News August 24, 2024

అఫైర్ పెట్టుకొని మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని గొంతు కోశాడు

image

తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఆమె గొంతుకోసి చంపేశాడో కసాయి. UPలోని హర్దోయ్‌లో జరిగిందిది. మాన్సీ పాండే (22) రక్షాబంధన్ రోజు మణికంఠ్ ద్వివేది ఇంటికెళ్లింది. ఆమె లేచిపోయిందని, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని తండ్రి రామ్‌సాగర్‌కు చెప్పాడు వివాహితుడైన మణి. డౌట్‌తో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను చంపి, మొబైల్‌ను రన్నింగ్ బస్‌లో పడేశాడని తెలిసింది.

News August 23, 2024

సమయం వచ్చేసింది: శుభవార్త చెప్పిన US ఫెడ్

image

యూఎస్ ఫెడరల్ రిజర్వు ఛైర్‌పర్సన్ జెరోమ్ పావెల్ శుభవార్త చెప్పారు. వడ్డీరేట్ల కోతకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మదుపరులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాక్సన్ హాల్ సింపోసియంలో ఆయన మాట్లాడారు. ‘ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు తగ్గిపోయాయి. యూఎస్ లేబర్ మార్కెట్ పరిస్థితి మెరుగైంది’ అని ఆయన అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత అమెరికాలో వడ్డీరేట్లు 23 ఏళ్ల గరిష్ఠానికి పెంచారు.

News August 23, 2024

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నిందితుడు స్కూల్ టాపర్

image

కోల్‌కతా హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ గురించి అతడి తల్లి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు. అతడు స్కూల్ టాపర్. NCC క్యాడెట్. స్పోర్ట్స్, బాక్సింగ్‌ అంటే ఇష్టపడేవాడు. నా కొడుకు ఇలా చేయడం వెనుక ఎవరున్నారో తెలియదు. ఎవరైనా ఉంటే వారిని కూడా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. తాను కఠినంగా ఉండుంటే ఇలా జరిగేది కాదని ఆమె వాపోయారు.

News August 23, 2024

యువత రెజ్యూమ్ ప్రభుత్వమే తయారుచేస్తుంది: లోకేశ్

image

AP: స్కిల్ సెన్సస్ సర్వేపై అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘యువత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, స్కిల్ ప్రొఫైల్స్‌ను స్కిల్ సెన్స‌స్‌లో క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుంది. వాటిని ప్రముఖ కంపెనీలకు పంపుతుంది. తద్వారా ఆయా కంపెనీలు త‌మ‌కు అవసరమైన యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొస్తాం’ అని తెలిపారు.

News August 23, 2024

కాంగ్రెస్‌లోకి వినేశ్: హరియాణా మాజీ CM ఏమన్నారంటే..

image

రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న వార్తలపై హరియాణా మాజీ సీఎం భూపేందర్ హుడా స్పందించారు. అది హైపోథెటికల్ క్వశ్చన్ అన్నారు. ‘అథ్లెట్లు ఏ పార్టీకీ చెందరు. ఎవరైనా చేరితే మీకు తెలియజేస్తాం. ఎవరు చేరినా మేం స్వాగతిస్తాం. అది ఆమె నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. స్వర్ణ పతక విజేత స్థాయిలోనే ఆమెను గౌరవించాలి. సచిన్‌ టెండూల్కర్‌లా రాజ్యసభకు నామినేట్ చేయాలి. ఆమెకు అన్యాయం జరిగింది’ అని అన్నారు.

News August 23, 2024

విదేశాలకు రహస్యంగా లోకేశ్: వైసీపీ

image

AP: మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని YCP ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా ఈరోజు మ.1.30 గంటలకు శంషాబాద్‌కు, ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ ఫ్లైట్‌లో రహస్యంగా వెళ్లారు. రెండు వారాల్లో ఇది రెండోసారి. మంత్రిగా ఉన్న లోకేశ్ తన టూర్ వివరాలను అధికారికంగా విడుదల చేయడానికి ఇబ్బంది ఏముంది? ఇంతకూ ఏ దేశానికి వెళ్లారు?’ అని Xలో ప్రశ్నించింది.

News August 23, 2024

ఉక్రెయిన్‌లో మోదీ: అమెరికా స్పందించిన తీరిది

image

ఉక్రెయిన్‌లో నరేంద్రమోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. యుద్ధ సంక్షుభిత దేశానికి ఇదెంతో సాయపడుతుందని పేర్కొంది. ‘జెలెన్ స్కీ కోరుకుంటున్నట్టు యుద్ధం ముగింపు వైపు ప్రధాని మోదీ పర్యటన సాగితే నిజంగా అదెంతో ఉపయోగకరం’ అని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఇదెంతో కీలక పర్యటన అని, చాలా సంతోషంగా ఉందని యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రిచర్డ్ ఆర్ వర్మ తెలిపారు.

News August 23, 2024

రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మె విరమణ

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఈనెల 14 నుంచి తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు విరమించారు. తమ ఆందోళనలకు ఉన్నతాధికారుల నుంచి స్పందన వచ్చిందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రేపటి నుంచి యథావిధిగా డ్యూటీల్లో పాల్గొననున్నట్లు జూడాల ప్రతినిధులు తెలిపారు.

News August 23, 2024

గ్యాస్ కనెక్షన్ ఉందా.. ఇది చేస్తున్నారా? లేదా?

image

వంట గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాక ప్రతి ఐదేళ్లకోసారి తనిఖీలు తప్పనిసరి. కొన్ని కంపెనీలు తమ సిబ్బందిని పంపించి ఉచితంగా తనిఖీ చేయిస్తాయి. మరికొన్ని ఛార్జీలు వసూలు చేస్తాయి. ఒకవేళ మీ ఇంటికి గ్యాస్ కనెక్షన్‌ తీసుకొని ఐదేళ్లు దాటినా తనిఖీ జరగకపోతే మీరు వెంటనే ఏజెన్సీని సంప్రదించండి. గ్యాస్ సిలిండర్ పేలుడు వంటి ప్రమాదాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేస్తారు. > SHARE

News August 23, 2024

వైసీపీ 15 విభాగాలకు కొత్త అధ్యక్షులు

image

AP: పార్టీలోని 15 విభాగాలకు YCP చీఫ్ జగన్ కొత్త అధ్యక్షులను నియమించారు. లీగల్ సెల్-మనోహర్ రెడ్డి, సాంస్కృతిక విభాగం-వంగపండు ఉష, ఐటీ-సునీల్, వికలాంగుల విభాగం-కిరణ్ రాజు, గ్రీవెన్స్-నారాయణమూర్తి, టీచర్స్ ఫెడరేషన్-రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రైతు విభాగం-నాగిరెడ్డి, మహిళా విభాగం-వరుదు కళ్యాణి, ట్రేడ్ యూనియన్-గౌతమ్‌రెడ్డి, మైనార్టీ సెల్-ఖాదర్ బాషా, ఎస్టీ సెల్-విశ్వేశ్వరరాజు.