India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన శరీర రంగు విషయంలో చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని హీరోయిన్ భూమి శెట్టి తెలిపారు. ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘రంగుపై ఇతరుల మాటలతో ఎంతో బాధపడ్డా. ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏవైనా క్రీమ్స్ వాడాలని చెప్పేవారు. ఇప్పటికీ ఇన్‌స్టాలో ఫొటోలకు నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు వాటిని పట్టించుకోవట్లేదు. నా అందం గురించి నాకు తెలుసు’ అని పేర్కొన్నారు.
AP: ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13న జరగాల్సిన డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసినట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. కాగా 38 DyEO పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
TS: రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్ వేయనున్నారు. తనను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలున్నా, ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొననున్నారు. కవిత తరఫున కపిల్ సిబాల్, రోహత్గీ కోర్టులో వాదించనున్నారు.
WPL ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ప్లేయింగ్11
ఢిల్లీ: మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, మిన్ను మణి
ఆర్సీబీ: మంధాన, సోఫీ డివైన్, మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్, ఆశా శోభన
టాలీవుడ్ నటి పావని రెడ్డి తన ప్రియుడు ఆమిర్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. తన పుట్టినరోజైన నవంబర్ 9న ఏడడుగులు వేయనున్నట్లు తెలిపారు. తెలుగులో గౌరవం, లజ్జ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారి 111 తదితర చిత్రాలతోపాటు పదికిపైగా సీరియళ్లలో ఈమె నటించారు. 2013లో తెలుగు నటుడు ప్రదీప్‌ను ఈమె పెళ్లిచేసుకోగా, అతను 2017లో ఆత్మహత్య చేసుకున్నారు. రెండేళ్లుగా తమిళ నటుడు ఆమిర్‌తో సహజీవనం చేస్తున్నారు.
ఏపీ ప్రజలు 2 సంకల్పాలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తొలి సంకల్పం కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం. రెండో సంకల్పం APలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం. ఇవి మనసులో పెట్టుకుని ప్రజలు ఓటేయాలి. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేస్తోంది. NDA సర్కారును గెలిపిస్తే AP అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా’ అని వెల్లడించారు.
టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ను ప్రజాగళం సభలో ప్రధాని మోదీ తలచుకున్నారు. ‘శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారకరామారావు గుర్తొస్తారు. పేదల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన సేవల్ని మనం కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే దెబ్బతీసిన విషయాన్ని మరచిపోకూడదు’ అని వ్యాఖ్యానించారు.
ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాం తిరుపతిలో ఐఐటీ, ఐసర్, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం’ అని తెలిపారు.
ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చిలకలూరిపేట సభలో విమర్శలు చేశారు. ‘రాష్ట్ర మంత్రులు అవినీతి, అక్రమాల్లో పోటీ పడుతున్నారు. ఒకరికి మించి ఒకరు అవినీతి చేస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదు. ఈ రెండూ కుటుంబ పార్టీలే. YCPని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. YCP అవినీతితో APలో గత ఐదేళ్లు అభివృద్ధి జరగలేదు. రాబోయే 5 ఏళ్లు APకి కీలకం. ఎన్నికల్లో ఓటు చీలకుండా NDAను గెలిపించాలి’ అని కోరారు.
AP ప్రజల కోసం చంద్రబాబు, పవన్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ప్రజల కోసం వాళ్లిద్దరూ ఎంతో కష్టపడుతున్నారు. చంద్రబాబు రాకతో NDA మరింత బలపడింది. డబుల్ ఇంజిన్ సర్కారుతో మన లక్ష్యాలు నెరవేరుతాయి. అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే.. ఇక్కడ ఎన్డీఏ గెలవాలి. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ NDA సమన్వయం చేస్తుంది. అందుకే ఏపీలో NDA గెలవాలి’ అని ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.