News August 22, 2024

వడ్డీ లేకుండా రూ.3లక్షల రుణం!

image

AP: చేతివృత్తుల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న PM విశ్వకర్మ <>యోజనను<<>> రాష్ట్రంలోని ‘ఆదరణ’ స్కీమ్‌తో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో ఎంపికైన వారికి 2 విడతల్లో ₹3 లక్షల రుణం అందిస్తారు. బ్యాంకులు విధించే 13% వడ్డీలో కేంద్రం 8% భరిస్తుండగా, మిగిలిన 5% వడ్డీని రాష్ట్రం చెల్లించనుంది. దీంతో లబ్ధిదారులకు వడ్డీ లేకుండానే రుణం అందనుంది. ఆ రుణంలోనూ కొంత రాయితీగా ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది.

News August 22, 2024

బెంగాల్ ప్రభుత్వ తీరుపై SC అసంతృప్తి

image

ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసు నమోదు చేసిన సమయాన్ని బెంగాల్ ప్రభుత్వం చెప్పలేకపోతోందని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు న‌మోదు చేయ‌క‌ముందే పోస్టుమార్టం నిర్వ‌హించారా? అని ప్ర‌శ్నించింది. అస‌హ‌జ మ‌రణంగా ఎప్పుడు న‌మోదు చేశారో చెప్పాలని కేసు ఎంట్రీ చేసిన అధికారిని ఆదేశించింది. ఇటువంటి రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును త‌న 30 ఏళ్ల స‌ర్వీసులో ఎన్నడూ చూడ‌లేద‌ని జ‌స్టిస్ పార్దివాలా వ్యాఖ్యానించారు.

News August 22, 2024

విమానంలో ఇంటర్నెట్ వాడుకోవచ్చా?

image

విమానాల్లో వైఫై ద్వారా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లలో ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వైఫై అందిస్తోన్న ఏకైక భారతీయ విమానయాన సంస్థ విస్తారా మాత్రమే. తాజాగా ఎయిరిండియా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. వైఫై వేగాన్ని బట్టి రుసుము వసూలు చేస్తారు. విమానంలో శాటిలైట్ లేదా గ్రౌండ్ సిస్టమ్ ఆధారంగా వైఫైకి సిగ్నల్స్ వస్తాయి. అయితే పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం, హై క్వాలిటీ వీడియోలు చూడటాన్ని అనుమతించరు.

News August 22, 2024

ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది చంద్రబాబూ?: జగన్

image

AP: ఒక మాజీ MLA తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవని జగన్ విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ‘పెద్దారెడ్డి SPకి సమాచారం ఇచ్చి వెళ్లినా TDP మూకలు అడ్డుకున్నాయి. ఆయన ఇంటిని తగలబెట్టి, వాహనాలను ధ్వంసం చేశాయి. ఇన్ని దారుణాలు జరుగుతుంటే నేరం చేయాలంటేనే భయపడాలంటూ CBN కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?’ అని Xలో ఫైరయ్యారు.

News August 22, 2024

రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారు: కేటీఆర్

image

TG: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. రుణమాఫీపై ప్రభుత్వం కోతలతో రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు. చేవెళ్లలో BRS నేతల ధర్నాలో ఆయన మాట్లాడారు. హామీల అమలు గురించి అడిగితే నిండు సభలో సబితను అవమానించారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఓట్లు వేసి అమలు చేయకుండా రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారన్నారు.

News August 22, 2024

ప్రమాదంపై వైసీపీ vs టీడీపీ

image

AP: అచ్యుతాపురం పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ, వైసీపీ విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ ప్రభుత్వంలో తెచ్చిన ప్రమాణాలను అటకెక్కించారని YCP విమర్శించింది. ప్రజల శవాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ మండిపడింది. వైసీపీ హయాంలో 16 ఘటనలు జరిగి 70 మంది చనిపోయారని, ఇవేనా మీరు తెచ్చిన భద్రతా ప్రమాణాలు అని కౌంటర్ ఇచ్చింది.

News August 22, 2024

‘సెజ్’ ఘటన కలచివేసింది: సీఎం చంద్రబాబు

image

AP: అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని CM చంద్రబాబు అన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు. ‘గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. వాటిని బాగుచేసే క్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. 17 మంది చనిపోయారు. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి అందుతున్న వైద్యంపై నిత్యం సమీక్ష చేస్తున్నాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయిస్తాం’ అని తెలిపారు.

News August 22, 2024

ఈ జిల్లాల్లో మొదలైన వర్షం

image

TG: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వాన పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News August 22, 2024

బెంగాల్ ప్రభుత్వంపై CBI సంచలన ఆరోపణలు

image

ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వంపై CBI సంచలన వ్యాఖ్యలు చేసింది. ఘ‌ట‌న జ‌రిగిన ఐదురోజుల త‌రువాత‌ తాము దర్యాప్తు ప్రారంభించే సమయానికి సాక్ష్యాలను తారుమారు చేశార‌ని ఆరోపించింది. గురువారం సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ సంద‌ర్భంగా కీల‌క విష‌యాలు వెల్ల‌డించింది. ఈ కేసులో బాధితురాలి మృత‌దేహాన్ని ద‌హ‌నం చేసిన త‌రువాతే ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని, సాక్ష్యాలను కప్పిపుచ్చారని పేర్కొంది.

News August 22, 2024

తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు: సీఎం

image

AP: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ₹50లక్షలు ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా గాయపడిన వారికి ₹25లక్షలు ఇస్తామన్నారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం వారి కుటుంబీకులతో ఆయన మాట్లాడారు. వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. కాగా మృతుల కుటుంబాలకు ₹కోటి చొప్పున ఇస్తామని కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.