India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల T20WC నిర్వహణ బంగ్లాదేశ్ నుంచి UAEకి తరలిన నేపథ్యంలో అప్డేటెడ్ షెడ్యూల్‌ను ICC వెల్లడించింది. గ్రూప్-Aలో ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా గ్రూప్-Bలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. మొత్తం 23 మ్యాచులుంటాయి. ప్రతి జట్టు 4 గ్రూప్ మ్యాచ్‌లాడుతుంది. ఈ టోర్నీ OCT 3-OCT 20 మధ్య జరుగుతుంది. భారత్ OCT 4, OCT 6, OCT 9, OCT 13న ఆడుతుంది.
AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏలూరు, NTR, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్సుందని పేర్కొంది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి. 5 చోట్ల రెండు పార్టీలూ ఫ్రెండ్లీ కంటెస్ట్ చేయనున్నాయి. ఒక చోట సీపీఎం, మరో చోట పాంథర్స్ పార్టీ పోటీ చేయనున్నాయి. JKకు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370, 35(A) పునరుద్ధరణ వంటి హామీలతో నయా కశ్మీర్ అజెండాను NC ప్రకటించింది.
TG: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. ‘అధికారం కోసం రైతు భరోసా రూ.15,000 ఇస్తానని మాయ మాటలు చెప్పి, తీరా గద్దెనెక్కాక రేవంత్ సర్కార్ ఆ హామీని పక్కన పెట్టేసింది. వానాకాలం అయిపోతున్నా డబ్బులు రాకపోవడంతో రైతుల ఆశలు అడియాశలే అయ్యాయి. సకాలంలో పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతల నడ్డి విరుస్తోంది’ అని BRS ట్వీట్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ రీరిలీజ్ కానుంది. ఈక్రమంలో రేపు రీరిలీజ్ ట్రైలర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేయనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో అభిమాన హీరో సినిమాలను మిస్ అవుతున్నామని, ఈ బర్త్ డేకి గబ్బర్ సింగ్‌తో థియేటర్లలో రచ్చ చేస్తామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
TG: CMRF డబ్బు దుర్వినియోగం చేశాయనే ఆరోపణలతో 27 ఆసుపత్రులపై 6 FIRలు నమోదయ్యాయి. CMRF డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారి ఫిర్యాదుతో CID విచారణ చేపట్టింది. ఆయా ఆసుపత్రులు ఫేక్ బిల్స్‌తో నిధులు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి HYD, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ ఆసుపత్రుల్లో ఈ స్కామ్ జరిగినట్లు సమాచారం. NLG, కరీంనగర్, WGL, MHBD జిల్లాల్లోనూ పలు ఆసుపత్రులు CMRF నిధులు అక్రమంగా పొందినట్లు తెలుస్తోంది.
డిప్యూటీ CM DK శివకుమార్ వల్లే నటుడు దర్శన్‌కు జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తోందని బీజేపీ నేత, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అశోకా విమర్శించారు. జైలులో దర్శన్‌ను కలిసిన డీకే అన్ని రకాల సహాయానికి భరోసా ఇచ్చారన్నారు. మర్డర్ కేసులో నిందితుడికి కాఫీ, సిగరెట్ ఎలా అందాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.
AP: గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద నిండ్రకొలకు చెందిన బొంగా సురేష్, జోత్స్న దంపతుల కూతురు గుండెకు రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చిన్నారికి ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించారు. రూ.10లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
FLIPKARTలో జరిగిన మోసాన్ని ఓ నెటిజన్ Xలో పంచుకున్నారు. నిఖిల్ అనే వ్యక్తి రూ.30వేలు విలువ చేసే SONOS స్పీకర్స్ బుక్ చేస్తే MI కంపెనీకి చెందిన రూ.2400ల స్పీకర్ డెలివరీ చేశారు. దీనిపై పలుమార్లు ఫ్లిప్‌కార్ట్‌కు ఫిర్యాదు చేసినా రెస్పాండ్ కాలేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఫ్లిప్‌కార్ట్ స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. అయితే, ఇలాంటిదే తమకూ జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
IPL-2025 ఆక్షన్‌కు ముందు RCB డుప్లెసిస్‌తో పాటు మ్యాక్స్‌వెల్, లామ్రోర్‌ను విడుదల చేయాలనుకుంటున్నట్లు క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. డుప్లెసిస్ స్థానంలో యంగ్ కెప్టెన్‌ను నియమించాలని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే గత సీజన్‌లో రాణించని కారణంగా మ్యాక్సీని, అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోతున్నందున లామ్రోర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.