News November 23, 2024

ఘోర ఓటమి నుంచి రేవంత్ కాపాడలేకపోయారు: KTR

image

TG: CM రేవంత్ సభలు, సమావేశాలు MHలో కాంగ్రెస్‌ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని KTR ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలపై సీఎం ఇప్పుడు ఫోకస్ చేయాలని హితవు పలికారు. దేశ రాజకీయాల భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలే అని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసినట్లు ట్వీట్ చేశారు. కేంద్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలవలేకపోయిన కాంగ్రెస్ పొత్తులతో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

News November 23, 2024

భర్తకు తోడుగా, పార్టీకి అండగా.. JMM విజయం వెనుక కల్పన

image

ఝార్ఖండ్‌లో JMM విజయం వెనుక కల్పనా సోరెన్ పాత్ర కీలకం. భర్త హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఆమె పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 39 ఏళ్లకే ఎంతో పరిణతితో వ్యవహరించారు. పార్టీ, కుటుంబ గొడవలను చాకచక్యంగా డీల్ చేశారు. గాండేయ్ బైఎలక్షన్‌లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. హేమంత్ జైలు నుంచి వచ్చాక ఆయనతో కలిసి 200 సభల్లో పాల్గొన్నారు. భర్తకు తోడుగా, పార్టీకి అండగా నిలబడి విజయతీరాలకు చేర్చారు.

News November 23, 2024

14 ఏళ్లలో మూడు సార్లే.. ప్రతిసారి KL రాహుల్ తోడు!

image

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 150కే ఆలౌట్ అయిన టీమ్ఇండియా, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ పడకుండా 172 రన్స్ చేయగలిగింది. గత 14 ఏళ్లలో ’SENA‘ దేశాలపై టెస్టుల్లో టీమ్ఇండియా కేవలం 3 సార్లు 100+రన్స్ భాగస్వామ్యం చేయగలిగినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. లార్డ్స్‌లో రోహిత్-KL రాహుల్, సెంచూరియన్‌లో మయాంక్-రాహుల్, ఇప్పుడు పెర్త్‌లో జైస్వాల్-రాహుల్ 100+ రన్స్ పార్ట్‌నర్‌షిప్ చేయగలిగారు.

News November 23, 2024

డే2: భారత్ 172/0

image

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 172 రన్స్ చేసింది. మొత్తంగా 218 పరుగుల లీడ్ సాధించింది. యశస్వీ జైస్వాల్(90), కేఎల్ రాహుల్(62) నిలకడగా ఆడుతున్నారు.

News November 23, 2024

ఎదురుదెబ్బలను తట్టుకుని పీఠమెక్కారు

image

ఎగ్జిట్‌పోల్స్, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, అనేక ఎదురుదెబ్బలను తట్టుకుని ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఏడాదిలో తాను అరెస్టవడం, తర్వాత కీలక నేత చంపై సోరెన్, వదిన సీత కమలం గూటికి చేరినా ఆయన తగ్గలేదు. భార్య కల్పనతో కలిసి సుడిగాలి పర్యటనలు చేశారు. తనపై బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలను ఎండగడుతూనే ప్రజాకర్షక పథకాలతో ఓటర్ల మనసు గెలిచారు.

News November 23, 2024

సిక్సర్లలో జైస్వాల్ రికార్డు

image

టీమ్ ఇండియా బ్యాటింగ్ సెన్సేషన్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఫీట్ సాధించారు. టెస్టు ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (34) కొట్టిన క్రికెటర్‌గా నిలిచారు. 2014లో న్యూజిలాండ్ క్రికెటర్ మెక్కల్లమ్ 33 సిక్సర్లు బాదారు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైస్వాల్ 2 సిక్సర్లు కొట్టి మెక్కల్లమ్ రికార్డును బద్దలు కొట్టారు.

News November 23, 2024

56లక్షల ఫాలోవర్లున్న నటుడు.. వచ్చిన ఓట్లు 146

image

సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తామనుకోవడం భ్రమేనని మరోసారి రుజువైంది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్‌‌కు ఇన్‌స్టాలో 56లక్షల ఫాలోవర్లు ఉన్నారు. బయటా ఫ్యాన్‌బేస్ ఉంది. ఆయన మహారాష్ట్రలోని వెర్సోవాలో ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేశారు. 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయనకు కేవలం 146 ఓట్లే వచ్చాయి. విచిత్రంగా నోటాకు ఇక్కడ 874 ఓట్లు పడ్డాయి.

News November 23, 2024

‘కంగువా’ ఎఫెక్ట్.. నిర్మాతను ఆదుకోనున్న సూర్య?

image

రూ.350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నెల 14న రిలీజైన ఈ చిత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించలేదు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజాకు సాయం చేసేందుకు హీరో సూర్య ముందుకొచ్చినట్లు సమాచారం. చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ స్టూడియో గ్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిన్న మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. నామమాత్రపు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటారని టాక్.

News November 23, 2024

ఓటర్ల పరిణతి: నచ్చిన కూటమికి మెచ్చిన తీర్పు

image

పాలకులను ఎన్నుకోవడంలో ప్రజలు అత్యంత పరిణతి ప్రదర్శిస్తున్నారు. ఊగిసలాట, గందరగోళం, హంగ్ పరిస్థితికి అస్సలు తావివ్వడం లేదు. గెలిపించాలనుకున్న వారికే ఓట్లేస్తున్నారు. కోరుకున్న కూటమికే అధికారం అప్పగిస్తున్నారు. నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ భారీ మెజారిటీ అందిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో మహాయుతికి 220, ఝార్ఖండ్‌లో JMM+కు 55, మొన్న హరియాణాలో BJPకి 48, జమ్మూకశ్మీర్లో NCకి 42 సీట్లు ఇవ్వడమే ఉదాహరణ.

News November 23, 2024

చంద్రబాబూ.. నిజం కూడబలుక్కుని చెప్పండి: అంబటి

image

AP: దేశంలో ‘జమిలి’ వచ్చినా రాష్ట్రంలో 2029లోనే ఎన్నికలుంటాయన్న సీఎం చంద్రబాబు <<14686913>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘2027లోనే జమిలి అని బీజేపీ అంటోంది. జమిలి వచ్చినా 2029లోనే ఏపీ ఎన్నికలు అని చంద్రబాబు అంటున్నారు. నిజం కూడబలుక్కుని చెప్పండి’ అని ట్వీట్ చేశారు.