India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. తొలుత 44 మందితో ఓ లిస్ట్‌ను విడుదల చేసిన ఆ పార్టీ తర్వాత దాన్ని <<13943658>>వెనక్కి<<>> తీసుకుంది. తాజాగా 15 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది.
TG: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా సింగరేణి కంపెనీ ఈ మొత్తాన్ని అందించనుంది.
విడాకులు తీసుకున్నప్పటికీ తన మాజీ భార్యలు రీనా, కిరణ్‌రావుతో మంచి అనుబంధమే ఉందని హీరో ఆమిర్ ఖాన్ వెల్లడించారు. నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. వివాహ జీవితంలో రెండు సార్లు ఫెయిల్ అయిన తన నుంచి వైవాహిక సూచనలు తీసుకోకపోవడం మంచిదన్నారు. మరో పెళ్లి ఆలోచన ఉందా? అని అడగగా.. ‘59 ఏళ్ల వయసులో వివాహం అంటే కష్టం. నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి’ అని తెలిపారు.
ముంబైలో సంపన్నమైన GSB సేవా మండల్ ఈసారి గణేశుడికి రికార్డు స్థాయిలో రూ.400 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించింది. భక్తులు, వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణ, ఆభరణాలు చోరీకి గురైనప్పుడు ఇది వర్తిస్తుంది. అయితే ఎంతమొత్తంలో ప్రీమియం చెల్లించిందీ వెల్లడించలేదు. ఈ వినాయకుడిని 66KGల బంగారం, 325KGల సిల్వర్, విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు. SEP 7 నుంచి 11 వరకు భక్తులకు విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు.
TG: నడిరోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఇష్టారీతిన రీల్స్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో తనిఖీలు చేసి పాతవాటిపైనా కేసులు పెడుతున్నారు. ఇటీవల HYDలో రోడ్డుపై నోట్లు వెదజల్లుతూ రీల్స్ చేసిన ఓ యువకుడిపై 3 PSలలో కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బైకులపై స్టంట్లు చేయడం, నోట్లు జల్లడం, అభ్యంతరకరంగా ఉండే వీడియోలు చేస్తే బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌పై అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. BJP హఠాత్తుగా దీన్నెందుకు తెచ్చిందో అర్థం కాలేదు. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో OPSను కాంగ్రెస్ ప్రధాన అస్త్రంగా మలిచి లాభపడింది. ప్రస్తుతం JK, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు, OPS అస్త్రాన్ని నిర్వీర్యం చేసేందుకే BJP ఇలా UPS తెచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం.
పరప్పన అగ్రహార జైలులో హత్య కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్‌కు <<13939449>>వీఐపీ ట్రీట్‌మెంట్<<>> ఇవ్వడంపై సీఎం సిద్ద రామయ్య సీరియస్ అయ్యారు. దీనికి బాధ్యులైన జైలు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దర్శన్‌తోపాటు మరికొందరిని తక్షణమే వేర్వేరు జైళ్లకు తరలించాలని, జైలును సందర్శించి కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించినట్లు X వేదికగా తెలియజేశారు.
J&K అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన తొలి జాబితాను BJP వెనక్కి తీసుకుంది. కొద్దిసేపటి క్రితం 44 మంది అభ్యర్థులతో BJP అభ్యర్థులను ప్రకటించిన <<13943064>>విషయం<<>> తెలిసిందే. జాబితాలో ముగ్గురు ముఖ్యనేతల పేర్లు కనిపించలేదు. BJP J&K ప్రెసిడెంట్ రవీందర్ రైనా, మాజీ Dy.cm నిర్మల్ సింగ్, సీనియర్ నేత కవిందర్ గుప్తా పేర్లు మిస్ అయ్యాయి. వారి పేర్లను చేరుస్తూ కొత్త జాబితాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
AP: ఉద్యోగులకు మధ్యంతర భృతి, 12వ PRCని ప్రకటించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ఏ కార్యాలయంలోనూ పాత రికార్డులకు భద్రత లేదు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో దోషులెవరో తేలలేదు. ఈ ఘటనలతో ఉద్యోగులు భయపడుతున్నారు. మాపై తప్పుడు అభిప్రాయానికి రావొద్దు. సీఐడీ విచారణ పూర్తయ్యాక నిర్ణయానికి వద్దాం’ అని విజయవాడలో మీడియా సమావేశంలో చెప్పారు.
AP: ఎన్నికల్లో కూటమి నేతలు వాలంటీర్లు, అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో వైసీపీ పోరుబాట పట్టనున్నట్లు సమాచారం. 2 నెలలుగా జీతాలు రాకపోవడం, తమ సేవలను ఉపయోగించుకోకపోవడంతో వాలంటీర్లు ఆందోళనలో ఉన్నారు. అలాగే జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వీరు త్వరలో ఆందోళనలు చేయాలని నిర్ణయించుకోవడంతో మద్దతు పలకాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.