India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇవాళ గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో SRH గెలుపొందితే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరనుంది. దీంతో పాటు 19న PBKSతో మ్యాచ్‌లోనూ SRH గెలుపొందితే పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుతుంది. ఇది జరిగితే పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కమిన్స్ సేన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడనుంది. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడినా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహించింది. దీనిపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది.
బిహార్‌లోని కారాకట్ లోక్‌సభ నియోజకవర్గంలో భోజ్‌పురి సింగర్, నటుడు పవన్‌సింగ్‌పై తన తల్లి ప్రతిమాదేవి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులే. తొలుత బెంగాల్‌లోని అసన్‌సోల్ అభ్యర్థిగా పవన్‌సింగ్‌ను BJP ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో పవన్ పోటీ నుంచి తప్పుకొని, కారాకట్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. అక్కడా NDA అభ్యర్థి బరిలో ఉండటంతో.. పోటీ నుంచి తప్పుకోవాలని BJP హెచ్చరించింది.
ఇంట్లో వండుకునే ఆహారమైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమని ICMR తాజా మార్గదర్శకాల్లో తెలిపింది. కొవ్వు, చక్కెర, ఉప్పు, నూనె అధికంగా ఉంటే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించింది. రోజుకు ఉప్పు 5 గ్రాములు, చక్కెర 25 గ్రాములు మించరాదని స్పష్టం చేసింది. విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాన్నే ప్రజలు ప్రాధాన్యంగా తీసుకోవాలని పేర్కొంది.
విదేశీ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ కోసం IPLను కీలక దశలో వదిలి వెళ్లడాన్ని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తప్పుబట్టారు. ‘సీజన్ మొత్తం అందుబాటులో ఉండండి. లేదంటే రావద్దు!’ అని ట్వీట్ చేశారు. T20WC జూన్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెటర్లు బట్లర్, జాక్స్ వంటి ప్లేయర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. మరోవైపు IPL ప్లేఆఫ్స్ ముంగిట ఉంది. కీలక ప్లేయర్లు లేక మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగడం లేదు.
TG: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగియనుంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఫస్టియర్, మ.2:30 నుంచి సా.5:30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP: రాష్ట్ర పోలీసులు ఎన్డీయే కూటమికి సపోర్ట్ చేసినా మరోసారి వైసీపీనే గెలుస్తుందని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘కూటమిలో 4వ పార్ట్‌నర్‌గా పోలింగ్ రోజున ఏపీ పోలీస్ చేరి ఫైట్ చేసినా జగన్ అన్నదే విజయం!’ అని ట్వీట్ చేశారు.
తన తల్లి మరణం మరో ఐదుగురికి పునర్జన్మనిస్తుందని తెలుసుకున్న లక్ష్మీదేవమ్మ కుటుంబసభ్యులు.. అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. NIMS హాస్పిటల్‌లో ఆమె చనిపోగా.. 2 కిడ్నీలు, కాలేయం & 2 నేత్రాలను దానం చేసినట్లు ‘జీవన్‌దాన్’ ట్వీట్ చేసింది. అన్నిదానాల కంటే అవయవదానం ఎంతో గొప్పది. కానీ, దీనికి చాలా మంది ముందుకురారు. దీంతో అవయవాలు అందుబాటులో లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏపీ సీఎం జగన్ నేడు విజయవాడలోని ఎన్నికల వ్యూహ సంస్థ ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఆ సంస్థ ఆఫీసుకు మ.12 గంటలకు చేరుకుని అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కొన్ని బహుమతులూ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
AP: రాష్ట్రంలోని ఎంపిక చేసిన 12 జిల్లాల్లో నేటి నుంచి క్షయ నియంత్రణ టీకా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే హైరిస్క్ ఉన్న బాధితుల గుర్తింపు ప్రక్రియను వైద్యశాఖ పూర్తి చేసింది. టీబీ చరిత్ర కలిగిన వారితో పాటు రోగుల కుటుంబ సభ్యులు, ధూమపానం చేసేవారు, మధుమేహం వ్యాధిగ్రస్థులు, తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులకు తొలుత టీకాలు వేస్తారు. 12 జిల్లాల్లో ఈ వర్గాల వారు 50 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేశారు.
Sorry, no posts matched your criteria.