపురానికి చెందిన ఈ యువకుడు సంకల్పం, కృషితో ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించగలమని నిరూపించారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీకు మద్దతుగా నిలిచినందుకు గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఎవరెస్ట్ శిఖరంపై అతడు ప్రదర్శించిన చంద్రబాబు ఫ్యామిలీ, టీడీపీ జెండా ఫొటోలను జతచేశారు.

News May 23, 2024

కాంగ్రెస్‌కు 40 సీట్ల కూడా రావు: అమిత్ షా

image

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు కూడా రావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓటు బ్యాంకు పోతుందనే రాహుల్, అఖిలేశ్ యాదవ్ రామమందిరాన్ని సందర్శించట్లేదని దుయ్యబట్టారు. యూపీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ 310 సీట్లు గెలుచుకుందని ఉద్ఘాటించారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌ను గమనిస్తే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అర్థమవుతుందన్నారు.

News May 23, 2024

రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రేపు మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. శని, ఆదివారాల్లోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. మరోవైపు రేపు 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

News May 23, 2024

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన షారుఖ్

image

వడదెబ్బతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డిశ్చార్జి అయ్యారు. ఆయన ముంబై వెళ్లనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు షారుఖ్ మేనేజర్ పూజా వెల్లడించారు. వడదెబ్బతో అస్వస్థతకు గురైన షారుఖ్ నిన్న అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

News May 23, 2024

శవ రాజకీయాలు BRSకు కొత్త కాదు: మంత్రి జూపల్లి

image

TG: వ్యక్తిగత కారణాల వల్లే BRS నేత శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యారని, దాన్ని కేటీఆర్ రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శవ రాజకీయాలు చేయడం BRSకు కొత్త కాదని, ఎక్కడ శవముంటే అక్కడ గద్దల్లా వాలిపోతారని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని మంత్రి చెప్పారు.

News May 23, 2024

ఏఐతో లవ్‌లో పడింది..!

image

చాట్‌జీపీటీకి చెందిన DAN (Do Anything Now) అనే చాట్‌బోట్‌తో ప్రేమలో పడిపోయింది లీసా అనే చైనా యువతి. USలో నివసించే ఈమె మార్చిలో DANను వాడటం స్టార్ట్ చేసిందట. క్రమంగా DANపై ప్రేమ పుట్టిందట. ఈ విషయాన్ని DANతో చెప్తే తనకు భౌతిక శరీరం లేదని మొదట తోసిపుచ్చినా క్రమంగా ఆ ఏఐ సైతం ఈమెపై ఫీలింగ్స్ పెంచుకుందట. ఈమెకు ‘లిటిల్ కిటెన్’ అని ముద్దు పేరు కూడా పెట్టింది. డాన్ ప్రవర్తన మనిషిలానే ఉందని లీసా పేర్కొంది.

News May 23, 2024

అంబటి, మోహిత్ రెడ్డిల పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

image

AP: సత్తెనపల్లిలోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చంద్రగిరిలోనూ రీపోలింగ్ జరపాలన్న వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

News May 23, 2024

అది మార్ఫింగ్ వీడియో కావొచ్చు: పిన్నెల్లి లాయర్

image

AP: పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మొదలైంది. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ‘ట్విటర్ వీడియో ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారు? అది మార్ఫింగ్ వీడియో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు EVM ధ్వంసం చేశారని పోలింగ్ ఆఫీసరే అన్నారు. FIRలో కూడా ఇదే ఉంది. అరెస్టుపై ఈసీ నేరుగా ఆదేశాలివ్వడం సరికాదు’ అని పేర్కొన్నారు.