India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆయన అవినీతిపై CBI, ACB విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘అదానీతో కాకుండా సెకీతో ఒప్పందం చేసుకున్నామని YCP ప్రకటించింది. కానీ సెకీ నోడల్ ఏజెన్సీ మాత్రమే. అదానీ కేసుతో సెకీకి సంబంధం లేదు. జగన్ క్విడ్ ప్రోకోతో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరింది. ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల భారం పడింది’ అని ఆయన మండిపడ్డారు.

AP: తిరుపతి జిల్లాలోని ఏర్పేడులో ఓ వ్యక్తి RTC బస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేర్లపాక వద్ద బస్సు ఎక్కిన యువకుడు బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉండటంతో వెనుకవైపు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న తాడుతో బస్సులోనే ఉరివేసుకున్నాడు. ఏర్పేడు వద్ద కండక్టర్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

తన భార్యతో విడాకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మాధ్యమాలకు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ లీగల్ నోటీసులు పంపారు. తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అభ్యంతరకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారు 24 గంట్లలోపు వాటిని తొలగించాలన్నారు. రెహమాన్‌తో కలిసి పనిచేసిన బాసిస్ట్ మోహినిడే కూడా తన భర్తతో విడాకులు తీసుకోవడంతో వీరిద్దరూ కలుస్తున్నట్టు వార్తలొచ్చాయి.

భారత్‌లో మొదటి హైడ్రోజన్ రైలు డిసెంబర్‌లో పట్టాలెక్కనుంది. ఈ పర్యావరణ అనుకూల రైలును హరియాణాలో 90KM దూరం కలిగిన జింద్-సోనిపట్ మధ్య నడపనున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొని నీటి ఆవిరిని విడుదల చేయడం దీని ప్రత్యేకత. ఇతర రైళ్లతో పోలిస్తే ఇవి తక్కువ శబ్దంతో నడుస్తాయి. 2025 నాటికి ఇలాంటి 35 రైళ్లను పట్టాలెక్కించడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

AP: సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ CM జగన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. PC యాక్ట్ కింద కేసు నమోదు చేయొచ్చా అనే కోణంలో న్యాయ సలహా కోరింది. ఇప్పటికే USలో అదానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఛార్జిషీటులో జగన్ పేరు కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే PC యాక్ట్‌లోని 17ఏ అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి.

బిలియనీర్ గౌతమ్ అదానీకి మరో షాక్ తగిలింది. సోలార్ విద్యుత్ స్కామ్ ముడుపులకు సంబంధించి అమెరికా SEC(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్) ఆయనకు నోటీసులు జారీ చేసింది. అదానీ నివసించే అహ్మదాబాద్‌లోని శాంతివన్ ఫామ్ చిరునామాకు ఈ నోటీసులు పంపింది. మూడు వారాల్లోగా ముడుపులపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. గౌతమ్‌తోపాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌కు కూడా సమన్లు జారీ చేసింది.

ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఒక వికెట్ నష్టానికి 275 రన్స్ చేసింది. దీంతో 321 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. IND ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అజేయ సెంచరీ(141*)తో అదరగొట్టారు. రాహుల్ 77 రన్స్ చేసి ఔటయ్యారు. పడిక్కల్ 25* క్రీజులో ఉన్నారు.

ఢిల్లీలోని అశోక్‌విహార్‌లో అమానవీయ ఘటన జరిగింది. HPకి చెందిన ఓ మహిళను భర్త విడిచి పెట్టగా ఢిల్లీకి చెందిన మరో వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేమలో పడింది. ప్రియుడి కోసం ఢిల్లీ వెళ్లగా అసలు కథ మొదలైంది. ఆ మహిళకు అత్యాచార బాధితురాలైన కూతురు(5) ఉంది. కాగా ఆ చిన్నారితో కలిసి ఉండటం కుదరదని సదరు ప్రియుడు ఆమెను తిరస్కరించాడు. ఈక్రమంలోనే ప్రియుడి కోసం కూతుర్ని మహిళ హతమార్చింది. కేసు నమోదైంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముంబైలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శిండే ఈ భేటీ నిర్వహించడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఓట్ల లెక్కింపు విషయంలో భారత్‌తో అమెరికాను పోలుస్తూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ఇండియాలో ఒకే రోజు 640 మిలియన్ల ఓట్లు లెక్కిస్తే USలోని కాలిఫోర్నియాలో మాత్రం కేవలం 15 మిలియన్ల ఓట్లను 18 రోజుల నుంచి ఇంకా లెక్కిస్తూనే ఉన్నారన్నది ఆ ట్వీట్ సారాంశం. దీనిపై ‘విషాదం’ అని ఎలాన్ మస్క్ రియాక్టయ్యారు. కాలిఫోర్నియాలో కమలా హారిస్‌ను విజేతగా ఏజెన్సీలు ప్రకటించినా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Sorry, no posts matched your criteria.