India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్ర ఫలితాలు అపర చాణక్యుడిగా పేరొందిన శరద్ పవార్‌కు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన పార్టీ కేవలం 13 స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 2019లో 54, 2014లో 41, 2009లో 62, 2004లో 71 సీట్లు గెలిచిన శరద్ పవార్ సారథ్యంలోని NCP ఈ ఎన్నికల్లో చతికిలపడింది. 86 స్థానాల్లో పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయింది. NCP SP మనుగడ ఇక కష్టమని పలువురు విశ్లేషిస్తున్నారు.

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితాల్లో ప్రస్తుతం ఆమె 4 లక్షల మెజార్టీ వైపు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ 3.64 లక్షల మెజార్టీ సాధించగా ఇప్పుడు ఆమె తన సోదరుడి మెజార్టీని బీట్ చేశారు. ప్రియాంకకు 5 లక్షల మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా ఆకుల సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తన ప్రియుడు యశ్ పాల్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. యష్‌కు ఇప్పటికే పెళ్లయ్యిందని, అయితే అతడు తన భార్యకు విడాకులు ఇచ్చాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. TGలోని మంథనికి చెందిన సోనియా పలు సినిమాల్లోనూ నటించారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతికి కొత్త తలనొప్పి మొదలైంది. ఫడణవీసే సీఎం అని బీజేపీ చెబుతుండగా ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిండే భిన్నంగా స్పందించారు. సీఎం ఎవరనేదానిపై మహాయుతి కూటమి కూర్చొని చర్చిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు తన భర్త కూడా సీఎం రేసులో ఉన్నారని అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ అన్నారు.

తమ పార్టీ ఖాతాలో రూ.1,449 కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నివేదిక ఇచ్చింది. దీంతో దేశంలోనే రిచ్చెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. మరే పార్టీ ఖాతాలో ఇంత భారీ ఎత్తున నగదు లేదు. వైసీపీ ఖాతాలో రూ.29 కోట్లు మాత్రమే ఉన్నాయి. టీడీపీ-రూ.272 కోట్లు, డీఎంకే-రూ.338 కోట్లు, సమాజ్‌వాదీ-రూ.340 కోట్లు, జేడీయూ ఖాతాలో రూ.147 కోట్లు ఉన్నాయి.

2024 లోక్‌సభ పోరు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ట్రెండ్ కనిపిస్తోంది. NDA కీలక, INDIA అప్రధాన రాష్ట్రాలను గెలుస్తోంది. ఇక కాంగ్రెస్ లీడ్ రోల్ పోషించడమే లేదు. హరియాణాలో BJP ఘన విజయం అందుకుంటే JKలో NC సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ చేరలేదు. ఇప్పుడు ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యమున్న మహారాష్ట్రను బీజేపీ+ కైవసం చేసుకుంది. ఝార్ఖండ్‌లో JMM 30, కాంగ్రెస్ 15తో ఉన్నాయి.

ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని వార్తలు వస్తున్నాయి. జైలుకు వెళ్లి రావడం ఆయనకు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం మయ్యా యోజన కింద మహిళలకు రూ.2,500 ఇస్తామనడం కూడా ఓట్లు రాలడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కర్ణాటక ఉపఎన్నికలో కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. శిగ్గావ్‌లో బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైపై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ గెలుపొందారు. మరోవైపు సందూర్‌లో కాంగ్రెస్ క్యాండిడేట్ అన్నపూర్ణ ఘన విజయం సాధించారు. దీనిపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మూడుచోట్ల ఉపఎన్నిక జరగ్గా చన్నపట్నలోనూ కాంగ్రెస్ అభ్యర్థి యోగీశ్వర ముందంజలో ఉన్నారు.

కేరళ వయనాడ్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ గెలుపు దిశగా సాగుతున్నారు. అయితే ఈమెపై ఓ తెలుగు వ్యక్తి జాతీయ జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. తిరుపతికి చెందిన ఆయన పేరు దుగ్గిరాల నాగేశ్వరరావు. ఈయన పార్టీకి అధ్యక్షుడు కూడా. AP ప్రత్యేక హోదా అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, జాతీయ స్థాయిలో వినిపించాలనే పోటీ చేస్తున్నానన్నారు. ఆయనకు ప్రస్తుతానికి 273 ఓట్లు వచ్చాయి.

మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఆయన ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఫడణవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఆధిక్యంలో ఉండగా ఇప్పటికే ఆయన ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఆయనతో మహారాష్ట్ర బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు చంద్రశేఖర్ తాజాగా భేటీ అయ్యారు.
Sorry, no posts matched your criteria.